పన్నీర్ ఆర్డర్ చేస్తే.. చికెన్… జొమాటోకు 50వేలు ఫైన్
ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోకి కన్జూమర్ కోర్టు షాక్ ఇచ్చింది. ఫుడ్ డెలివరీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు భారీ ఫైన్ విధించింది. పన్నీర్ స్థానంలో చికెన్ పంపి కస్టమర్‌ని ఇబ్బంది పెట్టినందుకు జొమాటోతో పాటు.. సర్వ్ చేసిన హోటల్‌కి భారీ జరిమానా వేసింది. పుణెకు చెందిన ఓ న్యాయవాది జొమాటో యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో పన్నీరు బట్టర్ మసాలా ఆర్డర్ చేశారు. పన్నీర్ బట్టర్ మసాలా స్థానంలో బట్టర్ చికెన్‌ను సర్వ్ చేశారు. పన్నీరు మాదిరిగానే చికెన్ […]

ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోకి కన్జూమర్ కోర్టు షాక్ ఇచ్చింది. ఫుడ్ డెలివరీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు భారీ ఫైన్ విధించింది. పన్నీర్ స్థానంలో చికెన్ పంపి కస్టమర్‌ని ఇబ్బంది పెట్టినందుకు జొమాటోతో పాటు.. సర్వ్ చేసిన హోటల్‌కి భారీ జరిమానా వేసింది. పుణెకు చెందిన ఓ న్యాయవాది జొమాటో యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో పన్నీరు బట్టర్ మసాలా ఆర్డర్ చేశారు. పన్నీర్ బట్టర్ మసాలా స్థానంలో బట్టర్ చికెన్‌ను సర్వ్ చేశారు. పన్నీరు మాదిరిగానే చికెన్ కూడా ఉండడంతో.. నాన్‌వెజ్‌ను తినేశారు లాయర్. ఆ తర్వాత అది చికెన్ అని గుర్తించి షాక్ తిన్నారు. అయితే నిజానికి శాకాహారి అయిన లాయర్ దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు. జొమాటోతో పాటు ఆ హాటల్‌పై వినియోగదారుల కోర్టులో పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన కోర్టు.. శాఖాహారానికి బదులుగా మాంసాహారాన్ని సర్వ్ చేసినందుకు జొమాటోతో పాటు ఆ హోటల్‌కు రూ. 55 వేల జరిమానా విధించింది. 45 రోజుల్లోగా జరిమానా కట్టాలని కోర్టు ఆదేశించింది. ఇందులో తమ తప్పు ఏమీ లేదని జొమాటో కోర్టులో వాదించింది. కాగా, తప్పు చేసింది హోటల్ ఏ అయినా.. అందులో ఇద్దరికీ సమాన భాగస్వామ్యం ఉందని చెప్పింది. రూ. 50వేలు ఫైన్ కట్టడంతో పాటు.. శాకాహారి అయిన లాయర్ చికిన్ తినేలా చేసినందుకు మరో రూ.5వేలు ఇవ్వాలని చెప్పింది.