అంతే కాకుండా పళ్లతో గోళ్లను కొరకడం వల్ల దంతాలు తీవ్రంగా దెబ్బతింటాయి. ఇది చిగుళ్లను బలహీనపరుస్తుంది. గమ్ ఇన్ఫెక్షన్‌కి కారణం అవుతుంది. క్రమంగా దంతాలు వదులుగా మారి ఊడిపోతాయి. పళ్లలో క్రిములు అధికంగా చేరి, నోటి నుంచి కడుపులోకి ప్రవేశిస్తాయి. ఫలితంగా అతిసారం, అపానవాయువు వంటి సమస్యలు అభివృద్ధి చెందుతాయి.