Saffron Benefits: చిటికెడు కుంకుమ పువ్వుతో ఈ రోగాలన్నీ పరార్..

|

Oct 04, 2024 | 3:54 PM

కుంకుమ పువ్వు అనగానే చాలా మందికి గర్భిణీలు గుర్తొస్తారు. ఎందుకంటే గర్భీణీలే ఎక్కువగా ఈ కుంకుమ పువ్వును ఉపయోగిస్తూ ఉంటారు. కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగడం వల్ల పుట్టే బిడ్డ ఎంతో అందంగా, ఆరోగ్యంగా, తెల్లగా పుడతాడని నమ్మకం. అందుకే విదేశాల నుంచి తెప్పించుకుని మరీ ఈ కుంకుమ పువ్వును ఉపయోగిస్తారు. కుంకుమ పువ్వునే కేవలం గర్భిణీలే కాదు ఇతరులు కూడా తీసుకోవచ్చు. కుంకుమ పువ్వు కూడా ఎంతో రుచిగా ఉంటుంది. పలు రకాల ఆహారాలు..

Saffron Benefits: చిటికెడు కుంకుమ పువ్వుతో ఈ రోగాలన్నీ పరార్..
Saffron
Follow us on

కుంకుమ పువ్వు అనగానే చాలా మందికి గర్భిణీలు గుర్తొస్తారు. ఎందుకంటే గర్భీణీలే ఎక్కువగా ఈ కుంకుమ పువ్వును ఉపయోగిస్తూ ఉంటారు. కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగడం వల్ల పుట్టే బిడ్డ ఎంతో అందంగా, ఆరోగ్యంగా, తెల్లగా పుడతాడని నమ్మకం. అందుకే విదేశాల నుంచి తెప్పించుకుని మరీ ఈ కుంకుమ పువ్వును ఉపయోగిస్తారు. కుంకుమ పువ్వునే కేవలం గర్భిణీలే కాదు ఇతరులు కూడా తీసుకోవచ్చు. కుంకుమ పువ్వు కూడా ఎంతో రుచిగా ఉంటుంది. పలు రకాల ఆహారాలు తయారు చేయడంలో కూడా కుంకుమ పువ్వును ఉపయోగిస్తారు. బిర్యానీ తయారీలో కూడా కుంకుమ పువ్వును యూజ్ చేస్తారు. కుంకుమ పువ్వుతో రుచి మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇది చేసే మేలు చాలా ఎక్కువే. అందుకే కుంకుమ పువ్వు అంత ఖరీదు. మరి కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలను తగ్గించుకోవచ్చో చూద్దాం.

యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ:

కుంకుమ పువ్వులో పలు రకాల యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి శరీరంలోని డెడ్ సెల్స్ నుంచి కణాలు డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. దీంతో కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఫ్రీ రాడికల్స్‌ను, మలినాలను, విష పదార్థాలను శరీరం నుంచి తొలగిస్తుంది.

చర్మ అందం:

కుంకుమ పువ్వు ఉపయోగించడం వల్ల చర్మం ఎంతో అందంగా తయారవుతుంది. కుంకుమ పువ్వు పలు రకాల బ్యూటీ ప్రోడెక్ట్స్‌లో కూడా వినియోగిస్తూ ఉంటారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మం క్లియర్‌గా ఉండేలా చేస్తుంది. రెగ్యులర్‌గా కుంకుమ పువ్వు తీసుకుంటే యంగ్‌గా ఉంటారు. ముడతలు రాకుండా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

ఒత్తిడి దూరం:

కుంకుమ పువ్వును తరచూ తీసుకుంటే ఒత్తిడి, ఆందోళన తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఇందులో యాంటీ డిప్రసెంట్ గుణాలు ఉంటాయి.

బరువు కంట్రోల్:

కుంకుమ పువ్వులో ఫైబర్ శాతం కూడా ఎక్కువగానే లభిస్తుంది. కుంకుమ పువ్వు వేసి చేసిన ఆహారాలు కొద్దిగా తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. దీంతో ఎక్కువగా ఆకలి వేయదు. ఇతర ఆహారాలు కూడా తీసుకోలేం. అలాగే శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. కాబట్టి అధిక బరువను తగ్గించుకోవచ్చు.

మధుమేహం కంట్రోల్:

కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి కూడా కంట్రోల్‌లో ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చేస్తుంది. దీంతో క్రమంగా డయాబెటీస్ అనేది నియంత్రణలోకి వస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..