AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ పాట్నర్‌లో ఈ మార్పులు గమనిస్తే.. జాగ్రత్త.. మీరు త్వరలోనే విడిపోబోతున్నారని అర్థం!

కొన్ని ప్రేమలు ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని పెళ్లి వరకు వెల్తే.. మరి కొన్ని ప్రేమలు మధ్యలోనే ఆగిపోతాయి. ఇందుకు కారణంగా ప్రేమికుల మధ్య మనస్పర్ధలు, గొడవలు అని చాలా మంది అనుకుంటారు. కానీ మిమ్మల్ని ప్రేమించే అమ్మాయి, అబ్బాయి మిమ్మల్ని వదిలి వెళ్లిపోవాలని నిర్ణయంచుకుంటే.. విడిపోయే ముందు వాళ్ల ప్రవర్తన ఎలా ఉంటుదో, వారిలో కనిపించే మార్పులు ఏవో ఇక్కడ తెలుసుకుందాం.

మీ పాట్నర్‌లో ఈ మార్పులు గమనిస్తే.. జాగ్రత్త.. మీరు త్వరలోనే విడిపోబోతున్నారని అర్థం!
Relationship Red Flags
Anand T
|

Updated on: Feb 05, 2026 | 9:29 PM

Share

ప్రేమించిన అందరి ప్రేమ విజయవంతం కాదు, కొంతమంది ప్రేమలో పదే పదే మోసపోతూ ఉంటారు. నిండా నమ్మిన వాళ్లే వాళ్లను మోసం చేసి వెళ్లిపోతారు. చాలా మంది బ్రేకప్‌లకు మూలకారణం గొడవలనే అనుకుంటారు. కానీ బ్రేకప్‌లు అకస్మాత్తుగా జరగవు, బ్రేకప్‌కు కొన్ని రోజుల ముందు మీ పాట్నర్‌లో కొన్ని మార్పులు కనిపిస్తాయి. ఈ మార్పులు మీ భాగస్వామిలో కనిపిస్తే వాళ్లు మిమ్మల్ని మోసం చేస్తున్నారని అర్థం. ఒక వేళ మీ పాట్నర్‌లో మీరు ఈ మార్పును, హెచ్చరిక చిహ్నాన్ని విస్మరిస్తే, అది ఖచ్చితంగా ఒక రోజు ప్రేమ వైఫల్యానికి దారి తీస్తుంది. వీడిపోయే ముందు మీ పాట్నర్‌లో కనిపించే మార్పులు ఏవో తెలుసుకుందాం.

మీ పాట్నర్‌లో ఈ మార్పులు విడిపోవడానికి దారితీయవచ్చు

మీ పాట్నర్ మిమ్మల్ని వదిలి వెళ్లాలని డిసైడ్ అయ్యిందంటే.. వారిలో వచ్చే మొదటి మార్పు ఏమిటంటే.. వాళ్లు మాట్లాడే విధానంలో మార్పులు వస్తాయి. మీ దగ్గర ముందులా మాట్లాడరు.గతంలో ఆప్యాయంగా ఉండే సంభాషణలు క్రమంగా అధికారికంగా మారుతాయి. వారి మాట్లాడే ప్రతి మాట మీకు గుచ్చుకునే విధంగా ఉంటుంది. వాటని మీరు తీసుకోలేరు. ఈ మార్పు కచ్చితంగా విడిపోవడానికి కారణం కావచ్చు.

ఒకప్పుడు మీతో గంటల తరబడి మాట్లాడే మీ పాట్నర్ మీరు మాట్లాడడం తగ్గిస్తారు. లేదా ప్రతి సారి నేను బిజిగా ఉన్నాను అని చెప్తారు. మిమ్మల్ని అవైడ్ చేయడానికి ప్రయత్నిస్తారు. లేదా నాకు మాట్లాడే సమయం లేదు అనే సమాధానాలు చెబితే వాళ్లు మీ నుంచి విడిపోవాలి అనకుంటున్నారని అర్థం. మీ ఇష్టాలకు వ్యాల్యూ ఇవ్వకపోవడం, మీ పట్ల వ్యంగా మాట్లాడుతుంటే వారు మీ పట్ల ఆసక్తిని కోల్పోతున్నారనే దానికి సంకేతం.

