పాతబస్తీలో ఖాజీల ఆగడాలు: గల్ఫ్ దేశాలకు యువతుల అక్రమ తరలింపులు, వెలుగులోకి మరో కాంట్రాక్ట్‌ మ్యారేజ్‌

హైదరాబాద్ పాతబస్తీలో ముస్లిం యువతుల అక్రమ తరలింపుల ఉదంతాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా మరో ఉదంతం వెలుగులోకి..

  • Venkata Narayana
  • Publish Date - 10:46 am, Fri, 8 January 21
పాతబస్తీలో ఖాజీల ఆగడాలు: గల్ఫ్ దేశాలకు యువతుల అక్రమ తరలింపులు, వెలుగులోకి మరో కాంట్రాక్ట్‌ మ్యారేజ్‌

హైదరాబాద్ పాతబస్తీలో ముస్లిం యువతుల అక్రమ తరలింపుల ఉదంతాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. మూడు నెలల కాంట్రాక్ట్‌ మ్యారేజ్‌ కోసం రెండు లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్న పాతబస్తీ బ్రోకర్లు నూర్జహాన్‌ అనే యువతికి పెళ్లితంతు కానిచ్చేశారు. వాట్సాప్‌ కాల్‌ ద్వారా పాతబస్తీలో నిఖా నిర్వహించి, ముంబై ఖాజీల నుంచి నిఖా సర్టిఫికెట్‌ జారీ చేయించారు పాతబస్తీ ఖాజీలు. అయితే, ఖతర్‌లో షేక్‌ పెట్టే శారీరక వేధింపులకు తాళలేక నూర్జహాన్ కుటుంబ సభ్యులతో మొరపెట్టుకుంది. దీంతో బాధిత మహిళ కుటుంబసభ్యులు కేంద్ర ప్రభుత్వానికి, హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిఖా కాంట్రాక్టు కుదిర్చిన బ్రోకర్ ఫాతిమా పెళ్లి తర్వాత డబ్బులు తీసుకుని పత్తాలేకుండా పోయింది. చాంద్రాయణగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు సాగిస్తున్నారు.