Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travelling: వీసాతో పనిలేదు.. పాస్‌పోర్టుతో వెళ్లగలిగే 27 బ్యూటిఫుల్ డెస్టినేషన్స్ ఇవే..

మీ దగ్గర పాస్ పోర్టు ఉంటే చాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని డెస్టినేషన్స్ ప్లాన్ చేసుకోవచ్చు. వీటికి వీసాతో పనిలేదు. మీ పార్ట నర్ కి అప్పటికప్పుడు సర్ప్రైజ్ ప్లాన్ చేయాలన్నా.. ఎలాంటి ప్లానింగ్ లేకుండా ఫారిన్ కంట్రీస్ చూసి రావాలన్నా ఇదో మంచి అవకాశం. ఇంతకీ ఆ దేశాలేంటో చూసేయండి..

Travelling: వీసాతో పనిలేదు.. పాస్‌పోర్టుతో వెళ్లగలిగే 27 బ్యూటిఫుల్ డెస్టినేషన్స్ ఇవే..
Countries Voa
Follow us
Bhavani

|

Updated on: Feb 14, 2025 | 5:05 PM

ఎలాంటి ముందస్తు ప్లానింగ్ లేకుండా వేరే కంట్రీ టూర్ ప్లాన్ చేయాలనుకుంటున్నారా.. అయితే, ఇది మీ కోసమే. రోజుల తరబడి వీసాల కోసం తిరగాల్సిన పనిలేదు. డాక్యుమెంట్లు, వెరిఫికేషన్లు వంటి హడావిడి లేనేలేదు. అప్పటికప్పుడు అనుకుని కూడా ఈ దేశాలు చుట్టేసి రావచ్చు. మీరు విన్నది నిజమే. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్ టర్నెల్ అఫైర్స్ ప్రకారం దాదాపు 27 దేశాలు భారతీయులకు వీసా ఆన్ అరైవల్ వెసులుబాటును అందిస్తున్నాయి. మీ దగ్గర పాస్ పోర్టు ఉంటే చాలు. వీసా అవసరం లేకుండానే ఈ బ్యూటిఫుల్ కంట్రీస్ ను చుట్టేసి రావచ్చు. అందుకే నేపాల్, శ్రీలంక, భూటాన్, మాల్దీవులు వంటి దేశాలతో పాటు థాయ్ లాండ్, మలేషియా వంటివి కూడా ఉన్నాయి. అత్యంత శక్తిమంతమైన పాస్ పోర్టు కలిగిన ర్యాంకింగ్స్ లో భారత్ 80 స్థానంలో ఉంది. ఇక హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్ ప్రకారం అయితే ఏకంగా ఇండియన్ పాస్ పోర్టు కలిగిన వారు ఏకంగా 56 దేశాలు వీసా లేకుండా లేదా వీసా ఆన్ అరైవల్ ద్వారా వెళ్లిరావచ్చు.

వీసా ఆన్ అరైవల్ అంటే..

వీసా ఆన్ అరైవల్ అంటే ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకున్న తర్వాత పొందే వీసా. ఇందుకోసం సంబంధిత ఇమ్మిగ్రేషన్ అధికారులు సూచించిన విధంగా అవసరమైన పత్రాలతో పాటు విమానాశ్రయంలో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. వీసా ఆన్ అరైవల్ అనేది పొడిగించడం లేదా మార్చడం వంటివి చేయరు. దౌత్య, అధికారిక పాస్ పోర్టులు ఉ్నవారికి వీసా ఆన్ అరైవల్ సౌకర్యం అందుబాటులో లేదు. ప్రయాణానికి ముందు వీసా పొందలేని వారు, మర్చిపోవడం, సమయానికి వీసా అందలేని వారు ఈ విధంగా వీసా ఆన్ అరైవల్ పొందవచ్చు. అయితే, ఈ టూర్లో భద్రత కోస ప్రయాణ, ఆరోగ్య బీమా పాలసీని పొందవలసి ఉంటుంది.

ఈ దేశాలకు నో వీసా..

బొలీవియా, కేబ్ వెర్డ్, కంబోడియా, కుక్ ఐలాండ్స్, కొమొరోస్, ఇథియోపియా, ఫిజి, ఇండోనేషియా, ఇరాన్, జోర్డాన్, కిరిబాటి, లావోస్, మడగాస్కర్, మౌరుటనియా, మయున్మార్, పలావ్ ఐలాండ్స్, ఖతార్, మార్షల్ ఐలాండ్స్, రువాండా, సైరా లియోన్, శ్రీలంక, సోమాలియా, సమోవా, టైమర్ లేస్ట్, సెయింట్ లుసియా, జింబాబ్వే.