AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అడపాదడపా ఉపవాసం చేస్తున్నారా.? అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్టే.. ఇదిగో క్లారిటీ..

ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్(అడపాదడపా ఉపవాసం) వల్ల గుండె జబ్బులు వస్తాయని, స్ట్రోక్ వస్తుందని గత నాలుగైదు రోజులుగా ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మనం ఆహారాన్ని తీసుకున్న వెంటనే నోట్లో నుంచే జీర్ణక్రియ అనేది ప్రారంభమవుతుంది. లాలాజలంలో టయలిన్ అనే ఎన్‌జైమ్ ఉంటుంది.

అడపాదడపా ఉపవాసం చేస్తున్నారా.? అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్టే.. ఇదిగో క్లారిటీ..
Fasting
P Kranthi Prasanna
| Edited By: Ravi Kiran|

Updated on: Mar 21, 2024 | 5:42 PM

Share

ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్(అడపాదడపా ఉపవాసం) వల్ల గుండె జబ్బులు వస్తాయని, స్ట్రోక్ వస్తుందని గత నాలుగైదు రోజులుగా ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మనం ఆహారాన్ని తీసుకున్న వెంటనే నోట్లో నుంచే జీర్ణక్రియ అనేది ప్రారంభమవుతుంది. లాలాజలంలో టయలిన్ అనే ఎన్‌జైమ్ ఉంటుంది. మన జీర్ణాశయంలో 4 గంటల పాటు ఉండి అక్కడ జీర్ణాశయంలో ఉండే హైడ్రోక్లోరిక్ యాసిడ్.. కాలేయం నుంచి వచ్చే కాలేయ రసాలు బైల్ యాసిడ్స్, క్లోమం నుంచి వచ్చే ఎన్‌జైమ్‌లు అన్ని కూడా ఈ ఆహారంతో కలుస్తాయి. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి జీర్ణాశయం నుంచి మన ఆహారం బయటకు వెళ్లడానికి 6 గంటల సమయం పడుతుంది. జీర్ణాశయం నుంచి ఆహారం కిందకు వెళ్తేనే మరలా మనకు ఆకలి వేసినట్టు అనిపిస్తుంది. కానీ అక్కడే మనం పప్పులో కాలేస్తాం. అసలైన జీర్ణ వ్యవస్థ.. అసలైన ఆహారం జీర్ణం కావడం 6 గంటల తర్వాతే ప్రారంభమవుతుంది. దీనిని ఇంటర్ డైజెస్టివ్ ఫేస్ అని అంటారు.

ఈ ఆహారం జీర్ణకోశం నుంచి కిందకు వెళ్లిన తర్వాత దాదాపు 3 మీటర్ల పొడుగున ఉండే చిన్న ప్రేగుల ద్వారా వెళ్తూ ఉంటుంది. అప్పుడు మన ఆహారంలో ఉన్న పదార్థాల్ని గ్లూకోజ్ గానూ ప్రోటీన్ లాగానే విభజించి వాటిని చిన్న ప్రేగులలో ఉన్న విల్లై ద్వారా అబ్సార్బ్ చేసుకొని అవి మరలా బ్లడ్‌లో కలిసి లివర్‌కు వెళ్లి కొంత స్టోర్ అయ్యి మనకు శక్తిని ప్రసాదిస్తాయి. తరువాత మిగిలిన వ్యర్థ పదార్థాలు పెద్ద ప్రేగులోకి వెళ్లి వీలైనంత నీటిని పీల్చుకొని విసర్జన జరుగుతుంది. ఇలా జీర్ణం కావడానికి మొత్తం 24 గంటల సమయం పడుతుంది. మన శరీరానికి కావలసిన శక్తిని ప్రసాదించేది ఇంటర్ డైజెస్టివ్ ఫేస్ అనే 16 గంటల సమయమే.. మనం చాలామంది జీర్ణకోశంలో ఆహారం ఉంటేనే మనకి శక్తి వస్తుంది అని అనుకుంటాం అది తప్పు. మరి ఈ మధ్య కాలంలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తే హార్ట్ స్ట్రోక్స్ వస్తాయంటూ వైరల్‌గా మారింది. దీన్ని వైద్యులు కొట్టిపారేశారు. చైనాలో ఓ 200 మందికి ఫోన్ చేసి ప్రశ్నలడిగి, అవే ప్రశ్నలు అమెరికాలో ఉండే 200 మందికి అడిగి ఇక గుండె జబ్బులు వస్తాయి అంటున్నారని.. కానీ వాస్తవానికి దీనికి ఎటువంటి శాస్త్రీయమైన ఆధారాలు జతపరచలేదని.. ఇది ఒక బేసిక్ స్టడీ మాత్రమే కానీ దీనికి ఎటువంటి ప్రామాణికత లేదంటున్నారు.

బాగా గమనించినట్లయితే చాలా జంతువులు, పక్షులు అన్నీ కూడా ఒక పూటనే తింటాయని.. మనుషుల మాదిరి చాలాసార్లు తినవంటున్నారు. తక్కువసార్లు తినడం వల్ల జీర్ణ వ్యవస్థకు కొంచెం గ్యాప్ ఇవ్వడం వల్ల పేగులలో ఆహారం బాగా జీర్ణమయ్యి ఇంకా బాగా శరీరంలోకి అబ్సార్బ్ అవుతుంది అంటున్నారు. అందుకే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది నిజంగా ఫాస్టింగ్ కాదని మామూలుగా చేయాల్సిన పనే అంటున్నారు. అది కాకపోతే మనం ఎక్కువసార్లు తినడం అలవాటు చేసుకున్నాం. శరీర నిర్మాణంలో జీర్ణాశయం అనేది ఒక స్టోరేజ్ పాయింట్. పాత కాలంలో ఆహారం సదా దొరకదు. కాబట్టి మనకు జీర్ణాశయం అనేది పరిణామ క్రమంలో డెవలప్ అయింది. అనగా మనం ఆహారాన్ని ఒకేసారి తీసుకొని దానిని నిదానంగా కిందికి పంపిస్తూ జీర్ణం జరగడానికి అలవాటు పడిపోయాం. కానీ ఈ మారిన నవీన యుగంలో ఆహారాన్ని బయట స్టోరేజ్ చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి మనకు ఎప్పుడు పడితే అప్పుడు ఆహారం దొరుకుతుంది. అందుకని ఎక్కువసార్లు మనం తినాల్సిన అవసరం లేదంటున్నారు. మనం ఎంత తినాలి అని అనుకుంటే.. అంతా మనకు కావలసిన, మనకు నచ్చిన పదార్థం ఒక పూట తిన్నా గాని 24 గంటలకు సరిపోతుందని అంటున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..