ఏదో ఒక ధర్మాన్ని ఆచరించడం తప్పా?.. వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి

తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కులానికి సంబంధించి టీడీపీ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వినాయక చవితి సందర్భంగా విగ్రహానికి పూజలు చేసేందుకు వచ్చిన ఆమెను కొంతమంది కులంపేరుతో దూషించడం వివాదంగా మారింది. ఇప్పటికే ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇది రాజకీయ రంగు పులుమకుంది. ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఈ వివాదంలో ట్వీట్స్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి కులాన్ని అనుమానిస్తూ […]

ఏదో ఒక ధర్మాన్ని ఆచరించడం తప్పా?.. వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 06, 2019 | 7:55 PM

తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కులానికి సంబంధించి టీడీపీ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వినాయక చవితి సందర్భంగా విగ్రహానికి పూజలు చేసేందుకు వచ్చిన ఆమెను కొంతమంది కులంపేరుతో దూషించడం వివాదంగా మారింది. ఇప్పటికే ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇది రాజకీయ రంగు పులుమకుంది. ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఈ వివాదంలో ట్వీట్స్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి కులాన్ని అనుమానిస్తూ బాబు ట్వీట్ చేశారు. దీంతో ఆమె తన కులం గురించి ప్రస్తావిస్తూ.. చంద్రబాబు తన ఆరోపణలపై నిలబడగలరా అంటూ సవాల్ విసిరారు.

క్రైస్తవురాలని దళిత మహిళగా చెప్పుకుంటూ వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారంటూ బాబు ట్వీట్ చేశారు. తమ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ ఆరోపించారు. ఒక రిజర్వ్‌డ్ స్ధానాన్ని క్రైస్తవురాలికి కట్టబెట్టారంటూ చంద్రబాబు ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే శ్రీదేవి మండిపడ్డారు. కులం ఏదైనా సరే ఏదో ఒక ధర్మాన్ని అనుసరించడం తప్పవుతుందా? అంటూ చంద్రబాబును నిలదీశారు. చంద్రబాబు హయాంలో జరిగిన దోపిడీలు, అవినీతి కుంభకోణాలను బయటపెడుతున్నందుకే తనపై ఇలా విరుచుకుపడుతున్నారని, తనపై వ్యక్తిగత దాడికి పాల్పడుతున్నారంటూ శ్రీదేవి ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్‌ను చూసి చంద్రబాబు సిగ్గుపడాలని, దేశంలోనే మొట్టమొదటిసారి ఒక దళిత మహిళను హోం మంత్రిగా చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కిందన్నారు ఎమ్మెల్యే శ్రీదేవి.

ఇది ఉత్తరాంధ్ర కర్రల సమరం.! కర్రలతో కొట్టుకున్నా గాయాలు కావట.
ఇది ఉత్తరాంధ్ర కర్రల సమరం.! కర్రలతో కొట్టుకున్నా గాయాలు కావట.
రాజకీయాలు, జీవితంలో గెలుపోటమిలు సర్వసాధారణం : కేటీఆర్
రాజకీయాలు, జీవితంలో గెలుపోటమిలు సర్వసాధారణం : కేటీఆర్
రూ.3 కోట్లు ఇస్తారా కేసు పెట్టమంటారా? మైక్ టైసన్‌ కొత్త తలనొప్పి.
రూ.3 కోట్లు ఇస్తారా కేసు పెట్టమంటారా? మైక్ టైసన్‌ కొత్త తలనొప్పి.
అమెరికాను వణికిస్తున్న వైట్‌ లంగ్‌ సిండ్రోమ్‌.!
అమెరికాను వణికిస్తున్న వైట్‌ లంగ్‌ సిండ్రోమ్‌.!
నాన్నా ప్రేమగా మాట్లాడడు., అమ్మ నాతో ఆడుకోదు.. 4 ఏళ్ల చిన్నారి..
నాన్నా ప్రేమగా మాట్లాడడు., అమ్మ నాతో ఆడుకోదు.. 4 ఏళ్ల చిన్నారి..
ఫీజు ఇవ్వాల్సి వస్తుందని సొంతం వైద్యం చేస్తే ఇలానే ఉంటది..
ఫీజు ఇవ్వాల్సి వస్తుందని సొంతం వైద్యం చేస్తే ఇలానే ఉంటది..
ఒక్క ఉత్తరమే సొరంగంలో వాళ్ల ప్రాణాలు కాపాడిందా.?
ఒక్క ఉత్తరమే సొరంగంలో వాళ్ల ప్రాణాలు కాపాడిందా.?
ప్రగతిభవన్‌ను ప్రజాభవన్‌గా మారుస్తాం.. రేవంత్ రెడ్డి
ప్రగతిభవన్‌ను ప్రజాభవన్‌గా మారుస్తాం.. రేవంత్ రెడ్డి
ఒకేరోజు, ఒకే ఎయిర్‌పోర్టులో రెండు విమాన ప్రమాదాలు !!
ఒకేరోజు, ఒకే ఎయిర్‌పోర్టులో రెండు విమాన ప్రమాదాలు !!
భారీ ఆధిక్యంలో కాంగ్రెస్.. ర్యాలీ‌తో గాంధీభవన్‌కు రేవంత్
భారీ ఆధిక్యంలో కాంగ్రెస్.. ర్యాలీ‌తో గాంధీభవన్‌కు రేవంత్