AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Online Delivery: ఆన్‌లైన్‌లో ఇవి ఆర్డర్ పెడుతున్నారా..? కంపెనీలు చేసే ఈ మోసం గురించి తెలుసా..?

పాలు, బ్రెడ్ వంటి నిత్యావసర వస్తువులను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అనేక ఈ-కామర్స్ కంపెనీలు గడువు ముగిసిన వస్తువులను అమ్ముతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. సంస్థలు ఎక్స్‌పైరీ డేట్‌‌ను తొలగించి వస్తువులను అమ్ముతున్నట్లు అధికారుల దర్యాప్తులో తేలింది.

Online Delivery: ఆన్‌లైన్‌లో ఇవి ఆర్డర్ పెడుతున్నారా..? కంపెనీలు చేసే ఈ మోసం గురించి తెలుసా..?
Online Bread Delivery
Krishna S
|

Updated on: Aug 04, 2025 | 4:59 PM

Share

మీరు పాలు, బ్రెడ్ వంటి రోజువారీ అవసరాలను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే, మీరు జాగ్రత్తగా ఉండాలి. డెలివరీ తీసుకునేటప్పుడు, ఉత్పత్తి ఎక్స్‌పైరీ తేదీని తప్పకుండా చెక్ చేయాలి. లేకపోతే అనారోగ్యం పాలవుతారు. దేశ రాజధాని ఢిల్లీలోని కొంతమంది వ్యక్తుల నుంచి వచ్చిన ఫిర్యాదులు తర్వాత ఫుడ్ సేఫ్టీ అధికారులు దీనిపై ఫోకస్ పెట్టారు. ప్రసిద్ధ ఇ-కామర్స్ కంపెనీలు ప్రజల ఆరోగ్యంతో ఎంతగా ఆడుకుంటున్నాయో అనే షాకింగ్ విషయం వెల్లడైంది.

ఎక్స్‌పైరీ డేట్ ఒక రోజు మాత్రమే మిగిలి ఉంటే.. కంపెనీలు డేట్‌ను తొలగించి వస్తువులను డెలీవరీ చేస్తున్నాయి. ఢిల్లీలో ఇటువంటి ఘటనలు తరుచూ చోటుచేసుకుంటున్నాయి.  కొన్ని రోజుల క్రితం ఒక వ్యక్తి తనకు బూజు పట్టిన బ్రెడ్ డెలివరీ చేశారని ఫిర్యాదు చేయడంతో అధికారులు రంగంలోకి దిగారు. దర్యాప్తులో బ్రెడ్ ఎక్స్‌పైరీ గడువు ముగిసినట్లు తేలింది. ఆ తర్వాత ఒక బృందాన్ని ఏర్పాటు చేసి.. బ్రెడ్ తయారు చేసిన కంపెనీలో తనిఖీలు చేశారు. కానీ అక్కడ అంతా బాగానే ఉండడంతో.. ఇదంతా ఒక ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ వల్ల జరుగుతోందని గుర్తించారు. దీంతో సదరు సంస్థ లైసెన్స్‌ను ఒక నెల పాటు రద్దు చేశారు.

గడువు ముగిసిన ఉత్పత్తి వస్తే ఏం చేయాలి ?

డెలివరీ కంపెనీ బ్రెడ్ ఎక్స్‌పైరీ తేదీని తొలగించిన మరో కేసు తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే.. ప్రతి నెలా 4 నుండి 5 వరకు ఇలాంటి కేసులు వస్తున్నాయి. మీరు గడువు ముగిసిన ఉత్పత్తిని తీసుకున్నట్లయితే ముందుగా ఇ-కామర్స్ కంపెనీని సంప్రదించండి. అక్కడ పరిష్కారం లభించకపోతే.. ఫుడ్ సేఫ్టీ అధికారులకు కంప్లైంట్ ఇవ్వండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..