Marigold Farming: ఇంట్లో బంతిపువ్వు మొక్కలను పెంచుకోవాలనుకుంటున్నారా.. ఎక్కువ పువ్వులు పూయాలంటే ఈ ఎరువు ఉత్తమం..
బంతి పువ్వు మొక్కల పెరుగుదల కోసం తగిన పోషకాలను అందించడానికి గుడ్డు పెంకులతో తయారు చేసిన ఎరువులు ఉపయోగించవచ్చు. కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు కోడి గుడ్డు పెంకులో ఉంటాయి. కనుక గుడ్డు పెంకులు మొక్కలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. గుడ్డు పెంకుల సహాయంతో సులభంగా ఇంట్లో ఎరువులు తయారు చేయవచ్చు. ఇంట్లో బంతిపువ్వుల మొక్కలను పెంచుకోవాలంటే.. వాటిని జాగ్రత్తగా ఆరోగ్యంగా పెంచుకోవడానికి ఇంట్లో ఉండే వస్తువులనే ఎరువులను ఉపయోగించవచ్చు.
బంతుపువ్వులు అందం, రంగు, మనోహరమైన సువాసన కోసం చాలా ప్రసిద్ధి చెందాయి. ఇంకా చెప్పలంటే బంతిపువ్వు స్థిరత్వానికి ప్రతీక. ఈ మొక్కలు తోటకు అందాన్ని ఇస్తాయి. పూజలో, ఇంటి అలంకరణలో బంతి పువ్వులకు విశిష్టస్థానం ఉంది. సీజనల్ మొక్కలైన బంతిపువ్వులను పెంచుకోవడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. అయితే ఈ మొక్కలను పెంచుకోవడంలో కొన్ని పద్ధతులున్నాయి. అవి ఎండిపోతే మనస్సు విచారంలో నిండిపోతుంది. బంతిపువ్వు మొక్కల చెట్లు పువ్వులతో నిండి అందంగా కనిపించాలని కోరుకుంటారు. అయితే ఇంట్లో బంతిపువ్వుల మొక్కలను పెంచుకోవాలంటే.. వాటిని జాగ్రత్తగా ఆరోగ్యంగా పెంచుకోవడానికి ఇంట్లో ఉండే వస్తువులనే ఎరువులను ఉపయోగించవచ్చు.
బంతి పువ్వుకు ఏ ఎరువులు ఉత్తమం?
బంతి పువ్వు మొక్కల పెరుగుదల కోసం తగిన పోషకాలను అందించడానికి గుడ్డు పెంకులతో తయారు చేసిన ఎరువులు ఉపయోగించవచ్చు. కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు కోడి గుడ్డు పెంకులో ఉంటాయి. కనుక గుడ్డు పెంకులు మొక్కలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. గుడ్డు పెంకుల సహాయంతో సులభంగా ఇంట్లో ఎరువులు తయారు చేయవచ్చు.
గుడ్డు పెంకులతో ఎరువులు ఎలా తయారు చేయాలంటే?
కంపోస్ట్ తయారీకి అవసరమైన పదార్థాలు
- గుడ్డు పెంకులు
- మిక్సి లేదా గ్రైండర్
- నీరు
- ఒక కుండ
గుడ్డు పెంకుల నుంచి ఎరువులు తయారు చేసే పద్ధతి
- గుడ్డు పెంకులను కడిగి ఆరబెట్టండి.
- దీని తరువాత చిన్న ముక్కలుగా చేయండి
- తరువాత ఆ చిన్న ముక్కలను మిక్సి లేదా గ్రైండర్ ఉపయోగించి కూడా పొడిగా చేయండి.
- గుడ్డు షెల్ ముక్కలను లేదా పొడిని ఒక పాత్రలో ఉంచండి.
- ఈ పాత్రలో నీరు పోసి మూతపెట్టి కొన్ని రోజులు ఉంచాలి.
- ప్రతి 1-2 రోజులకు మిశ్రమాన్ని కదిలించండి.
- సుమారు 2 నుంచి 4 వారాల తరువాత కంపోస్ట్ సిద్ధంగా ఉంటుంది.
- ఇప్పుడు బంతి పువ్వు మొక్కను నాటిన మట్టిలో ఈ గుడ్డు పెంకు కంపోస్ట్ ను ఉపయోగించవచ్చు.
- బంతి పువ్వు మొక్కలకు గుడ్డు పెంకు ఎరువు అత్యంత ప్రయోజనకారి
ఏఏ పోషకాలు లభిస్తాయంటే..
- బంతి పువ్వు మొక్కకు అవసరమైన పోషకాలను అందిస్తుంది.
- ఇది నేల నీటిని నిల్వ చేసే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
- గుడ్డు పెంకులతో తయారు చేసిన కంపోస్ట్ నేల సారాన్ని పెంచుతుంది.
- ఇది తెగుళ్లు, వ్యాధులను మొక్కల నుంచి దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది.
ఏ విధంగా మొక్కలను పెంచుకోవాలంటే..
- బంతి పువ్వు మొక్కలకు క్రమం తప్పకుండా నీరు పెట్టండి. నేలను ఎండిపోనివ్వవద్దు. అదే సమయంలో అవసరానికి మించి నీరు నిల్వ చేయవద్దు.
- బంతి పువ్వు మొక్కలకు కనీసం 6 గంటల సూర్యరశ్మిని అందించండి. మొక్కలకు సూర్యరశ్మి అవసరం.
- బంతి పువ్వు మొక్కలు ఆరోగ్యంగా ఉండాలంటే చుట్టుపక్కల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.
- సహజసిద్ధమైన పురుగుమందులను ఎప్పటికప్పుడు పిచికారీ చేస్తూ ఉండండి
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..