AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty Tips: పింక్‌ కలర్‌లో పెదాలు మెరిసిపోవాలంటే రోజు 5 నిముషాలపాటు ఇలా చేయండి..

పెదవులు పొడిబారి, నల్లగా మారినట్లు అనిపిస్తున్నాయా? ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే ఈ లిప్ స్క్రబ్‌ల ద్వారా మీ పెదాలను మృదువుగా ఉంచుకోవచ్చు. పెదవుల చర్మంపై పేరుకుపోయిన మృత కణాలను వదిలించుకోవడానికి ఇవి చక్కగా పనిచేస్తాయి. పెదవుల పిగ్మెంటేషన్‌ను..

Beauty Tips: పింక్‌ కలర్‌లో పెదాలు మెరిసిపోవాలంటే రోజు 5 నిముషాలపాటు ఇలా చేయండి..
Beauty Tips
Srilakshmi C
|

Updated on: Oct 05, 2022 | 9:16 PM

Share

పెదవులు పొడిబారి, నల్లగా మారినట్లు అనిపిస్తున్నాయా? ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే ఈ లిప్ స్క్రబ్‌ల ద్వారా మీ పెదాలను మృదువుగా ఉంచుకోవచ్చు. పెదవుల చర్మంపై పేరుకుపోయిన మృత కణాలను వదిలించుకోవడానికి ఇవి చక్కగా పనిచేస్తాయి. పెదవుల పిగ్మెంటేషన్‌ను వదిలించుకోవడానికి ఎక్స్‌ఫోలియేషన్‌లా సహాయపడతాయి. అందుకు మార్కెట్లో దొరికే ఖరీదైన ఉత్పత్తులు కొనాల్సిన అవసరం లేదు. మీ వంటగదిలో దొరికే పదార్ధాలతో వీటిని తయారు చేసుకోవచ్చు. ఎలా తాయారు చేసుకోవాలంటే..

కాఫీ – ఆలివ్ ఆయిల్ కాఫీ గొప్ప ఎక్స్‌ఫోలియేటర్. ఇది చర్మాన్ని సున్నితంగా ఎక్స్‌ఫోలియేట్ చేయడంలో సహాయపడుతుంది. చర్మంపై రంధ్రాలను లోతుగా శుభ్రపరుస్తుంది. ఆలివ్ ఆయిల్‌లోని మాయిశ్చరైజింగ్ గుణాలు పెదాలకు పోషణనిచ్చి వాటిని మృదువుగా మార్చడంలో సహాయపడతాయి. ఒక టేబుల్ స్పూన్ కాఫీకి ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలపండి. ఈ మిశ్రమాన్ని మీ పెదాలపై అప్లై చేసి 2-3 నిమిషాల పాటు స్క్రబ్‌ చేసుకుని, తర్వాత శుభ్రం చేసుకోండి.

తేనె – చక్కెర ఒక టేబుల్ స్పూన్ తేనెలో ఒక టేబుల్ స్పూన్ పంచదార మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని మీ పెదాలపై అప్లై చేసుకోండి. చక్కెర కణాలు కరిగిపోయే వరకు ఈ మిశ్రమంతో సున్నితంగా మర్దన చేయండి. తేనె పెదాలను తేమగా ఉండాలా చేస్తుంది. చక్కెర పెదవుల నుంచి పొడి పొరలుగా ఉండే చర్మాన్ని తొలగించడానికి సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

చక్కెర-నిమ్మరసం చక్కెర సహజంగా చర్మాన్ని ప్రకాశవంతం చేసే లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి పెదవి పిగ్మెంటేషన్ లేదా డార్క్ పెదాలను తొలగించడంలో బాగా పనిచేస్తాయి. నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది. ఒక టేబుల్ స్పూన్‌ చక్కెరలో ఒక స్పూన్‌ నిమ్మరసం కలుపుకోవాలి. ఈ మిశ్రమంతో వృత్తాకారంలో పెదవులపై కొన్ని నిమిషాల పాటు స్క్రబ్‌ చేసుకున్న తర్వాత శుభ్రం చేసుకోవాలి.

