AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచ పర్యాటక ప్రదేశంగా నిలిచిన రైల్వే స్టేషన్‌.. సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న సందర్శకులు..

ఈ స్టేషన్ మొదటిసారిగా 1905లో ప్రపంచానికి అందుబాటులోకి వచ్చింది. నేడు ఇది ఒక స్టేషన్‌గా కాకుండా దాని అద్భుత నిర్మాణ శైలి, అందం,కారణంగా పర్యాటక కేంద్రంగా మారింది. ప్రపంచ పర్యాటకులతో పాటు, ఎక్కువ మంది స్థానిక పర్యాటకులు ఈ స్టేషన్ ను చూసేందుకు వస్తుంటారు. ఈ స్టేషన్ కళ, చరిత్ర ఎంతో ప్రత్యేకమైనదిగా గుర్తింపు పొందింది. దీని గోపురాలు, తోరణాలు, శిల్పాలు చూడ ముచ్చటగా కనిపిస్తాయి.

ప్రపంచ పర్యాటక ప్రదేశంగా నిలిచిన రైల్వే స్టేషన్‌.. సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న సందర్శకులు..
Antwerpen Centraal Railway
Jyothi Gadda
|

Updated on: Jan 22, 2024 | 5:50 PM

Share

సాధారణంగా మనం రైల్వే స్టేషన్‌కి వెళ్లినప్పుడు మన దృష్టి అంతా ..మనం ఎక్కాల్సిన రైలుపై లేదా త్వరగా మన గమ్యస్థానానికి చేరుకోవడంపైనే ఉంటుంది. కానీ, కేవలం ప్రయాణికుల దృష్టిని ఆకర్షించే కొన్ని ప్రత్యేక రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అలాంటి స్టేషన్లలో కొంత సమయం పాటు ఇక్కడే ఉండాలనిపించేలా చేస్తాయి. అటువంటి స్టేషన్లు ప్రపంచంలో చాలా ఉన్నాయి. అక్కడికి ప్రజలు కేవలం ఆ స్టేషన్లను చూసేందుకు మాత్రమే వెళ్తుంటారు. వాటిలో ఒకటి బెల్జియంలోని ఆంట్వెర్ప్ సెంట్రల్ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ అనేక అద్భుతాలు, ప్రత్యేకతలను కలిగి ఉంది. అందుకే పెద్ద సంఖ్యలో పర్యాటకులు, సందర్శకులను ఆకర్షిస్తుంది. ఆ రైల్వే స్టేషన్‌ ప్రత్యేకతలేంటో ఇక్కడ తెలుసుకుందాం…

2014లో ఒక రచయిత దీనిని ప్రపంచంలోనే అత్యంత అందమైన స్టేషన్‌గా అభివర్ణించారు..దాంతో అప్పటి నుంచి ఈ స్టేషన్‌ ప్రపంచ ప్రశంసలు అందుకుంది. ఆ తరువాత ప్రతిచోటా దాని నిర్మాణం గురించి చర్చ మొదలైంది. ఇక్కడ విశేషమేమిటంటే అప్పటి నుంచి ప్రపంచంలోని అత్యంత అందమైన స్టేషన్ల ర్యాంకింగ్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇటీవల, యూరోన్యూస్ దీనిని ఐరోపాలో అత్యంత అందమైన స్టేషన్‌గా కూడా పేర్కొంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ స్టేషన్‌ను ప్రయాణికులు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక హాలిడే సైట్‌లు కూడా ఎంతో ప్రశంసించాయి. ఈ స్టేషన్ కళ, చరిత్ర ఎంతో ప్రత్యేకమైనదిగా గుర్తింపు పొందింది. దీని గోపురాలు, తోరణాలు, శిల్పాలు అద్భుత ప్రభావాన్ని కలిగి ఉంటాయి.

ఈ స్టేషన్ మొదటిసారిగా 1905లో ప్రపంచానికి అందుబాటులోకి వచ్చింది. ఇది 66 మీటర్ల పొడవు, 44 మీటర్ల ఎత్తు, క్లెమెంట్ వాన్ బోగార్ట్చే రూపొందించబడింది. దీని ఇంటీరియర్ డిజైన్ ముఖ్యంగా ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది. మీరు దాని పెద్ద గోపురం వెయిటింగ్ రూమ్‌లోకి ప్రవేశించినప్పుడు మీరు ఏదో ఒక చర్చి కేథడ్రల్‌లోకి ప్రవేశించిన భావన కలుగుతుంది.

ఇవి కూడా చదవండి

ఇది 1975లో ల్యాండ్‌మార్క్ భవనంగా గుర్తించారు. అలా 1986 వరకు కొనసాగింది. నేడు ఇది ఒక స్టేషన్‌గా కాకుండా దాని అద్భుత నిర్మాణ శైలి, అందం,కారణంగా పర్యాటక కేంద్రంగా మారింది. ప్రపంచ పర్యాటకులతో పాటు, ఎక్కువ మంది స్థానిక పర్యాటకులు ఈ స్టేషన్ ను చూసేందుకు వస్తుంటారు.. ఇక్కడ రెండు గ్రౌండ్‌ఫ్లోర్‌ ప్లాట్‌ఫారమ్‌లు ఉండగా, దానిని నాలుగు అంతస్తుల భవనంగా మార్చారు. ఇతర యూరోపియన్ దేశాల నుండి నేరుగా విమానాలు కూడా ఉన్నాయి. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ నుండి ఇక్కడికి రావడానికి ప్రజలకు ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us