- Telugu News Photo Gallery Cricket photos 23 Indian 9 foreign Players Registered with Base Price of Rs 2 Crore for ipl 2025 mega auction
IPL 2025: రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌లో 32 మంది ప్లేయర్లు.. భారత్ నుంచి ఎవరున్నారంటే?
IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 మెగా వేలం కోసం మొత్తం 1574 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 1,165 మంది భారత ఆటగాళ్లు, 409 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. 1,574 మంది ఆటగాళ్ల జాబితాలో జాతీయ జట్టుకు ఆడిన 320 మంది ఆటగాళ్లు కూడా ఉన్నారు.
Updated on: Nov 06, 2024 | 3:02 PM

IPL 2025 Mega Auction: ఐపీఎల్ మెగా వేలం కోసం 1574 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 23 మంది భారత ఆటగాళ్ల బేస్ ప్రైస్ రూ.2 కోట్లుగా ఉంది. తొమ్మిది మంది విదేశీ ఆటగాళ్లు కూడా అత్యధిక బేస్ ప్రైస్ తో బరిలోకి దిగారు.

అంటే, ఐపీఎల్ మెగా వేలంలో రూ.2 కోట్లు గరిష్ట బేస్ ధరగా ఉంది. ఈ బేస్ ప్రైస్ లో కనిపించిన ఆటగాళ్ల వేలం రూ.2 కోట్ల నుంచి ప్రారంభం కానుంది. అందుకే, ఈ జాబితాలోని ఆటగాళ్లు తొలి బిడ్డింగ్ లోనే రూ.2 కోట్లు దక్కించుకున్నారు. గరిష్ట బేస్ ప్రైస్ తో బరిలోకి దిగిన ఆటగాళ్ల జాబితా ఎలా ఉందో చూద్దాం..

రూ.2 కోట్ల జాబితాలో భారత ఆటగాళ్లు: ఖలీల్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, దీపక్ చాహర్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్, అవేశ్ ఖాన్, ఇషాన్ కిషన్, ముఖేష్ కుమార్, భువనేశ్వర్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ, టి నటరాజన్, కృనాల్ పాండ్యా, హర్షల్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, దేవదత్ పడిక్కల్, రిషబ్ పంత్.

రూ.2 కోట్లు విదేశీ ఆటగాళ్లు: జోస్ బట్లర్ (ఇంగ్లాండ్), మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా), గ్లెన్ మాక్స్వెల్ (ఆస్ట్రేలియా), స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా), జానీ బెయిర్స్టో (ఇంగ్లాండ్), కగిసో రబాడ (దక్షిణాఫ్రికా), మార్క్ వుడ్ (ఇంగ్లాండ్), జోఫ్రా ఆర్చర్ (ఇంగ్లాండ్), గుస్ అట్కిన్సన్ (ఇంగ్లాండ్).

నవంబర్ 24, 25 తేదీల్లో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగే వేలం ద్వారా మొత్తం 204 మంది ఆటగాళ్లను ఎంపిక చేయనున్నారు. ఈసారి అత్యధిక మొత్తానికి వేలం వేయబోయే స్టార్ ప్లేయర్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది.




