కృత్రిమ స్వీటెనర్లను ఉపయోగించే బేకరీ డెజర్ట్స్‌ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జర జాగ్రత్త..

|

Apr 26, 2024 | 8:01 PM

కృత్రిమ స్వీటనర్లను సింథటిక్‌ పదార్థాలను ఉపయోగించి తయారు చేస్తారు. ఈ కృత్రిమ స్వీటెనర్లు ఆహారం రుచిని పెంచుతాయి.. కానీ ఆరోగ్యానికి హానికరమని చాలా మందికి తెలియదు. ఇప్పుడు కొత్త పరిశోధన ప్రకారం, కృత్రిమ స్వీటెనర్ నియోటామ్ ప్రేగులను దెబ్బతీస్తుంది. పేగు వ్యాధులకు దారితీస్తుంది. సహజ స్వీటెనర్‌గా, నియోటామ్‌ను కేకులు, శీతల పానీయాలు, చూయింగ్ గమ్‌లలో ఉపయోగిస్తారు.

కృత్రిమ స్వీటెనర్లను ఉపయోగించే బేకరీ డెజర్ట్స్‌ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జర జాగ్రత్త..
Artificial Sweeteners
Follow us on

ప్రస్తుతం సృష్టి.. ప్రతిసృష్టి అన్న చందంగా సాగుతుంది మనిషి జీవితం. ఆహార పదార్ధాలకు అదనపు రుచిని అందించడానికి చెక్కెర బదులు కృత్రిమ స్వీటెనర్లను ఉపయోగిస్తున్నారు. షుగర్ పేషేంట్స్ తాము తినే ఆహార పదార్ధాల్లో మాత్రమే కాదు బేకరీలో తయారు చేస్తున్న డెజర్ట్‌ల్లో కూడా ఎక్కువగా ఈ కృత్రిమ స్వీటనర్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వీటిని ఉపయోగించడం వలన ఆహార పదార్ధాలకు కృత్రిమ రుచిని అందిస్తాయి. కేలరీలు చేరవు. అంతేకాదు షుగర్ పెరగదు.

కృత్రిమ స్వీటనర్లను సింథటిక్‌ పదార్థాలను ఉపయోగించి తయారు చేస్తారు. ఈ కృత్రిమ స్వీటెనర్లు ఆహారం రుచిని పెంచుతాయి.. కానీ ఆరోగ్యానికి హానికరమని చాలా మందికి తెలియదు. ఇప్పుడు కొత్త పరిశోధన ప్రకారం, కృత్రిమ స్వీటెనర్ నియోటామ్ ప్రేగులను దెబ్బతీస్తుంది. పేగు వ్యాధులకు దారితీస్తుంది.

సహజ స్వీటెనర్‌గా, నియోటామ్‌ను కేకులు, శీతల పానీయాలు, చూయింగ్ గమ్‌లలో ఉపయోగిస్తారు. ఈ కృత్రిమ స్వీటెనర్ వినియోగంపై జర్నల్ ఫ్రాంటియర్స్‌లో ప్రచురించబడిన ఆంగ్లియా రస్కిన్ విశ్వవిద్యాలయం (ARU)లో నిర్వహించిన ఒక అధ్యయనంలో పలు షాకింగ్ విషయాలను వెల్లడించింది.  దీనిలోని నియోటేమ్ మానవ ప్రేగులను దెబ్బతీసే సామర్థ్యాన్ని కలిగి ఉందని కనుగొంది.

ఇవి కూడా చదవండి

నియోటేమ్ (Neotame) ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియాపై ప్రభావం చూపిస్తుంది. ఇది పేగు గోడను కూడా బలహీనపరుస్తుంది. ఇది సెల్ డ్యామేజ్ కూడా కలిగిస్తుంది. ఇది గట్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయోజనకరమైన గట్ బ్యాక్టీరియాను దెబ్బతీస్తుందని తేలింది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..