Get Rid of Rats: ఇలా చేస్తే ఇంట్లో ఒక్క ఎలుక కూడా ఉండదు.. పారిపోవాల్సిందే!
నెక్ట్స్ ఇప్పుడు వచ్చేది అంతా రెయినీ సీజన్. ఈ సీజన్‌లో ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అనారోగ్య సమస్యల బారిన పడక తప్పదు. అదే విధంగా దోమలు, కీటకాల బెడద కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ క్రమంలోనే ఎలుకల జ్వరం కూడా వస్తూ ఉంటుంది. పరిశుభ్రత లోపించడం వల్ల కూడా ఎలుకల బెడద ఎక్కువ అవుతుంది. ఎలుకలు ఇంట్లో ఉన్నాయంటే.. అనారోగ్య సమస్యలు రావడం ఖాయం. వీటి వలన చాలా రకాల అంటు వ్యాధులు..
Updated on: Jun 13, 2024 | 5:31 PM

నెక్ట్స్ ఇప్పుడు వచ్చేది అంతా రెయినీ సీజన్. ఈ సీజన్‌లో ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అనారోగ్య సమస్యల బారిన పడక తప్పదు. అదే విధంగా దోమలు, కీటకాల బెడద కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ క్రమంలోనే ఎలుకల జ్వరం కూడా వస్తూ ఉంటుంది.

పరిశుభ్రత లోపించడం వల్ల కూడా ఎలుకల బెడద ఎక్కువ అవుతుంది. ఎలుకలు ఇంట్లో ఉన్నాయంటే.. అనారోగ్య సమస్యలు రావడం ఖాయం. వీటి వలన చాలా రకాల అంటు వ్యాధులు సోకుతాయి. ఎలుక మూత్రం ద్వారా సూక్ష్మ క్రిములు రిలీజ్ అయి.. జూనోటిక్ అనే వ్యాధి వస్తుంది.

ఈ వ్యాధి బారిన పడితే.. అకస్మాత్తుగా జ్వరం, వణుకు, కండరాల నొప్పి, మోకాళ్ల కింద నొప్పులు, వెన్ను నొప్పి, కళ్లు ఎర్రబడటం, కామెర్లు, చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారడం, కడుపులో నొప్పి, వాంతులు వంటి లక్షణాలు వస్తాయి. అలాగే కాలేయం, కిడ్నీలు, గుండె, మెదడు శరీర భాగాలు సరిగ్గా పని చేయవు.

ఇంట్లోంచి ఎలుకలు పారిపోవాలంటే.. దాల్చిన చెక్క బాగా ఉపయోగ పడుతుంది. ఒక గుడ్డలో కాల్చిన దాల్చిన చెక్క పెట్టి.. ఎలుకలు తిరిగే చోట పెట్టండి. ఈ వాసను అవి పారిపోతాయి. అదే విధంగా ఎలుకలు ఎక్కువగా తిరిగే చోట రాత్రి పూట బేకింగ్ సోడా పిచికారీ చేయాలి.

ఎలుకల బెడద తగ్గించుకోవడానికి కర్పూరం ఆయిల్ కూడా చక్కగా పని చేస్తుంది. కర్పూరం నూనెలో కాటన్ ముంచి.. కిటికీలు, తలుపులు, ఎలుకలు ఎక్కువగా తిరిగే ప్రదేశంలో ఉంచండి. ఇలా చేయడం వల్ల కూడా ఎలుకలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి.




