IPL 2025 Auction: 204 ఖాళీలు.. 1574 మంది ప్లేయర్లు.. జాక్‌పాట్ కొట్టేది ఎవరో?

IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగనుంది. ఈ మేరకు బీసీసీఐ పూర్తి వివరాలు వెల్లడించింది.

IPL 2025 Auction: 204 ఖాళీలు.. 1574 మంది ప్లేయర్లు.. జాక్‌పాట్ కొట్టేది ఎవరో?
Ipl 2025 mega auction
Follow us
Venkata Chari

|

Updated on: Nov 06, 2024 | 2:40 PM

IPL 2025 Mega Auction: ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాలుగేళ్లకోసారి నిర్వహించే ఈ మెగా వేలం వచ్చే సీజన్ ప్రారంభానికి ముందే జరగనుంది. ఈ క్రమంలోనే బీసీసీఐ తాజాగా ఐపీఎల్ 2025 మెగా వేలం వేదిక, తేదీలను ప్రకటించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

వేలం వివరాలను బీసీసీఐ మంగళవారం సాయంత్రం ప్రకటించింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ 2025 కోసం ఆటగాళ్ల వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగనుంది. వేలం కోసం 1574 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారని బీసీసీఐ తెలిపింది.

“ఐపీఎల్ ప్లేయర్ రిజిస్ట్రేషన్ అధికారికంగా నవంబర్ 4, 2024 న ముగిసింది. మెగా ఐపీఎల్ 2025 వేలంలో పాల్గొనడానికి మొత్తం 1,574 మంది ఆటగాళ్లు (1,165 మంది భారతీయులు, 409 మంది విదేశీ ప్లేయర్లు) సంతకం చేశారు” అని బిసిసిఐ కార్యదర్శి జై షా ఒక మీడియా ప్రకటనలో తెలిపారు. నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో రెండు రోజుల పాటు ఈ వేలం జరగనుంది.

ఈ జాబితాలో 320 మంది క్యాప్డ్ ప్లేయర్లు, 1,224 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లతో పాటు అసోసియేట్ దేశాలకు చెందిన 30 మంది ప్లేయర్లు ఉన్నారని, 48 మంది క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్లు వేలంలో పాల్గొంటారని, 272 మంది అంతర్జాతీయ ఆటగాళ్లు కూడా వేలంలో పాల్గొంటారని బీసీసీఐ తెలిపింది.

గత ఐపీఎల్ సీజన్లో పాల్గొన్న 152 మంది అన్క్యాప్డ్ భారత ఆటగాళ్లు, గత ఐపీఎల్ సీజన్లో పాల్గొన్న ముగ్గురు అన్క్యాప్డ్ అంతర్జాతీయ ఆటగాళ్లను కూడా వేలంలో చేర్చనున్నారు. ఇందులో 965 మంది అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్లు, 104 అన్క్యాప్డ్ ఇంటర్నేషనల్ ప్లేయర్లు ఉన్నారు.

ఐపీఎల్ 2025కు ముందు మొత్తం 10 ఫ్రాంచైజీలు మొత్తం 46 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. దీంతో మొత్తం 204 మంది ఆటగాళ్ల స్థానం ఖాళీ అయింది. ఈ 204 స్థానాలను భర్తీ చేయడానికి, నవంబర్ 24-25 తేదీలలో మెగా వేలం జరుగుతుంది. దీని కోసం భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా మొత్తం 1574 మంది ఆటగాళ్లు నమోదు చేసుకున్నారు.

ఐపీఎల్ 2025 మెగా వేలం కోసం రిజిస్టర్ చేసుకున్న వివిధ దేశాల ఆటగాళ్లు:-

భారత్ – 1,165

దక్షిణాఫ్రికా – 91

ఆస్ట్రేలియా – 76

ఇంగ్లాండ్ – 52

న్యూజిలాండ్ – 39

వెస్టిండీస్ – 33

ఆఫ్ఘనిస్తాన్ – 29

శ్రీలంక – 29

బంగ్లాదేశ్ – 13

నెదర్లాండ్స్ – 12

ఐర్లాండ్ – 9

జింబాబ్వే – 8

కెనడా – 4

స్కాట్లాండ్ – 2

ఇటలీ – 1

యూఏఈ – 1

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..