Nirjala Ekadashi 2024: ఈ నెల 18న నిర్జల ఏకాదశి.. పూజ శుభ సమయం, నియమాలు ఏమిటంటే..

సంవత్సరంలోని అన్ని ఏకాదశులలో ఉపవాసం ఉండలేని వ్యక్తి ఈ ఏకాదశి రోజున ఉపవాసం చేసినా ఇతర ఏకాదశిలను చేసిన ఫలితాలను పొందవచ్చని చెబుతారు. ఈ సంవత్సరం నిర్జల ఏకాదశి వ్రతం 18 జూన్ 2024 న జరుపుకోనున్నారు. అటువంటి పరిస్థితిలో నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం చేయనున్నట్లయితే..నిర్జల ఏకాదశి పూజ సమయం, కావాల్సిన వస్తువులు గురించి ఈ రోజు తెలుసుకుందాం..

Nirjala Ekadashi 2024: ఈ నెల 18న నిర్జల ఏకాదశి.. పూజ శుభ సమయం, నియమాలు ఏమిటంటే..
Ekadashi Puja Tip
Follow us

|

Updated on: Jun 13, 2024 | 2:46 PM

నిర్జల ఏకాదశి సంవత్సరంలో అతిపెద్ద ఏకాదశిగా పరిగణించబడుతుంది. ఈ ఉపవాసం చాలా కష్టంగా పరిగణించబడుతుంది. శీఘ్ర ఫలితాలను ఇస్తుంది. నిర్జల ఏకాదశి ఉపవాస దీక్ష సమయంలో ఏమీ తినకుండా, తాగకుండా, చుక్క నీరు కూడా తాగకుండా ఆచరిస్తారు. ఏకాదశి తిథి విష్ణువుకు అంకితం చేయబడింది. ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా శ్రీ హరి విశేష ఆశీర్వాదాలు లభిస్తాయని.. ఇంట్లో సిరి సంపదలు ఉంటాయని నమ్ముతారు. ఏకాదశి రోజున పూజలు చేసి ఉపవాసం ఉండడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. ఈ సంవత్సరం నిర్జల ఏకాదశి వ్రతం 18 జూన్ 2024 న జరుపుకోనున్నారు. అటువంటి పరిస్థితిలో నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం చేయనున్నట్లయితే..నిర్జల ఏకాదశి పూజ సమయం, కావాల్సిన వస్తువులు గురించి ఈ రోజు తెలుసుకుందాం..

నిర్జల ఏకాదశి 2024 పూజ సామగ్రి జాబితా

శ్రీ మహా విష్ణువు,లక్ష్మిదేవిల విగ్రహం లేదా చిత్రపటం, ఒక పీటం, పసుపు లేదా ఎరుపు వస్త్రం, పండ్లు, పువ్వులు, లవంగాలు, మామిడి ఆకులు, కొబ్బరికాయ, తమలపాకులు, ధూపం, దీపం, దీపం, నెయ్యి, పసుపు చందనం, అక్షత, కుంకుం, తీపి పదార్థాలు, తులసి దళం, లక్ష్మీ దేవికి అలంకరణ వస్తువులు

నిర్జల ఏకాదశి 2024 శుభ ముహూర్తం

జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తిథి ప్రారంభం – జూన్ 17 ఉదయం 4.43 గంటలకు. జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తిథి ముగింపు – జూన్ 18 ఉదయం 7.28 గంటలకు. ఉదయతిథి ప్రకారం నిర్జల ఏకాదశి వ్రతం 18 జూన్ 2024న చేయాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

నిర్జల ఏకాదశి వ్రత ప్రాముఖ్యత

హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెలలో రెండు ఏకాదశి తిధులు వస్తాయి. ఒకటి కృష్ణ పక్షంలో మరొకటి శుక్ల పక్షంలో వస్తుంది. ప్రతి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువును పూజించే సంప్రదాయం ఉంది. ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వల్ల శ్రీ హరి ప్రసన్నడై తన భక్తులను అనుగ్రహిస్తాడని విశ్వాసం. అన్ని ఏకాదశులలోకి జ్యేష్ఠ శుక్ల పక్షంలోని నిర్జల ఏకాదశికి ముఖ్యమైన స్థానం ఉంది.

నిర్జల ఏకాదశి నాడు నీరు త్రాగకుండా ఉపవాసం ఉండాలనే నియమం ఉంది. సంవత్సరంలోని అన్ని ఏకాదశులలో ఉపవాసం ఉండలేని వ్యక్తి ఈ ఏకాదశి రోజున ఉపవాసం చేసినా ఇతర ఏకాదశిలను చేసిన ఫలితాలను పొందవచ్చని చెబుతారు. నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల అన్ని రకాల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు