AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dog Temple: ఆ గ్రామంలో శునకాలకు ఆలయం.. గ్రామస్తులకు కుక్కలే దైవం.. ఏడాదికి ఓ సారి ఉత్సవాలు..

ఒకసారి గ్రామంలో ఉన్న రెండు కుక్కలు హటాత్తుగా అదృశ్యమయ్యాయి. కొన్ని రోజుల తరువాత దేవత స్వయంగా ఓ గ్రామస్తుడి కలలో కనిపించి.. గ్రామం, గ్రామస్తుల రక్షణ కోసం తన సమీపంలోని తప్పిపోయిన కుక్కల కోసం ఒక దేవాలయాన్ని నిర్మించమని కోరింది. దేవత చెప్పిన ఆజ్ఞను అనుసరించి కుక్కల కోసం ఆలయాన్ని నిర్మించారు. మిస్ అయిన కుక్కలను ఇక్కడ దేవుడిగా పూజిస్తారు. ఆలయం లోపల రెండు కుక్కల విగ్రహాలకు పూజలు చేస్తారు.

Dog Temple: ఆ గ్రామంలో శునకాలకు ఆలయం.. గ్రామస్తులకు కుక్కలే దైవం.. ఏడాదికి ఓ సారి ఉత్సవాలు..
Dog Temple
Surya Kala
|

Updated on: Jun 13, 2024 | 5:48 PM

Share

మన దేశం ఆధ్యాత్మికత నెలవు. ఇక్కడ దేవుళ్లకు మాత్రమే కాదు, పాము, పక్షులు, తేళ్లు,బులెట్ వంటి అనేక వింత ఆలయాలున్నాయి. అలాంటి వింత ఆలయంలో కుక్కలకు ఆలయం. అవును ఇక్కడ ‘కుక్క’ను దేవుడిగా పూజించే దేవాలయం ఉంది. ఈ వింత ఆలయం కర్ణాటకలోని చన్నపట్నలోని డాగ్ టెంపుల్. ఈ డాగ్ టెంపుల్ గురించి అన్ని ఆసక్తికరమైన విషయాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

ఈ ఆలయం ఎక్కడ ఉందంటే?

కర్ణాటకలోని చన్నపట్న నగరంలో అగ్రహార వలగెరెహళ్లి అనే చిన్న గ్రామం ఉంది. ఈ నగరం చెక్క బొమ్మలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దీనిని ‘బొమ్మల పట్టణం’ అని పిలుస్తారు. బెంగళూరు నగరానికి దాదాపు 60 కి.మీ దూరంలో ఉన్న ఈ దేవాలయం గురించి మన దేశంలో చాలా మందికి తెలియదు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఆలయానికి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటాయి.

కుక్క గుడి చారిత్రాత్మక కథ

ఈ ఆలయాన్ని 2010లో ధనిక వ్యాపారి రమేష్ నిర్మించారు. గ్రామంలోని ప్రధాన దేవత అయిన కెంపమ్మ దేవతకు అంకితం చేయబడిన కెంపమ్మ ఆలయాన్ని నిర్మించి ప్రసిద్ధి చెందాడు. గ్రామస్తుల కథనం ప్రకారం ఒకసారి గ్రామంలో ఉన్న రెండు కుక్కలు హటాత్తుగా అదృశ్యమయ్యాయి. కొన్ని రోజుల తరువాత దేవత స్వయంగా ఓ గ్రామస్తుడి కలలో కనిపించి.. గ్రామం, గ్రామస్తుల రక్షణ కోసం తన సమీపంలోని తప్పిపోయిన కుక్కల కోసం ఒక దేవాలయాన్ని నిర్మించమని కోరింది.

ఇవి కూడా చదవండి

దేవత చెప్పిన ఆజ్ఞను అనుసరించి కుక్కల కోసం ఆలయాన్ని నిర్మించారు. మిస్ అయిన కుక్కలను ఇక్కడ దేవుడిగా పూజిస్తారు. ఆలయం లోపల రెండు కుక్కల విగ్రహాలకు పూజలు చేస్తారు. ఈ కుక్కలు తమని ఎల్లపుడూ కాపాడతాయని.. ప్రతికూల శక్తిని దూరం చేస్తాయని గ్రామస్థులు నమ్ముతున్నారు. ఈ కాపలా కుక్కల గౌరవార్థం ప్రతి సంవత్సరం గ్రామంలో భారీ ఉత్సవం నిర్వహిస్తారు.

బొమ్మల పట్టణం

ఎవరైనా ఆఫ్‌బీట్ ప్రదేశాలను సందర్శించడానికి ఇష్టపడే వారైతే ఈ ఆలయాన్ని సందర్శించడానికి బెస్ట్ ఎంపిక. బొమ్మల పట్టణాన్ని ప్రపంచం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో సందర్శిస్తారు. అవును చన్నపట్న నగరం రంగురంగుల లక్క సామాగ్రి, చెక్క బొమ్మలు, బొమ్మల తయారీకి అత్యంత ప్రసిద్ధి చెందింది, ఇవి అద్భుతంగా కనిపిస్తాయి.

ఎలా చేరుకోవాలంటే

బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. బెంగుళూరు సిటీ రైల్వే స్టేషన్ ద్వారా చన్నపట్నకు చేరుకోవచ్చు. విమానాశ్రయం, రైల్వే స్టేషన్ల వెలుపల నుంచి చన్నపట్నకు నేరుగా బస్సు పొందవచ్చు. బడ్జెట్‌కు సరిపోయే క్యాబ్ లేదా టాక్సీని కూడా అద్దెకు తీసుకోవచ్చు. చన్నపట్న కేంద్రం నుంచి ఈ ఆలయం అగ్రహార వలగెరెహళ్లి గ్రామం లోపల దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు