ఈ పండ్లను రైలులో తీసుకెళ్తే జైలుకే!

TV9 Telugu

05 November 2024

భారతీయ రైల్వేలు ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్. ప్రతిరోజు లక్షల మంది ఇందులో ప్రయాణిస్తుంటారు.

భారతీయ రైల్వే సంస్థ ట్రైన్‎లో ప్రయాణం చేసే ప్రయాణికుల భద్రత కోసం అనేక నియమాలను రూపొందించిన సంగతి తెలిసిందే.

భారతీయ రైల్వే సంస్థ నిబంధనలలో ఒకటి రైలు ప్రయాణం సమయంలో ప్రయాణికులు తీసుకెళ్లే వస్తువులకు సంబంధించినది.

రైల్వే నిబంధనల ప్రకారం, రైలులో మీతో తీసుకెళ్లలేని పండు ఒకటి ఉందని మీకు తెలుసా..? అదేంటో రోజు తెలుసుకుందాం.

రైల్వే నిబంధనల ప్రకారం రైలులో ఎండు కొబ్బరిని తీసుకెళ్లడం నిషేధం. ఎండిన కొబ్బరికాయ బయటి భాగం మంటగా పరిగణిస్తారు.

త్వరగా ఎండు కొబ్బరి పైభాగం నుండి మంటలు వచ్చే అవకాశం ఉంది. ఈ కారణంగా రైలులో ఈ పండును తీసుకెళ్లడం నిషేధం.

భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం, రైలులో నిషేధిత వస్తువుతో ప్రయాణీకుడు పట్టుబడితే, అతనిపై రైల్వే కఠిన చర్యలు తీసుకోవచ్చు.

నిబంధనలు ఉల్లంఘించిన రైల్వే ప్రయాణీకుడికి రూ. 1000 వరకు జరిమానా. ఇది కాకుండా, 3 సంవత్సరాల శిక్ష లేదా రెండూ ఉండవచ్చు.