Face Mask: ఈ ఫేస్ మాస్క్ వేసుసుకుంటే చాలు.. మెరిసే నిగారింపు చర్మం మీ సొంతం..! తయారీ పద్ధితి ఇదే..

|

Feb 19, 2023 | 4:16 PM

అందమైన చర్మం పొందడానికి ఖరీదైన చికిత్సలు చేయించుకోనవసరం లేకుండా కూడా పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. వారి సూచనల ప్రకారం యవ్వనమైన

Face Mask: ఈ ఫేస్ మాస్క్ వేసుసుకుంటే చాలు.. మెరిసే నిగారింపు చర్మం మీ సొంతం..! తయారీ పద్ధితి ఇదే..
Apple Face Mask
Follow us on

ప్రస్తుత కాలంలో చాలా మందికి వివిధ కారణాల వల్ల చర్మ సంరక్షణ సవాలుగా మారింది. అంతేకాక జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా కూడా పలు రకాల ఆరోగ్య సమస్యలతో కూడా బాధపడుతున్నారు. అయితే ఈ క్రమంలో మెరిసే ఇంకా ముడతలు లేని చర్మం కోసం ఏవేవో ప్రయోగాలు, ప్రయత్నాలు చేస్తున్నావారు కూడా లేకపోలేదు. కానీ వాటి నుంచి ఎలాంటి ఫలితాలు లేకపోతున్నాయి. అంతేకాకుండా వీటి వల్ల కొత్త సమస్యలను కూడా కొని తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వీటిని వినియోగించడం వల్ల చాలా రకాల చర్మ సమస్యలు రావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే అందమైన చర్మం పొందడానికి ఖరీదైన చికిత్సలు చేయించుకోనవసరం లేకుండా కూడా పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. వారి సూచనల ప్రకారం యవ్వనమైన నిగారింపు చర్మం కోసం యాపిల్‌తో తయారు చేసిన ఫేస్ మాస్క్‌ని వినియోగించాల్సి ఉంటుంది.

ఇంకా ఇందులో ఉండే గుణాలు వృద్ధాప్య సంకేతాలను తగ్గించడానికి సహాయపడతాయి. అంతేకాకుండా మొటిమల సమస్య నుంచి కూడా సులభంగా రక్షిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధాప్య చర్మ సమస్యలతో బాధపడేవారు యవ్వనంగా కనిపించేందుకు సహాయపడతాయి. అయితే ఈ  యాపిల్ ఫేస్ మాస్క్‌ను తయారు చేసే పద్ధతిని మనం ఇప్పుడు తెలుసుకుందాం..

యాపిల్ ఫేస్ మాస్క్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:

కొన్ని యాపిల్ ముక్కలు, 1 చెంచా తేనె, 1 చెంచా పాలు

ఇవి కూడా చదవండి

యాపిల్ ఫేస్ మాస్క్ తయారి పద్దతి:

యాపిల్ ఫేస్ మాస్క్ తయారు చేసేందుకు ముందుగా యాపిల్‌ను ముక్కలుగా కట్ చేయాలి. తర్వాత ఈ ముక్కలను ఒక బాణలిలో నీళ్ళు పోసి మెత్తబడే వరకు మరిగించాలి. ఈ ఉడికించిన యాపిల్‌ ముక్కలను కొద్ది సేపు చల్లారనిచ్చి.. అందులో 1 టీస్పూన్ తేనె, 1 టీస్పూన్ పాలు వేయండి. తర్వాత వీటన్నింటిని బాగా మిక్స్ చేసి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. అంతే.. సులభంగా యాపిల్ ఫేస్ మాస్క్ తయారయిపోయినట్లే..

యాపిల్ ఫేస్ మాస్క్ ఎలా ఉపయోగించాలో తెలుసా..?:

యాపిల్ ఫేస్ మాస్క్ వేసుకునే ముందు ముఖాన్ని పూర్తిగా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ముఖానికి మాస్క్‌ని బాగా అప్లై చేయాలి. దానిని అలా సుమారు 20 నిమిషాలు ముఖంపై ఉంచి.. తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు ఇచ్చినది మాత్రమే. ఎటువంటి ఆరోగ్య సూచనలను అయినా పాటించే ముందు వైద్య నిపుణులను తప్పక సంప్రదించండి.

మరిన్ని లైఫ్‌స్టైల్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..