Bay Leaf for Hair: ఈ ఆకుతో జుట్టు సమస్యలన్నీ మాయం అయిపోతాయ్!
ప్రస్తుత కాలంలో చాలా మంది ఎక్కువగా ఇబ్బంది పడే సమస్యల్లో జుట్టు సమస్యలు కూడా ఒకటి. చిన్న వయసులోనే చాలా మందికి జుట్టు రాలిపోవడం, చుండ్రు రావడం, బలహీనంగా మారడం, డల్‌గా ఉండటం ఇలా అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చుండ్రు కారణంగా చర్మ సమస్యలు కూడా వస్తాయి. చర్మం జిడ్డు కారడం, మొటిమలు రావడం జరుగుతుంది. బయటకు వెళ్లినప్పుడు భుజంపై చుండ్రు పడటం వల్ల..
ప్రస్తుత కాలంలో చాలా మంది ఎక్కువగా ఇబ్బంది పడే సమస్యల్లో జుట్టు సమస్యలు కూడా ఒకటి. చిన్న వయసులోనే చాలా మందికి జుట్టు రాలిపోవడం, చుండ్రు రావడం, బలహీనంగా మారడం, డల్‌గా ఉండటం ఇలా అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చుండ్రు కారణంగా చర్మ సమస్యలు కూడా వస్తాయి. చర్మం జిడ్డు కారడం, మొటిమలు రావడం జరుగుతుంది. బయటకు వెళ్లినప్పుడు భుజంపై చుండ్రు పడటం వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. జుట్టు సమస్యల్ని తగ్గించుకోవడంలో ఇప్పటికే ఎన్నో రకాల చిట్కాలను తెలుసుకున్నాం. మరి బిర్యానీ ఆకుతో జుట్టు సమస్యల్ని ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
బిర్యానీ ఆకు కేవలం ఆరోగ్యం కోసమే కాకుండా అందాన్ని పెంచుకోవడంలో కూడా ఉపయోగించుకోవచ్చు. బిర్యానీ ఆకులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు, యాంటీ ఫంగల్ లక్షణాలు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి జుట్టు సమస్యల్ని తగ్గించడంలో బిర్యానీ ఆకు చక్కగా పని చేస్తుంది.
చుండ్రుకు బైబై చెప్పండి:
ఈ చుండ్రు సమస్యని తగ్గించడంలో బిర్యానీ ఆకు చక్కగా పని చేస్తుంది. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో నీళ్లు, బిర్యానీ ఆకులు, కొన్ని వేపాకులు వేసి బాగా ఉడికించండి. ఇవి ఉడికాక ఇందులోని ఆకుల్ని తీసి చల్లార్చి మిక్సీలో వేసి గ్రైండ్ చేయండి. దీనికి వేప నూనె కలిపి తలకు బాగా పట్టించండి. ఆ తర్వాత చేతి వేళ్లతో బాగా మసాజ్ చేయండి. ఓ పావు గంట తర్వాత తల స్నానం చేయండి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే.. చుండ్రు తగ్గుతుంది. దురద వంటివి కూడా తగ్గుతాయి.
ఇన్ఫెక్షన్ తగ్గుతుంది:
బిర్యానీ ఆకుల్ని నీటిలో ఉడికించి చల్లార్చి.. ఆకుల్ని పేస్టులా తయారు చేయండి. ఈ పేస్టులో కొద్దిగా కొబ్బరి నూనె కలిపి.. తలకు బాగా పట్టించండి. ఓ పావు గంట తర్వాత షాంపూతో తల స్నానం చేయండి. ఇలా చేయడం వల్ల చుండ్రుతో పాటు దురదలు తగ్గి, ఇన్ ఫెక్షన్‌లు కూడా తగ్గిపోతాయి.
జుట్టు పెరుగుతుంది:
ఒక గిన్నెలో నీటిని వేసి అందులో కొన్ని బిర్యానీ ఆకులు వేయాలి. ఆ గిన్నెను స్టవ్ మీద పెట్టి.. నీరు సగానికి వచ్చేంత వరకూ మరిగించాలి. ఈ నీటిని చల్లార్చి.. ఓ కంటైనర్‌లో స్టోర్ చేసుకోవాలి. ఈ నీటిని తల స్నానం చేసిన తర్వాత కుదుళ్ల నుంచి చివర్ల వరకూ బాగా పట్టించాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే జుట్టు రాలడం, చివర్లు చిట్లడం తగ్గి సాఫ్ట్‌గా అవుతుంది. జుట్టు కూడా పెరుగుతుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)