AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: ఐపీఎల్ మెగా వేలంలో 1574 మంది క్రికెటర్లు.. ఏ దేశం నుంచి ఎంతమంది బరిలో ఉన్నారంటే?

ఐపీఎల్ మెగా వేలం కోసం మొత్తం 1,574 మంది ఆటగాళ్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 409 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఈ విదేశీ ఆటగాళ్లలో, దక్షిణాఫ్రికా క్రికెటర్లు ఎక్కువగా ఉన్నారు. ఆస్ట్రేలియన్లు రెండో స్థానంలో ఉన్నారు. మరి ఐపీఎల్ మెగా వేలానికి ఏ దేశం నుంచి ఎంతమంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారో తెలుసుకుందాం రండి.

IPL 2025: ఐపీఎల్ మెగా వేలంలో 1574 మంది క్రికెటర్లు.. ఏ దేశం నుంచి ఎంతమంది బరిలో ఉన్నారంటే?
IPL 2025
Basha Shek
|

Updated on: Nov 06, 2024 | 12:14 PM

Share

ఇండియన్ ప్రీమియర్ లీగ్  18వ ఎడిషన్ ఆటగాళ్ల వేలం ప్రక్రియకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది.  . సౌదీ అరేబియాలోని జెడ్డాలో నవంబర్ 24, 25 తేదీల్లో ఐపీఎల్ ఆటగాళ్ల వేలం ప్రక్రియను నిర్వహించనున్నట్లు బీసీసీఐ మంగళవారం (నవంబర్ 05) అధికారికంగా ప్రకటించింది. అయితే ముందుగా సౌదీ అరేబియాలోని రియాద్‌లో జరగాల్సిన ఈ మెగా వేలం ప్రక్రియను ఆఖరి నిమిషంలో జెడ్డాకు మార్చారు.

ఏయే దేశం నుంచి ఎంత మంది రిజిస్టర్ చేసుకున్నారంటే?

  • భారత్‌: ఈ మెగా వేలం కోసం మొత్తం 1574 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 1,165 మంది భారత ఆటగాళ్లు కాగా, 409 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.
  • దక్షిణాఫ్రికా: ఈ మెగా వేలానికి దక్షిణాఫ్రికా ప్లేయర్లు అత్యధికంగా పేర్లు నమోదు చేసుకున్నారు. ఐపీఎల్ మెగా యాక్షన్ కోసం మొత్తం 91 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
  • ఆస్ట్రేలియా: ఈ జాబితాలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు రెండో స్థానంలో ఉన్నారు. ఈ మెగా వేలం కోసం ఆస్ట్రేలియా నుంచి 76 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు.
  • ఇంగ్లండ్‌: ఇంగ్లండ్‌కు చెందిన 52 మంది ఆటగాళ్లు ఐపీఎల్‌ మెగా వేలంలో తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు.
  • న్యూజిలాండ్: ఐపీఎల్ మెగా వేలంలో 39 మంది న్యూజిలాండ్ ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకు తగ్గట్టుగానే కివీస్ దళానికి చెందిన స్టార్ ఆటగాళ్లు ఈసారి మెగా వేలంలో కనిపించనున్నారు.
  • వెస్టిండీస్: ఐపీఎల్‌లో తమదైన ముద్ర వేసిన కరీబియన్ క్రికెటర్లు ఈసారి మాత్రం ధనాధన్ లీగ్ పై పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈసారి వెస్టిండీస్‌కు చెందిన 33 మంది ఆటగాళ్లు మాత్రమే తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
  • ఆఫ్ఘనిస్తాన్: ఐపీఎల్ 2025 మెగా వేలం కోసం ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన 29 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో ఎంతమందికి అవకాశం దక్కుతుందో చూడాలి.
  • శ్రీలంక: ఈసారి శ్రీలంక ఆటగాళ్లు పెద్దఎత్తున తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దీని ప్రకారం ఐపీఎల్ మెగా వేలం జాబితాలో 29 మంది శ్రీలంక ఆటగాళ్ల పేర్లు వచ్చాయి.
  • బంగ్లాదేశ్: ఐపీఎల్‌లో బంగ్లాదేశ్ జట్టు ఆటగాళ్లు కనిపించడం చాలా అరుదు. అయితే ఈసారి 13 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
  • నెదర్లాండ్స్ : ఈ మెగా వేలానికి నెదర్లాండ్స్ కు చెందిన 12 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోవడం విశేషం. వీరిలో ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి.

ఇక టీమ్ యూఎస్ఏ నుంచి 10 మంది ఆటగాళ్లు, ఐర్లాండ్ నుంచి 9 మంది ఆటగాళ్లు, జింబాబ్వే నుంచి 8 మంది ఆటగాళ్లు, కెనడా నుంచి 4 మంది ఆటగాళ్లు, స్కాట్లాండ్ నుంచి ఇద్దరు, ఇటలీ, యూఏఈ నుంచి ఒక్కొక్కరు చొప్పున మెగా వేలానికి రిజిస్టర్ చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్