కోకో పౌడర్-ఆల్మండ్ ఆయిల్ ఆల్మండ్ ఆయిల్‌లో విటమిన్ ఈ ఉంటుంది. ఇది పెదాలను మృదువుగా, హైడ్రేట్‌గా మార్చుతుంది. కోకో పౌడర్ ఒక అద్భుతమైన సున్నితమైన ఎక్స్‌ఫోలియేటర్. ఇది పెదాలను మృదువుగా, అందంగా ఉంచుతుంది. ఒక స్పూన్‌ కోకో పౌడర్‌లో, ఒక స్పూన్‌ ఆల్మండ్ ఆయిల్ మిక్స్ చేసి పెదాలపై 5 నిమిషాల పాటు స్క్రబ్ చేసుకుని, శుభ్రం చేసుకోవాలి.

కొబ్బరి నూనె-ఉప్పు ఉప్పు పెదాలపై పొడి పొరలను వదిలించుకోవడానికి ఉత్తమ మార్గం. ఒక టేబుల్ స్పూన్ పింక్ సాల్ట్‌లో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె కలుపుకుని, పెదాలపై స్క్రబ్ చేసుకోవాలి. ఉప్పు కొంచెం కఠినంగా ఉంటుంది. కొబ్బరి నూనె పెదాలను లోతుగా తేమ చేస్తుంది. ఈ స్క్రబ్ పెదాలను మృదువుగా ఉంచుతుంది.

Follow Us
షుగర్ కంట్రోల్ చేసే 5 అద్భుతమైన పండ్లు..
షుగర్ కంట్రోల్ చేసే 5 అద్భుతమైన పండ్లు..
మెదడును మోసం చేయబోయి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు
మెదడును మోసం చేయబోయి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు
20 ఏళ్లుగా తగ్గని క్రేజ్..ఇప్పటికీ వాట్సాప్ స్టేటస్‌ల్లో మోతే మోత
20 ఏళ్లుగా తగ్గని క్రేజ్..ఇప్పటికీ వాట్సాప్ స్టేటస్‌ల్లో మోతే మోత
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. త్వరలో అకౌంట్లోకి నగదు
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. త్వరలో అకౌంట్లోకి నగదు
రెబల్ స్టార్ కృష్ణంరాజు సొంత కొడుకు ఎలా చనిపోయాడో తెలుసా? పాపం ..
రెబల్ స్టార్ కృష్ణంరాజు సొంత కొడుకు ఎలా చనిపోయాడో తెలుసా? పాపం ..
ప్రాణాలు కాపాడే విద్య ఫ్రీగా నేర్చుకోవాలా? విహారయాత్రకు వెళ్లండి
ప్రాణాలు కాపాడే విద్య ఫ్రీగా నేర్చుకోవాలా? విహారయాత్రకు వెళ్లండి
డబ్బున్నోళ్ల 5 గుప్త రహస్యాలు.. పేదవాడిని రాజుగా మార్చే నిజాలు
డబ్బున్నోళ్ల 5 గుప్త రహస్యాలు.. పేదవాడిని రాజుగా మార్చే నిజాలు
8 గంటల కంటే ఎక్కువ పనిచేస్తే రెట్టింపు జీతం.. కేంద్రం కొత్త రూల్స
8 గంటల కంటే ఎక్కువ పనిచేస్తే రెట్టింపు జీతం.. కేంద్రం కొత్త రూల్స
పచ్చిమిర్చీతో సర్వపిండి.. తెలంగాణ స్టైల్‌లో ఇలా చేస్తే అదిరిపోతది
పచ్చిమిర్చీతో సర్వపిండి.. తెలంగాణ స్టైల్‌లో ఇలా చేస్తే అదిరిపోతది
ఒక కప్పు పాలలో వీటిని వేసి మరిగించి తాగండి అక్కడ రెచ్చిపోవడం ఖాయం
ఒక కప్పు పాలలో వీటిని వేసి మరిగించి తాగండి అక్కడ రెచ్చిపోవడం ఖాయం