మిమ్మల్ని కలవడానికి సాకులు చెబుతున్నా, లేదా మీతో అబద్దాలు చెబుతున్నా, మీకు టైం ఇవ్వడం మానేసినా.. కచ్చితంగా వారు మీ నుంచి దూరంగా వెళ్లిపోవాలని చూస్తున్నట్టు అర్థం. అంతేకాదు మీ భాగస్వామి ప్రతిదాని పట్ల ఉదాసీనంగా ఉండటం ప్రారంభిస్తే, మీ పట్ల తక్కువ శ్రద్ధ చూపిస్తే, స్వార్థపూరిత ప్రవర్తనలను ప్రదర్శిస్తే, ఈ ప్రవర్తనలన్నీ వారు త్వరలో మీతో విడిపోబోతున్నారనేదానికి సంకేతం. ఒక రోజు, ఈ మార్పులే విడిపోవడానికి మూల కారణం అవుతాయి. కాబట్టి జాగ్రత్తగా వీటిని గమినించి మీరు భాగస్వామన్ని కొనసాగించాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకోండి.

Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు. వీటిపై మీకేవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పుట్టగొడుగులు తింటున్నారా ?? అయితే ఈ భాగాన్ని అస్సలు తినకండి
పుట్టగొడుగులు తింటున్నారా ?? అయితే ఈ భాగాన్ని అస్సలు తినకండి
నువ్వు నేను సినిమాకు రాస్తే జయం మూవీతో హిట్టు..
నువ్వు నేను సినిమాకు రాస్తే జయం మూవీతో హిట్టు..
గ్యాస్‌ వినియోగదారులకు షాక్‌.. వారికి నో బుకింగ్‌.. నో సిలిండర్‌
గ్యాస్‌ వినియోగదారులకు షాక్‌.. వారికి నో బుకింగ్‌.. నో సిలిండర్‌
తండ్రిని బాక్స్‌లో పెట్టి కొరియర్ చేసిన యువతి.. ఎందుకో తెలిస్తే..
తండ్రిని బాక్స్‌లో పెట్టి కొరియర్ చేసిన యువతి.. ఎందుకో తెలిస్తే..
నూనె‌లో కాదు.. అక్కడ పూరీలను నీటిలో వేయిస్తారు.. నమ్మండి ఇది నిజం
నూనె‌లో కాదు.. అక్కడ పూరీలను నీటిలో వేయిస్తారు.. నమ్మండి ఇది నిజం
ఎవరికీ నచ్చకపోయినా హిట్టు కొట్టాను.. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డ
ఎవరికీ నచ్చకపోయినా హిట్టు కొట్టాను.. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డ
ఇరాన్‌ యుద్ధం.. సామాన్యుడి సొంతింటి కల భస్మం..! నిర్మాణ సామగ్రి
ఇరాన్‌ యుద్ధం.. సామాన్యుడి సొంతింటి కల భస్మం..! నిర్మాణ సామగ్రి
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. కన్య రాశి వారికి ఇలా..
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. కన్య రాశి వారికి ఇలా..
మ్యూజిక్‌ను ఆపేసరికి త్రివిక్రమ్ ఒక మాట అన్నాడు.. కానీ.!
మ్యూజిక్‌ను ఆపేసరికి త్రివిక్రమ్ ఒక మాట అన్నాడు.. కానీ.!
డెస్క్‌ జాబ్‌ చేస్తున్నారా? కూర్చున్న చోటే ఈ సింపుల్‌ స్ట్రెచెస్
డెస్క్‌ జాబ్‌ చేస్తున్నారా? కూర్చున్న చోటే ఈ సింపుల్‌ స్ట్రెచెస్