Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty Tips: యవ్వనంగా కనిపించాలనుకుంటున్నారా..? అయితే ఇది మీకోసమే..!

ఎప్పటికీ యవ్వనంగా, అందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అయితే వయస్సు పెరుగుతున్న కొద్దీ చర్మంపై ముడతలు, వృద్ధాప్య లక్షణాలు కనిపించడం సహజం. అయితే ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు. అందులో భాగంగా కొన్ని పండ్లను మీ ఆహారంలో చేర్చుకుంటే చర్మం తాజాగా మెరిసేలా ఉంటుంది. అలా సహజ సౌందర్యాన్ని పొందే కొన్ని ముఖ్యమైన పండ్ల గురించి తెలుసుకుందాం.

Prashanthi V

|

Updated on: Feb 14, 2025 | 4:10 PM

బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్లు A, C, B, K, E అధికంగా ఉంటాయి. ఇవి చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. బొప్పాయి చర్మంపై మృతకణాలను తొలగించి కొత్త చర్మాన్ని ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. దీని వల్ల చర్మం మృదువుగా తాజాగా ఉంటుంది.

1 / 5
దానిమ్మను రోజూ తినడం వల్ల చర్మానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇందులో విటమిన్ C, పాలీఫినోల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం కొల్లాజెన్ స్థాయిలను పెంచి ముడతలు రాకుండా చేస్తాయి. పైగా దీని యాంటీ ఆక్సిడెంట్లు UV కిరణాల ప్రభావాన్ని తగ్గించి చర్మాన్ని తాజాగా ఆరోగ్యంగా ఉంచుతాయి. దానిమ్మను రోజూ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా చర్మంపై సహజ కాంతిని పొందవచ్చు.

2 / 5
స్ట్రాబెర్రీలు కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ C అధికంగా ఉండటం వల్ల చర్మాన్ని హానికరమైన UV కిరణాల ప్రభావం నుంచి రక్షించగలవు. స్ట్రాబెర్రీలలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి సహజ మెరుపును అందిస్తాయి. ముఖంపై మచ్చలు, గాయాల ఆనవాళ్లు తగ్గించడానికి ఇవి సహాయపడతాయి.

3 / 5
బ్లూబెర్రీలు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించి వృద్ధాప్యాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. వీటిలో విటమిన్ C, విటమిన్ K, విటమిన్ B6 అధికంగా ఉండటం వల్ల చర్మానికి తగిన పోషణ అందుతుంది. బ్లూబెర్రీలు తినడం వల్ల చర్మం మెరుస్తూ ముడతలు తగ్గి యవ్వనంగా ఉంటుంది.

4 / 5
పెర్సిమన్ పండులో విటమిన్ C, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మ నిర్మాణాన్ని మెరుగుపరిచి, వృద్ధాప్య ప్రభావాలను తగ్గించడానికి సహాయపడతాయి. పెర్సిమన్‌లోని పోషకాలు చర్మానికి తగిన తేమను అందించి చర్మానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. ఫలితంగా చర్మం ఎక్కువ కాలం మెరిసేలా ఉంటుంది.

5 / 5
Follow us