06 November 2024
TV9 Telugu
Pic credit - Getty
శరీర కండరాలు ఆరోగ్యంగా ఉండడమే కాదు యాంటీ బాడీలను తయారు చేయడం, సరైన జీవక్రియను నిర్వహించడం, pH బ్యాలెన్స్ చేయడం మొదలైన వాటికి ప్రొటీన్స్ అవసరం.
ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాల విషయానికి వస్తే గుడ్లు, మాంసం, చేపలు మొదలైనవాటిని గుర్తుచేసుకుంటారు. అయితే శాఖాహారులకు అద్భుతమైన ప్రోటీన్ వనరులున్న ఆహారలున్నాయి.
మాంసకృత్తుల కోసం, పాలను తినే ఆహారంలో చేర్చుకోండి.. అంతేకాదు చీజ్, పెరుగు మొదలైన పాల ఉత్పత్తులలో కూడా ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది.
ప్రోటీన్ ఎక్కువ ఉండే శాకాహారంలో సోయాబీన్ ఒక అద్భుతమైన ఆహారం. ఇందులో చికెన్ కంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. తక్కువ కొవ్వు ఉంటుంది.
ప్రోటీన్ సమృద్ధిగా ఉన్న శాఖాహారం గురించి మాట్లాడితే శనగలు తినే ఆహారంలో చేర్చుకోవాలి. వీటిని వేయించి, మొలకలుగా చేసుకుని లేదా ఉడక బెట్టుకుని కూడా తినవచ్చు.
పెసరు లేదా పెసర పప్పులో కూడా ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. తినే ఆహారంలో పెసర పప్పుతో పాటు మొలకలను చేర్చుకోవచ్చు. సలాడ్ లా తినవచ్చు.
వేరుశెనగలో అధిక మొత్తంలో ప్రోటీన్ లభిస్తుంది. ఉదయాన్నే నానబెట్టిన వేరుశెనగలను తినవచ్చు లేదా తినే ఆహారంలో వేరుశెనగలతో చేసిన ఆహారాన్ని చేర్చుకోవచ్చు.