Ayodhya Ram Mandir: శ్రీ రాముడికి ఇష్టమైన పండు ఇదే.. ఎన్ని హెల్త్ బెనిఫిట్సో!
అయోధ్య బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా దేశ వ్యాప్తంగా సంబరాలన్నీ అంబరాన్నంటాయి. ప్రతి మారు మూల పల్లె కూడా శ్రీరాముడి నామ స్మరణతో మార్మోగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా బాల రాముడికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఈ కార్యక్రమానికి దేశ నలుమూలల నుంచి అనేక మంది ముఖ్య అతిథితులు విచ్చేశారు. ఐదు శతాబ్దాల సుధీర్ఘ కల సాకారం అవడంతో రామ భక్తులు ఆనందించారు. ఈ క్రమంలోనే రాముడికి ఇష్టమైన పండు గురించి పలు వార్తలు..
అయోధ్య బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా దేశ వ్యాప్తంగా సంబరాలన్నీ అంబరాన్నంటాయి. ప్రతి మారు మూల పల్లె కూడా శ్రీరాముడి నామ స్మరణతో మార్మోగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా బాల రాముడికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఈ కార్యక్రమానికి దేశ నలుమూలల నుంచి అనేక మంది ముఖ్య అతిథితులు విచ్చేశారు. ఐదు శతాబ్దాల సుధీర్ఘ కల సాకారం అవడంతో రామ భక్తులు ఆనందించారు. ఈ క్రమంలోనే రాముడికి ఇష్టమైన పండు గురించి పలు వార్తలు వస్తున్నాయి. శ్రీ రాముడు వనవాసంలో ఉన్నప్పుడు కంద మూలాన్నే ఇష్టంగా తినేవాడని నమ్ముతారు. ఈ పండు నిజంగానే ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ఎందుకంటే దీన్ని సాగు చేయరు. పొలాలు, అడవుల్లో పెరుగుతుంది. కంద ముల్‌ను చాలా చోట్ల రామ్ ఫాల్ అని కూడా పిలుస్తారు. ఈ పండు తింటే త్వరగా ఆకలి వేయదు. శక్తి ఎక్కువగా వస్తుంది. ఇంకా ఇందులో అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కీళ్ల నొప్పులకు చెక్:
ప్రస్తుతం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మంది కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. అంతే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పండును ఎక్కువగా వినియోగిస్తారు. కంద మూల్ తినడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందొచ్చు. కీళ్ల నొప్పులు, వాపుల నుండి కూడా రిలీఫ్ నెస్ పొందవచ్చు.
రోగ నిరోధక శక్తి:
రామ కందుమూల్‌లో విటమిన్ సి, ఐరన్, క్యాల్షియం వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఇవి బాగా సహాయ పడతాయి. అంతే కాదు ఈ పండు తినడం వల్ల అనేక రకాల ఇన్ ఫెక్షన్లు, సీజనల్ వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది.
బరువు తగ్గుతారు:
వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు ఈ పండు తినడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇందులో ఎక్కువగా ఫైబర్ శాతం కూడా ఉంటుంది. దీంతో ఇది కొద్దిగా తిన్నా కూడా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆకలి అనేది ఎక్కువగా వేయదు. కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు ఇది తింటే మంచి ఫలితం ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.