Kafal Fruit Benefits: పీఎం మోడీకి ఇష్టమైన కఫాల్ ఫ్రూట్‌లో ఎన్నో ఆరోగ్య రహస్యాలు..
కపాల్ పండు గురించి మీకు సరిగా తెలియకపోవచ్చు. కానీ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఈ కఫాల్ ఫ్రూట్ అంటే ఎంతో ఇష్టం. ఈ పండును ఆయన ఎంతో ఇష్టంగా తింటారట. ఈ ఫ్రూట్ సుమారుగా 1500 - 2000 మీరట్ల ఎత్తులో పెరుగుతుంది. ఈ పండు చిన్నగా, గుండ్రంగా ఎరుపు రంగులో ఉంటుంది. చాలా రుచికరంగా కూడా ఉంటుంది. ఈ ఫ్రూట్ ఇండియా, శ్రీలం, నేపాల్‌లోని హిమాలయ ప్రాంతాల్లో లభ్యమవుతుంది. అలాగే ఈ పండు ఎక్కువగా జూన్ నుంచి సెప్టెంబర్..

కపాల్ పండు గురించి మీకు సరిగా తెలియకపోవచ్చు. కానీ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఈ కఫాల్ ఫ్రూట్ అంటే ఎంతో ఇష్టం. ఈ పండును ఆయన ఎంతో ఇష్టంగా తింటారట. ఈ ఫ్రూట్ సుమారుగా 1500 – 2000 మీరట్ల ఎత్తులో పెరుగుతుంది. ఈ పండు చిన్నగా, గుండ్రంగా ఎరుపు రంగులో ఉంటుంది. చాలా రుచికరంగా కూడా ఉంటుంది. ఈ ఫ్రూట్ ఇండియా, శ్రీలం, నేపాల్‌లోని హిమాలయ ప్రాంతాల్లో లభ్యమవుతుంది. అలాగే ఈ పండు ఎక్కువగా జూన్ నుంచి సెప్టెంబర్ మాసాల్లో మాత్రమే లభ్యమవుతుంది. ఇది సీజనల్ వారీగా లభ్యమయ్యే ఫ్రూట్. ఇందులో అనే రకాలైన పోషకాలు నిండి ఉన్నాయి. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్లు సి, ఎలు లభిస్తాయి. ఇది చూడటానిక బెర్రీల రూపంలో కనిపిస్తాయి. ఈ పండు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
చర్మానికి, జుట్టుకు మంచిది:
కఫాల్ ఫ్రూట్‌లో అనేక రకాలైన పోషకాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల చర్మం, జుట్టు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని తింటే జుట్టు బలంగా, దృఢంగా తయారవుతుంది. చర్మం హైడ్రేట్ అవుతుంది. అందులోనూ ఇవి సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఖచ్చితంగా లభ్యమైతే తీసుకోవడం మంచిది.
రక్తపోటు – షుగర్ వ్యాధి అదుపులో..
కఫాల్ పండు తినడం వల్ల బీపీ, షుగర్ వ్యాధి అనేవి అదుపు చేయవచ్చు. ఇందులో ఉండే పోషకాలు అందుకు హెల్ప్ చేయవచ్చు. బీపీ, డయాబెటీస్‌తో బాధ పడేవారు ఎలాంటి ఆలోచన లేకుండా ఈ కఫాల్ ఫ్రూట్ తినొచ్చు. ఈ పండు తినడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుంటా ఉంటారు.
చెవి – పంటి నొప్పులు మాయం:
సీజనల్‌గా లభ్యమయ్యే ఈ ఫ్రూట్ తినడం వల్ల చెవి, పంటి నొప్పులు తగ్గుతాయి. చాలా మంది చెవి, పంటి నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ పండు తింటే మంచిది. అదే విధంగా ఆస్తమా ఉండే వారు తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య నుంచి రిలీఫ్ పొందుతారు.
దగ్గు – అల్సర్స్:
కఫాల్ పండులో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి మెండుగా ఉంటాయి. దీని వల్ల దగ్గు, అల్సర్స్, ఫీవర్, రక్త హీనత సమస్యలు త్వరగా నయం అవుతాయి.
రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:
కఫాల పండులో అనేక రకాలైన పోషకాలు ఉన్నాయి. కాబట్టి ఇవి తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. దీని వల్ల ఇతర అనారోగ్య సమస్యలతో పోరాడే శక్తి లభిస్తుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..








