Uric Acid: యూరిక్ యాసిడ్‌ని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రమాదమే!
యూరిక్ యాసిడ్ అనేది ఇప్పుడు సర్వ సాధారణమైన సమస్యగా మారిపోయింది. ప్రస్తుత కాలంలో చాలా మంది ఇదే వ్యాధితో బాధ పడుతున్నారు. అయితే ఈ సమస్య ఏంటో పెద్దగా ఎవరిలోనూ అవగాహన లేదు. ముందుగానే యూరిక్ యాసిడ్‌కు చికిత్స్ తీసుకోకపోతే ప్రాణాల మీదకు వచ్చే అవకాశం ఉంది..
ప్రస్తుత కాలంలో అనారోగ్య సమస్యల్లో ఎక్కువగా వినిపిస్తున్నది యూరిక్ యాసిడ్. ఇటీవల కాలంలో యారిక్ యాసిడ్ సమస్య బాగా పెరిగిపోతుంది. చాలా మందికి దీని గురించి తెలియక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. యూరిక్ యాసిడ్ గురించి ఖచ్చితంగా అవగాహన పెంచుకోవాలి. యూరిక్ యాసిడ్ అంటే ఏంటి? ఈ వ్యాధి లక్షణాలు ఏంటి? దీని వలన ఎలాంటి సమస్యలు వస్తాయి? అనేవి తెలుసుకోవాలి. ఇప్పటికే చాలా సార్లు యూరిక్ యాసిడ్ గురించి తెలుసుకున్నాం. యూరిక్ యాసిడ్ అనేది రక్తంలో కనిపించే వ్యర్థ పదార్థం. ఎప్పటికప్పుడు రక్తం క్లీన్ అవుతున్నప్పుడు ఇవి బయటకు పోతాయి. కానీ అలా కాకుండా శరీరంలోనే ఉండి పోవడం వలన ఈ యూరిక్ యాడిస్ లెవల్స్ అనేవి పెరిగిపోతాయి. దీని వలన వివిధ రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. మాంసం, క్యాబేజీ, బచ్చలి కూర, సీఫుడ్స్ వంటి ప్యూరిన్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకుంటే యూరిక్ యాసిడ్ పెరుగుతుంది.
యూరిక్ యాసిడ్ రావడానికి ప్రధాన కారణాలు:
యూరిక్ యాసిడ్ రావడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి. అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, మద్యం సేవించడం, బయట ఆహారం ఎక్కువగా తినడం, డయాబెటీస్, కీమో థెరపీ, జన్యు కారణాల వల్ల ఈ యూరిక్ యాసిడ్ ఎటాక్ చేస్తుంది.
యూరిక్ యాసిడ్ లక్షణాలు:
ఎలాంటి వ్యాధి వచ్చినా ముందుగా దాని లక్షణాలు బయటకు తెలుపుతుంది. ఈ లక్షణాలను సకాలంలో గుర్తించి చికిత్స చేసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదు. చిన్న చిన్న సమస్యలే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాల మీదకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కీళ్లలో నొప్పులు, వాపులు, బీపీ పెరగడం, కిడ్నీ సంబంధిత సమస్యలు, నడుము వెనుక భాగంలో తీవ్రంగా నొప్పి, వేళ్ల వాపులు, నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
నీటిని ఎక్కువగా తీసుకోండి:
ఎలాంటి సమస్య అయినా సరే ముందు నీటిని ఎక్కువగా తీసుకోవాలి. నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల వ్యర్థ పదార్థాలు, మలినాలు, విష పదార్థాలు మలం, మూత్రం ద్వారా బయటకు పోతాయి. యూరిక్ యాసిడ్‌కు కూడా ఇదే వర్తిస్తుంది. నీటిని ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా యూరిక్ యాసిడ్ కంట్రోల్ అవుతుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.