ఖాళీ కడుపుతో రోజూ గుప్పెడు నానబెట్టిన నల్ల శనగలు తిన్నారంటే..!

06 November 2024

TV9 Telugu

TV9 Telugu

శనగలు చాలా మంది ఇష్టంగా తింటారు. వీటిల్లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇది శరీర నిర్మాణానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా నానబెట్టిన సెనగల్లో ఆరోగ్యానికి ఉపకరించే సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఉంటాయి

TV9 Telugu

ఇవి శక్తిని ఒకేసారి కాకుండా నెమ్మదిగా విడుదల చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను ఒక్కసారిగా కాకుండా నిదానంగా విడుదలయ్యేట్టు చేస్తాయి. శనగల్లో ఐరన్, ఫైబర్, విటమిన్ ఎ, ఇ ఉంటాయి

TV9 Telugu

వీటిల్లో గ్లైసమిక్‌ ఇండెక్స్‌ స్థాయిలు తక్కువ. అందువల్ల కాసిని తిన్నా నిదానంగా శక్తిని విడుదల చేస్తూ, చక్కెర స్థాయిలు పెరగకుండా చూసుకుంటాయి

TV9 Telugu

నల్ల శనగలు శరీరాన్ని ఇనుములా ధృడంగా మారుస్తాయి. ప్రొటీన్ లోపాన్ని దూరం చేసే శనగల్లో క్యాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. అందువల్ల, మీ ఎముకలను కూడా బలోపేతం చేసుకోవచ్చు

TV9 Telugu

రోజూ నల్ల శనగలను తీసుకోవాలి. కానీ నానబెట్టి లేదా మొలకెత్తిన తినడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు పొందవచ్చు. ఎండు ద్రాక్షల మాదిరిగానే శనగలు కూడా శరీరంలోని రక్తహీనతను దూరం చేస్తాయి

TV9 Telugu

ఇందులో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. రోజూ నానబెట్టిన శెనగలు తింటే శరీరానికి శక్తిని అందించి ఎక్కువ కాలం శక్తివంతంగా ఉంటుంది. పైగా వీటి ధర కూడా చౌకగా ఉంటుంది

TV9 Telugu

కానీ కడుపు సంబంధిత సమస్యలు లేదా అజీర్ణం ఉన్నవారు శనగలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీటిని జీర్ణం చేసుకోవడం అంత తేలిక కాదు. శనగలు తిన్న తర్వాత చురుకుగా ఉండటం చాలా అవసరం

TV9 Telugu

విటమిన్ సి లేకుండా ఐరన్, ప్రొటీన్లు అంత తేలికగా జీర్ణం కావు కాబట్టి పచ్చికూరగాయలు లేదా పండ్లతో పాటు వీటిని తీసుకోవాలి. నానబెట్టిన సెనగలు తింటే బ్రెస్ట్‌, లంగ్‌ క్యాన్సర్ల నుంచి రక్షణ లభిస్తుందని అధ్యయనాలు సైతం చెబుతున్నాయి