AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Type 1 Diabetes: ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడండి.. టైప్-1 డయాబెటీస్ వచ్చినట్టే!

ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరూ డయాబెటీస్ బారిన పడుతున్నారు. డయాబెటీస్ ఒక్కసారి వచ్చిందంటే.. అంత ఈజీగా కంట్రోల్ చేయలేం. డయాబెటీస్‌ను కంట్రోల్ చేసుకోవాలంటే చాలా కష్టం. డయాబెటీస్ కారణంగా ఇతర అనారోగ్య సమస్యలు సైతం వస్తున్నాయి. డయాబెటీస్‌లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి టైప్ - 1, మరొకటి టైప్ - 2. అయితే చాలా మందికి ముందుగా టైప్ - 2 డయాబెటీసే ఎటాక్ అవుతుంది. ఈ టైప్ - 2 డయాబెటీస్ వ్యాధి లక్షణాలు..

Type 1 Diabetes: ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడండి.. టైప్-1 డయాబెటీస్ వచ్చినట్టే!
Type 1 Diabetes
Chinni Enni
|

Updated on: Mar 21, 2024 | 5:09 PM

Share

ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరూ డయాబెటీస్ బారిన పడుతున్నారు. డయాబెటీస్ ఒక్కసారి వచ్చిందంటే.. అంత ఈజీగా కంట్రోల్ చేయలేం. డయాబెటీస్‌ను కంట్రోల్ చేసుకోవాలంటే చాలా కష్టం. డయాబెటీస్ కారణంగా ఇతర అనారోగ్య సమస్యలు సైతం వస్తున్నాయి. డయాబెటీస్‌లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి టైప్ – 1, మరొకటి టైప్ – 2. అయితే చాలా మందికి ముందుగా టైప్ – 2 డయాబెటీసే ఎటాక్ అవుతుంది. ఈ టైప్ – 2 డయాబెటీస్ వ్యాధి లక్షణాలు గురించి తెలుసు. కానీ టైప్ – 1 డయాబెటీస్ ఏంటి? అది ఎలా వస్తుంది? అనేది చాలా మందికి తెలీదు.

టైప్ – 1 డయాబెటీస్ అనేది శరీరంలోని ఇన్సులిన్ లోపం కారణంగా వస్తుంది. ఇన్సులిన్ అనేది గ్లూకోజ్‌ను శక్తి కోసం కణాల్లోకి తీసుకెళ్లడానికి సహాయ పడే హార్మోన్. టైప్ – 1 డయాబెటీస్‌లో శరీరం ఇన్సులిన్ అనేదాన్ని ఉత్పత్తి చేయదు. దీని వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. టైప్ – 1 డయాబెటీస్ అనేది కుటుంబ సభ్యుల్లో ఎవరికి ఉన్నా ఇతరులకు కూడా రావొచ్చు. అలాగే ఇది 20 సంవత్సరాల లోపు వారికి వస్తుంది. మరి టైప్ – 1 డయాబెటీస్ లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

అధిక మూత్ర విసర్జణ:

టైప్ – 1 డయాబెటీస్ ఉంటే అధికంగా మూత్ర విసర్జణ జరుగుతూ ఉంటుంది. గ్లూకోజ్‌ను శరీరం నుంచి బయటకు పంపడానికి శరీరం ప్రయత్నిస్తుంది.

ఇవి కూడా చదవండి

అధిక దాహం:

టైప్ – 1 డయాబెటీస్ ఉంటే విపరీతంగా దాహం వేస్తుంది. మీరు ఎన్ని మంచినీళ్లు తాగినప్పటికీ ఇంకా దాహం వేస్తూనే ఉంటుంది. అధిక మూత్ర విసర్జణ కారణంగా దాహం అనేది ఎక్కువగా అవుతుంది. దీన్ని మొదటి లక్షణంగా చెప్తారు.

తీవ్రమైన ఆకలి:

టైప్ – 1 డయాబెటీస్ లక్షణాల్లో ఇది కూడా ఒకటి. అధిక దాహంతో పాటు ఎక్కువగా ఆకలి కూడా వేస్తుంది. మీరు ఎంత తిన్నా.. ఇంకా ఆకలి వేస్తుంది. ఈ ఆకలిని మీరు నియంత్రించుకోలేరు. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి విపరీతంగా పెరిగి పోతాయి.

వెయిట్ లాస్ అవుతారు:

మీరు ఎంత ఎక్కువగా తీసుకున్నా.. మీకు తెలియకుండానే మీరు బరువును కోల్పోతారు. బలహీనంగా, నీరసంగా ఉంటారు. అలసట ఎక్కువగా ఉంటుంది. శరీరానికి శక్తిని కోల్పోతారు. అంతే కాకుండా మీ దృష్టి కూడా సరిగా కనిపించదు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..