గతంలో బహిష్కరణ..ఇప్పుడు కీలక పదవి

గతంలో బహిష్కరణ..ఇప్పుడు కీలక పదవి
Jagan forms TTD Trust Board

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎక్స్‌అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 28 మందికి అవకాశం కల్పించింది. ఈ 28 మందిలో 8 మంది ఏపీకిచెందిన వారు ఉన్నారు. తెలంగాణకు చెందిన ఏడుగురికి అవకాశం కల్పించారు. తమిళనాడు నుంచి నలుగురు, కర్ణాటక నుంచి ముగ్గురికి టీటీడీ పాలకమండలిలో స్ధానం కల్పించారు. ఢిల్లీ, మహారాష్ట్ర నుంచీ ఒక్కొక్కరికి సభ్యత్వం కల్పించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి పాలకమండలి సభ్యులు పార్థసారధి (వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే) […]

Ram Naramaneni

|

Sep 18, 2019 | 5:09 PM

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎక్స్‌అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 28 మందికి అవకాశం కల్పించింది. ఈ 28 మందిలో 8 మంది ఏపీకిచెందిన వారు ఉన్నారు. తెలంగాణకు చెందిన ఏడుగురికి అవకాశం కల్పించారు. తమిళనాడు నుంచి నలుగురు, కర్ణాటక నుంచి ముగ్గురికి టీటీడీ పాలకమండలిలో స్ధానం కల్పించారు. ఢిల్లీ, మహారాష్ట్ర నుంచీ ఒక్కొక్కరికి సభ్యత్వం కల్పించారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి పాలకమండలి సభ్యులు పార్థసారధి (వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే) గొల్ల బాబూరావు (వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే) డీ మల్లికార్జునరెడ్డి (వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే) యూవీ రమణమూర్తి డీపీ అనంత నాదెండ్ల సుబ్బారావు చిప్పగిరి ప్రసాద్ కుమార్ వీ ప్రశాంతి

తెలంగాణ: జె.రామేశ్వరరావు బి పార్థసారధి రెడ్డి వెంకట భాస్కర్‌రావు మూరంశెట్టి రాముల డి. దామోదర్ రావు కే శివకుమార్ పుట్టా ప్రతాప్‌రెడ్డి

తమిళనాడు:

కృష్ణమూర్తి వైద్యనాథన్

ఎన్ శ్రీనివాసన్

డాక్టర్ నిశిత ముత్తవరపు

కుమారగురు(ఎమ్మెల్యే

కర్ణాటక:

రమేష్ శెట్టి

రవినారాయణ

సుధా నారాయణమూర్తి

ఢిల్లీ:

ఎమ్మెస్ శివశంకరన్

మహారాష్ట్ర:

రాజేష్ శర్మ

… అయితే తెలంగాణ నుంచి పాలకమండలిలో చోటు దక్కించుకున్న కె.శివకుమార్ గతంలో పార్టీ నుంచి బహిష్కరణకు గురయిన విషయం తెలిసిందే. 2018 డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో తెలంగాణ వైసీపీ నేతగా ఉన్న  కె.శివకుమార్ వివాదాలకు కేంద్రబిందువుగా మారారు. కేసీఆర్ గతంలో వైఎస్‌ను తిట్టారు కాబట్టి, వైసీపీ అభిమానులు కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని వైఎస్‌ఆర్‌సీపీ లెటర్ హెడ్‌తో ఓ లేఖను విడుదల చేశారు. అప్పట్లో అది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న అధిష్ఠానం శివకుమార్‌ను వైసీపీ నుంచి శాశ్వతంగా బహిష్కరించింది. అయితే, ఆ తర్వాత శివకుమార్ మెత్తబడ్డారు. తెలంగాణలో ఎన్నికలు ముగిసిన తర్వాత, ఏపీలో ఎన్నికలకు ముందు 2019 మార్చిలో శివకుమార్ వెళ్లి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి.. వైసీపీలోకి వెళ్లారు. తెలంగాణ జనరల్ సెక్రటరీగా నియమించారు. ఇప్పుడు టీటీడీ పాలకమండలి సభ్యుడిగా అవకాశం కల్పించారు. కాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరు తనదే అని..జగన్‌మోహన్ రెడ్డి అడిగితే అభిమానంతో ఇచ్చానని అతడు చెప్పిన విషయం తెలిసిందే.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu