AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యువరాజ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. త్వరలో క్రికెట్ లోకి రీఎంట్రీ ఇవ్వనున్న యువీ.. శ్రీశాంత్ కూడా..

టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్. త్వరలోనే యువరాజ్ తిరిగి క్రికెట్ లోకి అడుగుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి.

యువరాజ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. త్వరలో క్రికెట్ లోకి రీఎంట్రీ ఇవ్వనున్న యువీ.. శ్రీశాంత్ కూడా..
Rajeev Rayala
|

Updated on: Dec 15, 2020 | 7:48 PM

Share

టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్. త్వరలోనే యువరాజ్ తిరిగి క్రికెట్ లోకి అడుగుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం పంజాబ్ ఎంపిక చేసిన ప్రాబ‌బుల్స్ జాబితాలో యువీ పేరు ఉండ‌టం అభిమానుల్లో ఆనందాన్ని నింపుతుంది. ఈ టోర్నీ కోసం 30 మందితో ప్రాబబుల్స్ జాబితాను ప్ర‌క‌టించారు. యువీ ఇప్ప‌టికే మొహాలీలోని ఐఎస్ బింద్రా పంజాబ్ క్రికెట్ అసోసియేష‌న్ స్టేడియంలో నెట్ ప్రాక్టీస్ కూడా చేస్తుండటం విశేషం. గతేడాది జూన్‌లో యువీ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ.. ‘పంజాబ్‌ క్రికెట్ అసోసియేషన్‌’ కార్యదర్మి పునీత్‌ సంప్రదించడంతో తన సొంత రాష్ట్రం కోసం తిరిగి ఆడాలని నిర్ణయించుకున్నాడు. మ‌ళ్లీ క్రికెట్ బ్యాట్ ప‌ట్టుకోవ‌డం చాలా సంతోషంగా ఉందంటూ యువరాజ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను పోస్ట్ చేశాడు.బీసీసీఐ నిబంధ‌న‌ల ప్ర‌కారం యాక్టివ్ ప్లేయ‌ర్స్‌కు విదేశీ టీ20 లీగ్‌ల‌లో ఆడేందుకు అనుమ‌తి ఉండ‌దు. అయితే  యువీ రిటైర్మెంట్ తర్వాత కెన‌డాలో జ‌రిగిన గ్లోబ‌ల్ టీ20 లీగ్ స‌హా ప‌లు విదేశీ లీగ్స్‌లో ఆడుతున్నాడు. అయితే పీసీఏ సెక్ర‌ట‌రీ పునీత్ బాలి విజ్ఞ‌ప్తి మేర‌కు త‌న రిటైర్మెంట్‌పై పున‌రాలోచ‌న చేస్తున్న యువ‌రాజ్.. అందుకు అనుమ‌తి ఇవ్వాలంటూ బీసీసీఐ అధ్యక్షుడు సౌర‌వ్ గంగూలీ, కార్య‌ద‌ర్శి జే షాను కోరాడు. మరో వైపు పేసర్ శ్రీశాంత్ కూడా త్వరలో మైదానంలోకి అడుగు పెట్టనున్నాడు. ఐపీఎల్ స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో శ్రీశాంత్ పై బీసీసీఐ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది సెప్టెంబర్‌తో అతడిపై ఉన్న నిషేధం తొలగిపోయింది. దాంతో శ్రీశాంత్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో కేరళ జట్టు ఆటగాళ్ల ప్రాబుబుల్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. కేరళ క్రికెట్‌ సంఘం ఎంపిక చేసిన 26 మంది సభ్యుల ప్రాబబుల్స్‌లో చోటు దక్కించుకోవడంతో శ్రీశాంత్ పోటీ క్రికెట్‌లోకి వచ్చాడు.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్