Hema Malini: నా అందానికి కారణం మా అమ్మ చెప్పిన చిట్కాలే.. బ్యూటీ సీక్రెట్‌ రివీల్‌ చేసిన బాలీవుడ్‌ డ్రీమ్‌గర్ల్‌

|

Dec 06, 2022 | 8:51 AM

74 ఏళ్ల వయసులోనూ ఎంతో అందంగా ముగ్ధమనోహరంతో మెరిసిపోతూ ఉంటుంది హేమ మాలిని.  ఆకర్షణీయమైన రూపంతో సినిమాలు, టీవీషోలతో పాటు పలు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తోంది. ఇలా ఏడు పదుల వయసులోనూ ఇంత అందంగా కనిపించడానికి కారణమేంటో తెలుసా?

Hema Malini: నా అందానికి కారణం మా అమ్మ చెప్పిన చిట్కాలే.. బ్యూటీ సీక్రెట్‌ రివీల్‌ చేసిన బాలీవుడ్‌ డ్రీమ్‌గర్ల్‌
Hema Malini
Follow us on

హేమ మాలిని.. సినీ ప్రేమికులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. తనదైన అందం, అభినయంతో బాలీవుడ్‌ డ్రీమ్‌గర్ల్‌గా పేరు తెచ్చుకున్న ఈ అందాల తార ఇప్పటికీ తన నటనతో మైమరిపిస్తోంది. మరోవైపు రాజకీయాల్లోనూ బిజీగా ఉంటోంది. కాగా 74 ఏళ్ల వయసులోనూ ఎంతో అందంగా ముగ్ధమనోహరంతో మెరిసిపోతూ ఉంటుంది హేమ మాలిని.  ఆకర్షణీయమైన రూపంతో సినిమాలు, టీవీషోలతో పాటు పలు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తోంది. ఇలా ఏడు పదుల వయసులోనూ ఇంత అందంగా కనిపించడానికి కారణమేంటో తెలుసా? వాళ్ల అమ్మ చెప్పిన చిట్కాలేనట. ‘రోజూ ఉదయమే కొబ్బరి నీళ్లు తాగుతాను. అలాగే వీలైనంత ఎక్కువగా మంచి నీళ్లూ తాగుతాను. ఇక భోజనంలో పెరుగు తప్పకుండా ఉండాల్సిందే. వీటివల్ల చర్మం తేమను కోల్పోకుండా తాజాగా ఉంటుంది. అలాగే కాంతిమంతంగా మెరుస్తూ ఉంటుంది’

ఇక మొహానికి అరోమా ఆయిల్‌తో మసాజ్‌ చేసుకుంటాను. ఇది మొహం మీది ముడతలను మాయం చేస్తుంది. అలాగే చర్మాన్ని మృదువుగా.. నవ యవ్వనంగా ఉంచుతుంది. ఈ చిట్కాలతోపాటు రోజూ క్రమం తప్పకుండా డ్యాన్స్, యోగా, సైక్లింగ్‌ చేస్తాను. ఇవన్నీ మా అమ్మ చెప్పిన చిట్కాలే’ అని తన బ్యూటీ సీక్రెట్స్‌ను రివీల్‌ చేసింది హేమ మాలిని. కాగా సెకెండ్‌ ఇన్నింగ్స్‌లోనూ అదరగొడుతోన్న ఈ అందాల తార ఏక్‌ థీ రాణి ఐసీ బీ, సిమ్లా మిర్చీ, బుడ్డా హోగా తేరే బాప్‌, అరక్షణ్‌, అమన్‌ కే ఫరిష్తే వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణిలోనూ ఓ కీలక పాత్రలో కనిపించింది. వీటితో పాటు పలు టీవీ షోలు, డ్యాన్స్‌షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది. ఇక రాజకీయాల్లోనూ రాణిస్త బీజేపీ నుంచి ఎంపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..