Plum Fruits for Skin: ప్లమ్‌ పండ్లతో చేసిన ఈ ఫేస్‌ ప్యాక్‌ ఎప్పుడైనా ట్రై చేశారా..? మెరిసే అందం మీ సొంతం

ప్లమ్‌ పండ్లు ఆరోగ్యానికేకాకుండా చర్మానికి కూడా చాలా మంచిది. ప్లమ్‌ పండ్లలో విటమిన్ ఎ, సి, కె, బి2, బి1, బి13 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో మినరల్స్‌తో పాటు అనేక ఇతర పోషకాలు కూడా ఉన్నాయి. ప్లమ్‌ చర్మాన్ని కాంతివంతంగా చేసి, మృదువుగా మార్చడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా చర్మంపై నల్ల మచ్చలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. ఫేస్ ప్యాక్‌ని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని ఎలా తయారు చేసుకోవాలంటే..

Plum Fruits for Skin: ప్లమ్‌ పండ్లతో చేసిన ఈ ఫేస్‌ ప్యాక్‌ ఎప్పుడైనా ట్రై చేశారా..? మెరిసే అందం మీ సొంతం
Plum Fruits For Skin
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 01, 2023 | 3:25 PM

ప్లమ్‌ పండ్లు ఆరోగ్యానికేకాకుండా చర్మానికి కూడా చాలా మంచిది. ప్లమ్‌ పండ్లలో విటమిన్ ఎ, సి, కె, బి2, బి1, బి13 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో మినరల్స్‌తో పాటు అనేక ఇతర పోషకాలు కూడా ఉన్నాయి. ప్లమ్‌ చర్మాన్ని కాంతివంతంగా చేసి, మృదువుగా మార్చడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా చర్మంపై నల్ల మచ్చలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. ఫేస్ ప్యాక్‌ని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని ఎలా తయారు చేసుకోవాలంటే..

ప్లమ్‌ పండ్ల ఫేస్‌ ప్యాక్

ముందుగా ప్లమ్‌ పండ్లకు తొక్కతీసి, దాని గుజ్జును ఒక గిన్నెలోకి తీసుకోవాలి. గుజ్జును తీసుకుని ముఖానికి పట్టించాలి. 30 నిమిషాల పాటు ఇలాగే ఉంచుకుని తర్వాత నీళ్లతో కడిగేసుకోవాలి. ఈ ప్లమ్‌ ఫేస్‌ ప్యాక్‌ను వారానికి 2 నుంచి 3 సార్లు ఉపయోగించవచ్చు.

ప్లమ్‌ పండ్లు-తేనె ఫేస్‌ ప్యాక్

ప్లమ్‌ పండ్ల గుజ్జులో తేనె కలిపి ఈ ప్యాక్ తయారు చేసుకుంటారు. ప్లమ్‌ పండ్ల గుజ్జులో 1 చెంచా తేనె వేసుకుని బాగా కలుపుకోవాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. ప్లమ్‌ పండ్లు-తేనె ఫేస్‌ ప్యాక్ని వారానికి రెండు సార్లు అప్లై చేయడం వల్ల ముఖానికి సహజమైన మెరుపు వస్తుంది.

ఇవి కూడా చదవండి

దోసకాయ-ప్లమ్‌ పండ్లు ఫేస్‌ ప్యాక్‌

ముందుగా దోసకాయను తురుముకోవాలి. తురుము నుంచి రసాన్ని వేరుచేసి ప్లమ్‌ పండ్ల గుజ్జులో కలుపుకోవాలి. ఈ రెండు పదార్థాలను మిక్స్ చేసి ముఖానికి, మెడకు బాగా పట్టించాలి. కాసేపు చర్మాన్ని మసాజ్ చేసుకుని, 20 నిమిషాల తర్వాత చల్లని నీళ్లతో కడిగేసుకోవాలి.

ప్లమ్‌ పండ్లు – రోజ్ వాటర్ ఫేస్‌ ప్యాక్‌

ప్లమ్‌ పండ్లు – రోజ్ వాటర్ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పేస్ట్ చర్మాన్ని మృదువుగా చేయడానికి, చర్మంపై మచ్చలను తొలగించడానికి సహాయపడుతుంది. ప్లమ్‌ పండ్ల గుజ్జులో సరిపడా రోజ్ వాటర్‌ కలుపుకుని ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. కాసేపు అలాగే ఉంచి శుభ్రమైన నీళ్లతో కడిగేసుకోవాలి.

ప్లమ్‌ పండ్లు – పెరుగు ఫేస్‌ ప్యాక్‌

ఒక గిన్నెలో కొంచెం ప్లమ్‌ పండ్ల గుజ్జు తీసుకుని దానికి 2 చెంచాల తాజా పెరుగు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను చర్మానికి అప్లై చేసి కాసేపు అలాగే ఉంచి సాధారణ నీళ్లోతో శుభ్రం చేసుకోవాలి. తరచూ ఇలా చేయడం వల్ల చర్మం బంగారు రంగులో మెరిసిపోతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి.