AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salman Khan: లిజార్డ్ టెక్స్చర్ లెదర్ జాకెట్ లో సల్మాన్ ఖాన్ లుక్‌ అదుర్స్‌.. దాని ధరతో ఎన్ని కార్లు కొనచ్చో తెలుసా

ఆయన ఒక ట్రెండ్ సెట్టర్. ఆయన ఏది వేసుకున్నా అది స్టైల్ స్టేట్‌మెంట్ అయిపోతుంది. ఇప్పటివరకు ఆయన ధరించిన వాచీలు, బ్రాస్‌లెట్లు వార్తల్లో నిలిచాయి. కానీ 2026 ఫిబ్రవరి నెలలో జరిగిన ఒక భారీ ఈవెంట్ లో ఆయన ధరించిన ఆ జాకెట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

Salman Khan: లిజార్డ్ టెక్స్చర్ లెదర్ జాకెట్ లో సల్మాన్ ఖాన్ లుక్‌ అదుర్స్‌.. దాని ధరతో ఎన్ని కార్లు కొనచ్చో తెలుసా
Salmankhan...
Nikhil
|

Updated on: Feb 15, 2026 | 6:30 AM

Share

ఆ ఒక్క జాకెట్ ధరతో మన దేశంలో ఒక లగ్జరీ ఎస్‌యూవీ (SUV) కారును కొనేయవచ్చు. కేవలం బ్రాండ్ పేరు కోసమే కాకుండా, దాని తయారీలో వాడిన మెటీరియల్, దాని డిజైన్ ఇప్పుడు ఫ్యాషన్ వరల్డ్ లో చర్చనీయాంశంగా మారాయి. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ధరించిన ఆ అల్ట్రా-లగ్జరీ జాకెట్ విశేషాలేంటో చూద్దాం.

కారు కంటే ఖరీదైన జాకెట్..

ఇటీవల జరిగిన వెరైటీ మ్యాగజైన్ లాంచ్ ఈవెంట్ లో సల్మాన్ ఖాన్ తన లుక్ తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన ధరించిన ‘బ్రియోని’ ఎంబాస్డ్ లెదర్ జాకెట్ ధర సుమారు రూ.62,30,100 రూపాయలు. అంటే అక్షరాలా అరకోటి కంటే ఎక్కువే! భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టయోటా ఫార్చ్యూనర్ టాప్ మోడల్ ధర కంటే ఈ జాకెట్ ఖరీదు ఎక్కువ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “ఒక మనిషి ఫార్చ్యూనర్ కారును ఒంటిపై వేసుకుని తిరుగుతున్నాడు” అంటూ ఫ్యాన్స్ కామెంట్లతో రచ్చ చేస్తున్నారు.

బ్రియోని బ్రాండ్ ప్రత్యేకత..

ఇటలీకి చెందిన బ్రియోని అనేది ప్రపంచంలోని టాప్ లగ్జరీ బ్రాండ్లలో ఒకటి. సాధారణంగా హాలీవుడ్ స్టార్స్, వివిధ దేశాల అధ్యక్షులు ఈ బ్రాండ్ వస్తువులను ధరిస్తుంటారు. ఇది ‘క్వైట్ లగ్జరీ’ అనే కాన్సెప్ట్ మీద నడుస్తుంది. అంటే దీని మీద పెద్ద పెద్ద లోగోలు కనిపించవు కానీ, దీని నాణ్యత, తయారీ విధానం చూస్తేనే అది ఎంతటి ఖరీదైనదో అర్థమవుతుంది. సల్మాన్ ఖాన్ ధరించిన ఈ జాకెట్ ప్రీమియం కాఫ్ లెదర్ తో తయారైంది. ఈ జాకెట్ పై ఉన్న లిజార్డ్-స్కిన్ ఎంబాస్డ్ (పెద్ద బల్లి లేదా క్రాకడైల్ టెక్స్చర్ లాంటి) ఫినిష్ దీనికి ఒక రాయల్ లుక్ ఇచ్చింది. చాలా దృఢంగా, మగతనాన్ని ఉట్టిపడేలా చేసే ఈ డిజైన్ కు గోల్డ్ జిప్స్ మరియు బటన్స్ అదనపు ఆకర్షణగా నిలిచాయి. సాధారణంగా సల్మాన్ ఖాన్ డార్క్ కలర్స్ ను ఎక్కువగా ఇష్టపడతారు. ఈ నలుపు రంగు లెదర్ జాకెట్ ఆయన పర్సనాలిటీకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది.

‘బాప్ ఆఫ్ బాలీవుడ్ స్టైల్’..

సల్మాన్ ఖాన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్ కావడంతో ఇంటర్నెట్ లో ఆయన స్వాగ్ పై చర్చ మొదలైంది. “స్టైల్ లో ఆయనకు ఆయనే సాటి.. బాప్ ఆఫ్ బాలీవుడ్ స్టైల్” అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కేవలం సినిమా ప్రమోషన్ల కోసమే కాకుండా, పర్సనల్ లైఫ్ లో కూడా సల్మాన్ ఇంతటి ఖరీదైన వస్తువులను వాడటం ఆయన హోదాను తెలియజేస్తోంది. గతంలోనూ సల్మాన్ ఖాన్ వాడిన వాచీలు కోట్ల రూపాయల ధర పలికాయి.

ఇప్పుడు ఈ రూ.62 లక్షల జాకెట్ ఆ లిస్టులో చేరిపోయింది. సల్మాన్ ఖాన్ స్టైల్ ఎప్పుడూ యూనిక్ గానే ఉంటుంది. ఒకప్పుడు కేవలం ఫిట్‌నెస్ తో ట్రెండ్ సెట్ చేసిన భాయ్.. ఇప్పుడు తన అల్ట్రా-లగ్జరీ ఫ్యాషన్ తో యువతను ఆకట్టుకుంటున్నారు. రూ.62 లక్షల విలువైన జాకెట్ ధరించి ఆయన ఇచ్చిన ఫోజులు చూస్తుంటే.. బాలీవుడ్ సుల్తాన్ రేంజ్ ఏంటో మరోసారి స్పష్టమైంది. వస్తువు ఏదైనా అది సల్మాన్ ఖాన్ వేసుకుంటే వచ్చే ఆ కిక్కే వేరు అంటున్నారు అభిమానులు.