AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చర్మంపై ముడతలా.. ఆయుర్వేదంలోని ఈ 5 టిప్స్ పాటించి చూడండి.. బెస్ట్ రిజల్ట్ మీ సొంతం

20 ఏళ్ల వయసు నుంచే యాంటీ ఏజింగ్ స్కిన్ కేర్ ప్రారంభించాలని నిపుణులు సూచిస్తున్నారు. అయినప్పటికీ చర్మ సంరక్షణ ఉత్పత్తులతో వృద్ధాప్యాన్ని ఎప్పుడూ నిరోధించలేము. ఆయుర్వేదంలోని ఐదు చిట్కాలతో చర్మాన్ని కాంతివంతంగా ఉంచుకోవచ్చు. ఈ చిట్కాలు పాటిస్తే చర్మం ముడుతలు పడదు.. ఇంకా చెప్పాలంటే మీ స్కిన్ కు వయసు రాదు.

చర్మంపై ముడతలా.. ఆయుర్వేదంలోని ఈ 5 టిప్స్ పాటించి చూడండి.. బెస్ట్ రిజల్ట్ మీ సొంతం
Ayurvedic Skin Care Tips
Surya Kala
|

Updated on: May 15, 2024 | 7:52 PM

Share

పని ఒత్తిడి, మానసిక ఆందోళన, కాలుష్యం, నిద్రలేమి, శరీరంలో పోషకాల కొరత, అనారోగ్యకరమైన ఆహారం, UV కిరణాలు-ఇవన్నీ ప్రతి ఒక్కరి చర్మంపై ప్రభావం చూపుతాయి. దీంతో చర్మం తీరు మారుతుంది. వృద్ధాప్య ఛాయలు తొండగా కనిపిస్తాయి. దీంతో వయసు కంటే పెద్దగారిగా కనిపించడం మొదలవుతుంది. ఒకొక్కసారి చర్మంలోని అనేక భాగాలపై మచ్చలు అభివృద్ధి చెందుతాయి. చర్మం ముడతలు పడతాయి. అందుకే 20 ఏళ్ల వయసు నుంచే యాంటీ ఏజింగ్ స్కిన్ కేర్ ప్రారంభించాలని నిపుణులు సూచిస్తున్నారు. అయినప్పటికీ చర్మ సంరక్షణ ఉత్పత్తులతో వృద్ధాప్యాన్ని ఎప్పుడూ నిరోధించలేము. ఆయుర్వేదంలోని ఐదు చిట్కాలతో చర్మాన్ని కాంతివంతంగా ఉంచుకోవచ్చు. ఈ చిట్కాలు పాటిస్తే చర్మం ముడుతలు పడదు.. ఇంకా చెప్పాలంటే మీ స్కిన్ కు వయసు రాదు.

ముఖ కవళికలు చర్మంపై ప్రభావం: కనుబొమ్మలు చిట్లడం, రకరకాల ముఖకవళికలు చర్మంపై ఒత్తిడిని తెస్తాయి. అంతేకాదు త్వరగా ముడతలు పడేలా చేస్తాయి. కనుక ప్రతిరోజూ కొద్దిగా నూనె లేదా సీరమ్‌తో చర్మాన్ని మసాజ్ చేయండి. ఫేషియల్ మసాజ్ చర్మాన్ని బిగుతుగా ఉంచుతుంది.

సరైన చర్మ సంరక్షణను రోజూ పాటించకపోవడం వల్ల వచ్చే ప్రమాదాలు: ప్రతిరోజూ చర్మాన్ని శుభ్రపరచడం, సన్‌స్క్రీన్ ఉపయోగించడం, మాయిశ్చరైజింగ్ వంటి వాటిని చేయాలి. ఈ చర్యలు చర్మం దెబ్బతినకుండా కాపాడతాయి. ఇది చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి.

ఇవి కూడా చదవండి

ఆయుర్వేదం ఈ మూడు అంశాలపై నొక్కి చెబుతుంది: వాత (గాలి), పిత్త (అగ్ని), కఫం (నీరు). చర్మ సంరక్షణలో ఈ మూడు గుణాలు కూడా ముఖ్యమైనవి. చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడం, ప్రతిరోజూ సన్‌స్క్రీన్ ఉపయోగించడం.. తేలికపాటి ఎక్స్‌ఫోలియేటర్‌ని ఉపయోగించడం ద్వారా చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పుష్కలంగా నీరు తాగాలని ఆయుర్వేదం సిఫార్సు చేస్తోంది. ఇది చర్మం స్థితిస్థాపకతను పెంచుతుంది. చర్మం హైడ్రేట్ అవుతుంది. మచ్చలు, ముడతలు, చర్మం మీద గీతలు, వృద్ధాప్య సంకేతాలు తక్కువగా కనిపించేలా చేస్తుంది.

ఆయుర్వేదం ఎల్లప్పుడూ సహజ మూలికా పదార్థాలను ఉపయోగిస్తుంది. పసుపు ఎల్లప్పుడూ చర్మ సంరక్షణలో అత్యంత విలువైనది. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచడం నుంచి గాయాలను నయం చేయడంలో సహాయం చేస్తుంది. పసుపు చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడానికి , చర్మం మంటను తగ్గించడానికి మంచి సహాయకారి. పసుపులో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉన్నాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. హానికరమైన UV కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. రోజూ పసుపుని తినే ఆహారంలో చేర్చుకోవచ్చు. లేదా పెరుగుతో కలిపి ముఖానికి రాసుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..