Cloves Uses: ఈ చిన్నగా ఉండే మసాలా దినుసులతో.. చెప్పలేనన్ని ఉపయోగాలు..

మనం నిత్యం ఉపయోగించే వాటిల్లో మసాలా దినుసులు కూడా ఒకటి. ఈ మసాలా దినుసులను ఏదో ఒక రూపంలో ఉపయోగిస్తూనే ఉంటాం. పూర్వం నుంచి మసాలా దినుసులను విరివిగా వాడుతూ ఉంటున్నారు. వీటి వలన లాభాలే కానీ నష్టాలు చాలా తక్కువ. అప్పట్లో ఈ మసాలా దినుసులతోనే పలు రకాల అనారోగ్య సమస్యలకు వైద్యం చేసేవారు. వీటిల్లో లవంగాలు కూడా ఒకటి. ఇవి చూడటానికి చిన్నగా ఉన్నా..

Cloves Uses: ఈ చిన్నగా ఉండే మసాలా దినుసులతో.. చెప్పలేనన్ని ఉపయోగాలు..
Cloves uses
Follow us
Chinni Enni

|

Updated on: Jun 10, 2024 | 5:49 PM

మనం నిత్యం ఉపయోగించే వాటిల్లో మసాలా దినుసులు కూడా ఒకటి. ఈ మసాలా దినుసులను ఏదో ఒక రూపంలో ఉపయోగిస్తూనే ఉంటాం. పూర్వం నుంచి మసాలా దినుసులను విరివిగా వాడుతూ ఉంటున్నారు. వీటి వలన లాభాలే కానీ నష్టాలు చాలా తక్కువ. అప్పట్లో ఈ మసాలా దినుసులతోనే పలు రకాల అనారోగ్య సమస్యలకు వైద్యం చేసేవారు. వీటిల్లో లవంగాలు కూడా ఒకటి. ఇవి చూడటానికి చిన్నగా ఉన్నా.. వీటి వలన కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఈ లవంగాల్లో.. విటమిన్లు ఎ, సి, ఇ, ఎలు, డైటరీ ఫైబర్, పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. వీటిని పలు ఫార్మాస్యుటికల్, కాస్మెటిక్స్ రంగాలకు సంబంధించిన ఉత్పత్తుల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వీటిని తీసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

రక్తాన్ని శుద్ధి చేస్తాయి:

లవంగాలు తీసుకోవడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. ఎందుకంటే ఇందులో పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లతో పాటు యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి రక్తాన్ని క్లీన్ చేసి.. బాడీని హెల్దీగా ఉంచడంలో సహాయ పడుతుంది. రక్తం క్లీన్‌గా ఉంటే.. ఎలాంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి.

క్యాన్సర్ నిరోధక లక్షణాలు:

లవంగాల్లో యాంటీ యాక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. అంతే కాకుండా లవంగాల్లో క్యాన్సర్ నిరోధక లక్షణాలు కూడా ఉంటాయి. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల క్యాన్సర్ కణాలు పెరుగకుండా అడ్డుకుంటాయి.

ఇవి కూడా చదవండి

వెయిట్ లాస్:

మీకు తెలుసా.. లవంగాలతో కూడా చక్కగా వెయిట్ లాస్ అవ్వొచ్చు. వీటిల్లో ఉండే విటమిన్లు, డైటరీ ఫైబర్, యూజినాల్, యాంటీ ఆక్సిడెంట్లు బరువు పెరగకుండా హెల్ప్ చేస్తాయి. కాబట్టి ప్రతి రోజూ మీరు లవంగాల నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది.

శరీర నొప్పులు మాయం:

లవంగాలతో నూనె కూడా తయారు చేస్తారు. ఈ నూనెతో శరీరాన్ని మర్దనా చేయడం వల్ల శరీరంపై వచ్చే వాపులు, నొప్పులు అన్నీ తగ్గుతాయి. మీకు కొద్ది రోజుల్లోనే ఉపశమనం ఉంటుంది.

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:

లవంగాలను తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ బల పడుతుంది. వీటిని తీసుకోవడం వల్ల ఇన్ ఫెక్షన్లు వంటివి దరి చేరకుండా చూస్తుంది. సైనస్, ఆస్థమా, వైరల్ ఇన్ ఫెక్షన్లు, దగ్గు, జలుబు వంటివి తగ్గుతాయి. ఇవే కాదు ఇంకా ఎన్నో విధాలుగా లవంగాలు సహాయ పడతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!