Workplace: ప‌ని చేసే చోట‌ నిద్ర మ‌త్తుగా ఉంటుందా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. ఉత్తేజం మీ సొంత‌మ‌వుతుంది..

Workplace: ప‌నిచేసే ప్ర‌దేశంలో నిత్ర‌మ‌త్తుగా (sleepiness during work) ఉండ‌డం మ‌న‌లో చాలా మంది ఎదుర్కొనే స‌మ‌స్య‌. అయితే ఎప్పుడో ఒక‌సారి ఈ స‌మ‌స్య ఉంటే ప‌ర్వాలేదు కానీ ఎప్పుడూ ఇలాగే ఉంటే మాత్రం ప‌నిపై ప్ర‌భావం చూపుతుంది. ముఖ్యంగా ప‌ని నాణ్య‌త‌పై...

Workplace: ప‌ని చేసే చోట‌ నిద్ర మ‌త్తుగా ఉంటుందా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. ఉత్తేజం మీ సొంత‌మ‌వుతుంది..
Follow us

|

Updated on: Jan 28, 2022 | 11:38 AM

Workplace: ప‌నిచేసే ప్ర‌దేశంలో నిత్ర‌మ‌త్తుగా (sleepiness during work) ఉండ‌డం మ‌న‌లో చాలా మంది ఎదుర్కొనే స‌మ‌స్య‌. అయితే ఎప్పుడో ఒక‌సారి ఈ స‌మ‌స్య ఉంటే ప‌ర్వాలేదు కానీ ఎప్పుడూ ఇలాగే ఉంటే మాత్రం ప‌నిపై ప్ర‌భావం చూపుతుంది. ముఖ్యంగా ప‌ని నాణ్య‌త‌పై ఈ నిద్ర‌మత్తు ప్ర‌భావం ఉంటుంది. ఇలా కొంద‌రు ప‌ని చేస్తున్నంత సేపు నిస్స‌త్తువ‌తో ఏదో యాంత్రికంగా ఉంటుంటారు. అయితే ఈ స‌మ‌స్య‌కు చెక్ పెట్టాలంటే కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో కావాల‌ని చెబుతున్నారు నిపుణులు. ప‌ని చేసే స‌మ‌యంలో నిద్ర మ‌త్తు పోవాల‌న్నా, ఉషారుగా ప‌ని చేసుకోవాల‌న్నా పాటించాల్సిన ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

* నిద్ర మ‌త్తుగా అనిపిస్తే వెంట‌నే ఒక కాఫీ కానీ, టీకానీ తాగాలి. చాలా వ‌ర‌కు కంపెనీల్లో ఉద్యోగుల‌కు టీ, కాఫీలు అందుబాటులో ఉంటాయి. ఒక్క‌గ్లాస్ టీ తాగితే మ‌రింత ఉత్తేజంగా ప‌నిచేసుకునే అవ‌కాశం ఉంటుంది.

* ఎప్పుడూ కుర్చికే ప‌రిమితం కాకుండా అప్పుడ‌ప్పుడు అలా లేసి న‌డుస్తుండాలి. చాలా మంది ప‌ని బిజీలో ప‌డిపోయి న‌డ‌వ‌డ‌మే మ‌రిచిపోతుంటారు. కనీసం గంట‌కు ఒక‌సారైనా లేచి నాలుగు అడుగులు వేయాల‌ని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే నిద్ర మ‌త్తుకు ఛాన్స్ ఉండ‌దు.

* సంగీతం విన్నా నిద్ర మ‌త్తుకు చెక్ పెట్ట‌వ‌చ్చు. అయితే స్లో మ్యూజిక్ కాకుండా మంచి బీట్ ఉన్న సాంగ్స్ విన‌డం వ‌ల్ల మెద‌డు ఉత్తేజిత‌మై నిద్ర మ‌త్తు ప‌రార్ అవుతుంది.

* ప‌ని ప్ర‌దేశంలో నిత్యం నిత్య మత్తుగా ఉంటే తీసుకునే ఆహారం విష‌యంలో కూడా జాగ్ర‌త్త తీసుకోవాలి. వీలైనంత వ‌ర‌కు లైట్ ఫుడ్ తీసుకునే ప్ర‌య‌త్నం చేయాలి. మ‌రీ ముఖ్యంగా లంచ్‌లో ఎక్కువ శ‌క్తినిచ్చే త‌క్కువ క్యాల‌రీలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

* నిద్రమ‌త్తుగా అనిపించిన‌ప్పుడ‌ల్లా ముఖాన్ని చ‌ల్ల‌టి నీటితో క‌డుక్కోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఏకాగ్ర‌త పెర‌గ‌డ‌మే కాకుండా. నిద్ర మ‌త్తు కూడా వ‌దిలి పోతుంది.

* ప‌ని ప్ర‌దేశం పూర్తిగా నిశ‌బ్ధంగా ఉన్నా నిద్ర మ‌త్తుకు దారి తీస్తుంది. కాబ‌ట్టి వీలైనంత వ‌ర‌కు కొలిగ్స్‌తో మాట్లాడ‌డానికి ప్ర‌య‌త్నించండి. ప‌నిని ఒక టార్గెట్‌గా పెట్టుకొని పూర్తి చేయ‌డానికి ప్ర‌య‌త్నించండి. అప్పుడు నిద్ర ర‌మ్న‌న్నా రాదు.

Also Read: pet dinosaur video: వామ్మో… డైనోసార్‌ను పెంచుకుంటున్నార..! సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో..

NMMSS 2022: ఏడో తరగతి విద్యార్థులకు ఏటా రూ.12000.. చివరి తేదీ జనవరి 30..?

Latest Articles