శ్రీనివాస్‌ని ఎందుకు చంపాలనుకున్నారు..?

వైయస్‌ జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిణ హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు శ్రీనివాస్‌ కేసు మరోసారి చర్చణీయాంశమైంది. విశాఖలో గతంలో పాదయాత్ర చేస్తున్న సమయంలో జగన్‌పై ఆయన కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్‌ను రిమాండ్‌లో భాగంగా గతంలో విజయవాడ జైళ్లో ఉంచారు. అయితే.. నిందితుడి తరపు న్యాయవాది.. శ్రీనివాస్‌కు బెజవాడ జైళ్లో రక్షణ లేదని ఎన్‌ఐఏ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా… విచారణ చేపట్టిన కోర్టు ఆయన్ని రాజమండ్రి […]

శ్రీనివాస్‌ని ఎందుకు చంపాలనుకున్నారు..?
Follow us

| Edited By:

Updated on: Sep 06, 2019 | 7:11 PM

వైయస్‌ జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిణ హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు శ్రీనివాస్‌ కేసు మరోసారి చర్చణీయాంశమైంది. విశాఖలో గతంలో పాదయాత్ర చేస్తున్న సమయంలో జగన్‌పై ఆయన కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే.

కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్‌ను రిమాండ్‌లో భాగంగా గతంలో విజయవాడ జైళ్లో ఉంచారు. అయితే.. నిందితుడి తరపు న్యాయవాది.. శ్రీనివాస్‌కు బెజవాడ జైళ్లో రక్షణ లేదని ఎన్‌ఐఏ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా… విచారణ చేపట్టిన కోర్టు ఆయన్ని రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌కు తరలించారు. అయితే రెండు రోజుల కింద నిందిడుతు శ్రీనివాస్‌పై హత్యా యత్నం జరిగినట్టు ఆయన తరపు లాయర్‌ సలీం ఆరోపించారు.

రెండు రోజుల కింద శ్రీనివాస్‌ను రాజమండ్రి సెంట్రల్‌ జైలు జైలర్‌, వార్డెన్‌ దాడి చేసి గాయపరిచారని.. ఆత్మహత్య చేసుకుని చస్తావా.. లేదా చంపమంటావా అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని.. జైలర్‌, వార్డెన్‌పై కేసు నమోదు చేయాలని కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయనున్నట్టు చెప్పారు. రాజమండ్రి సెంట్రల్‌ జైళ్లో ఆయన ప్రాణాలకు హాని ఉంది.. తక్షణమే శ్రీనివాస్‌ను విశాఖ జైలుకు తరలించాలంటున్న లాయర్‌ సలీం కోర్టుకు విజ్ఞప్తి చేసుకున్నారు.

కాగా.. నిందితుడి శ్రీనివాస్‌ని వారు ఎందుకు చంపాలనుకుంటున్నారు..? దీని వెనుక అసలు కారణాలేంటో.. ఇంకా బయటకు రాలేదు. ఫేమ్ అవ్వాలని ఆశతో.. జగన్‌పై సిల్లీగా దాడి చేశాడు శ్రీనివాస్. అది పైకి చెబుతున్న రీజన్‌ అయినా.. అసలు నిజాలు బయటకు రాలేదని.. అర్థమవుతున్నాయి.