AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నవరత్నాల అమలుపై జగన్‌ కసరత్తు

అమరావతి: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముందే ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై జగన్ దృష్టి సారించారు. నవరత్నాల అమలుపై ఆయన కసరత్తును వేగవంతం చేశారు. ఈ మేరకు ఆ పథకాల అమలుపై తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి శామ్యూల్‌లతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. నవరత్నాల్లోని ప్రతీ పథకంపై ఈ సమీక్షలో చర్చించారు. ఈ నెల 30న […]

నవరత్నాల అమలుపై జగన్‌ కసరత్తు
Ram Naramaneni
|

Updated on: May 29, 2019 | 7:59 AM

Share

అమరావతి: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముందే ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై జగన్ దృష్టి సారించారు. నవరత్నాల అమలుపై ఆయన కసరత్తును వేగవంతం చేశారు. ఈ మేరకు ఆ పథకాల అమలుపై తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి శామ్యూల్‌లతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. నవరత్నాల్లోని ప్రతీ పథకంపై ఈ సమీక్షలో చర్చించారు. నెల 30న రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. అదే వేదికగా నవరత్నాల అమలుపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.

బడ్జెట్‌ కేటాయింపులపై చర్చ నవరత్నాల్లో ఏ పథకానికి ఎంత నిధులు అవసరం, వచ్చే బడ్జెట్‌లో ఎంత కేటాయింపులు చేయాల్సి ఉంటుందనే అంశాలపై చర్చించారు. అలాగే నవరత్నాల్లో ఏ పథకాన్ని ఏ శాఖ ద్వారా అమలు చేయించాలనే విషయంపైన కూడా ఈ సమీక్షలో చర్చించారు. వీలైనంత త్వరగా కేబినెట్‌ కూర్పు చేసి నవరత్నాల అమలుపై కీలక నిర్ణయాలను తీసుకోవాలనే ఆలోచనలో జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రజలకు ఇచ్చిన మాట మేరకు సాధ్యమైనంత త్వరగా నవరత్నాలను ప్రజలకు అందించాలనే తపన జగన్‌మోహన్‌రెడ్డిలో కనిపిస్తోందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ఆర్థిక క్రమశిక్షణ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నా అంశాలపై కూడా అధికారులతో చర్చించినట్టు సమాచారం

నవరత్నాల్లో ప్రతీ పథకాన్ని అర్హులైన ప్రతీ ఒక్కరికి అందేలా ఏర్పాట్లు చేసే విషయమై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. ప్రమాణ స్వీకారానికి ముందే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రి మోడీని కలిసి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలుపై జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు నవరత్నాల విషయంలో కూడా ఆయన అంతే స్పీడుతో ముందుకు సాగుతున్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.