AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamun Seeds: షుగర్ పేషెంట్స్‌కు దివ్య ఔషధం నేరేడు గింజల పొడి.. ఎలా తీసుకోవాలంటే..

ప్రస్తుత సీజనల్ లో ఎక్కువగా దొరికేవి నేరేడు పండ్లు.. వీటిని ఈ సీజన్ లో రోజుకు రెండు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలున్నాయనే విషయం అందరికీ తెలిసిందే.. ప్రస్తుతం మార్కెట్ లో ఎక్కడ చూసినా నేరేడు పండ్లు కనిపిస్తున్నాయి. మార్కెట్‌లో కిలో నేరేడు పండ్లు రూ. 300నుంచి రూ.400 లకు విక్రయిస్తున్నారు. ఈ పండులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్ ఉన్నాయి. ఇవి శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి.రోగనిరోధక వ్యవస్థకు సహాయపడతాయి. అయితే నేరేడు పండు తిని గింజలు పడేస్తారు. వీటి వలన కూడా అనేక ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయి.

Surya Kala

|

Updated on: Jun 13, 2024 | 8:39 PM

మధుమేహంతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అనియంత్రిత జీవనశైలి, వ్యాయామం పట్ల విముఖత, నిద్రలేమి ఇలాంటి అనేక చెడు అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని పెంచుతున్నాయి. అయితే ప్రస్తుతం మార్కెట్ లో దొరుకుతున్న నేరేడు పండుతో పాటు.. వీటి పొడి గింజలను తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

1 / 7
గుండె సంబంధిత సమస్యలున్న మధుమేహ రోగులు రక్తదానం చేయకూడదు. ఇది దాతకు శారీరక సమస్యలను కలిగిస్తుంది. నేటి కాలంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య 10 కోట్లుగా అధ్యయనాలు చెబుతున్నాయి. ఇటువంటి షుగర్ వ్యాధిగ్రస్తుల పాలిట నేరేడు పండ్లు దివ్వౌషధం అనే చెప్పాలి.

2 / 7
అయితే నేరేడు విత్తనాల్లో కూడా అనేక పోషకాలున్నాయి. పలు వ్యాధులను నివారిస్తాయి. అధిక శాతం ఫైబర్ ఉంటుంది. అంతేకాదు ఇది రోగనిరోధక వ్యవస్థకు పుష్టినిచ్చే అనేక పోషకాలతో నిండి ఉన్నాయి. అయితే నేరేడు గింజలు కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తాయి. అయితే ఈ నేరేడు గింజలను పొడి రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..

3 / 7
వేసవి పండ్లలో నేరేడు పండ్లు ఒకటి. ఇవి రుచికి తియ్యగా.. పుల్లగా ఉంటాయి. అందుకే ఇవి చాలా మందికి ఇష్టం. నేరేడు పండ్లు పోషకాలతో నిండి ఉంటాయి. ముఖ్యంగా మధుమేహం, హృద్రోగులకు నేరేడు పండ్లు చాలా మేలు చేస్తాయి.

4 / 7
ఎవరైనా మధుమేహంతో బాధపడుతున్నట్లయితే అధిక దాహం, తరచుగా మూత్రవిసర్జన వంటి అనేక లక్షణాలు ఉంటాయి. నేరేడు గింజలలోని ఆల్కలాయిడ్స్ ఈ లక్షణాలను నియంత్రిస్తాయి.  మధుమేహ సమస్యలను తగ్గిస్తాయి.

5 / 7
నేరేడు గింజల్లో ఫైబర్ కూడా ఉంటుంది. ఇది రక్తంలో అదనపు చక్కెరను విచ్ఛిన్నం చేయడానికి, చక్కర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే మధుమేహ వ్యాధిగ్రస్తులకు బరువును తగ్గిస్తుంది. జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

6 / 7
ముందుగా నేరేడు గింజల పై తొక్క తీసి ఎండలో ఆరబెట్టాలి. తర్వాత గింజలను మిక్సీలో మెత్తగా పౌడర్ గా చేసుకోవాలి. లేదా కొన్ని ఆయుర్వేద షాపుల్లో కూడా నేరేడు పండు విత్తనాల చూర్ణం దొరుకుతుంది. రోజూ ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ నేరేడు విత్తనాల పౌడర్ తీసుకోవాలి.

7 / 7
Follow us