Urban Eco Farms: నగరాల్లో అద్దెకు 600 గజాల స్థలం.. ఆర్గానిక్ సేద్యంతో 12 రకాల కూరగాయలను పండిస్తున్న వైనం
Organic Farming: కరోనా సృష్టించిన కల్లోలంతో ఎంతో మంది ఆప్తులను, సన్నిహితులను కోల్పోయారు. చాలామంది ఉపాధిని కోల్పోయారు. అయితే ఈ కరోనా చాలామందికి చాలా నేర్పించింది. కొందరికి జీవించడానికి ఏమి కావాలో నేర్పిస్తే..
Organic Farming-Urban Eco Farms: కరోనా సృష్టించిన కల్లోలంతో ఎంతో మంది ఆప్తులను, సన్నిహితులను కోల్పోయారు. చాలామంది ఉపాధిని కోల్పోయారు. అయితే ఈ కరోనా చాలామందికి చాలా నేర్పించింది. కొందరికి జీవించడానికి ఏమి కావాలో నేర్పిస్తే.. మరికొందరికి జీవితంలో డబ్బులు సంపాదించడం నేర్పించింది. ముఖ్యంగా సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్ధికంగా ఎదగడానికి ప్రత్యాన్మాయ మార్గాలను చూపించింది అని చెప్పవచ్చు. కొంతమంది మహిళలు తమ కుటుంబం గడవడానికి తమకు అందుబాటులో ఉన్న సేంద్రీయ పద్ధతిలో కూరగాయలను పండించారు. లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఆకుకూరలు, కూరగాయలు పెంచుతూ.. ఆదాయాన్ని సృష్ఘించుకున్నారు.
లాక్ అందుకు ఉదాహరణగా నిలుస్తున్నారు కొందరు మహిళలు..సుధారాణి ఫ్యామిలీ కూడా లాక్ డౌన్ కష్ఠాలను ఎదుర్కొన్నారు. ఆరుగురు ఉండే కుటుంబం ఆర్ధిక ఇబ్బందులు పడ్డారు. దీంతో ఆర్గానిక్ ఫార్మింగ్ పై దృష్టి పెట్టారు. కానీ కరోనా కారణంగా ఉన్న భౌతిక దూరం ఆంక్షలు అమలులో ఉన్నాయి. నిరుత్సాహపడకుండా కొత్త తరహా వ్యవసాయానికి శ్రీకారం చుట్టి.. అందరిని ఆకర్షించారు. ఇప్పుడు పదిమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
నగరంలోని 600 గజాల భూమిని నెలకు 2400 రూపాయలు కి అద్దెకు తీసుకున్నారు. అందులో 12 రకాల కూరగాయలు పండిస్తున్నారు. తనకు వ్యవసాయం అంటే చాలా ఇష్టమని.. ఇది ఎప్పటికీ వన్నె తరగని విద్య… ఇంట్లో ఉండే నేర్చుకోవచ్చు అని సుధారాణి చెబుతున్నారు. అంతేకాదు తనకు ప్రస్తుతం మార్కెల ఆర్గానిక్ ఫుడ్ అంటూ ఇస్తున్న వాటిపై నమ్మకం లేదని.. తానే స్వయంగా వాటిని సహజమైన ఎరువులను ఉపయోగిస్తూ పండిస్తున్నానని చెప్పారు.
అలా పండించిన కూరగాయలు ఇంటికి సరిపడా తీసుకుని మిగిలిన కూరగాయలను తెలిసినవారికి ఇస్తామని తెలిపింది. అంతేకాదు త్వరలో పూర్తి స్థాయిలో ఆర్గానిక్ వ్యవసాయంపై దృష్టి పెడతానని తెలిపింది సుధారాణి.ఇక సుధారాణి బాటలోనే మరో మహిళ తులసి నడించింది. అర్బన్ ఫార్మ్స్ సహకారంతో చిన్న స్థలం అద్దెకు తీసుకుని కూరగాయలను పండించడం మొదలు పెట్టింది.
జూలై అక్టోబర్ 2020 మధ్య, ఉష ఒక నమూనాను రూపొందించారు. పొలం అద్దెకు తీసుకునే మోడల్ ప్రవేశపెట్టారు. ఎవరైనా వినియోగదారుడు ఇలాగే స్థలం అద్దెకు తీసుకుని కూరగాయలు పండించుకోవాలంటే మూడు నెలల పాటు భూమిని అద్దెకు తీసుకోవాలి. ఒక 3-5 కుటుంబ సభ్యులు ఉంటే వారు ఆరు వందల గజాలు అద్దెకు తీసుకోవచ్చు. అప్పుడు ఉన్న 25 పంటల్లో ఒక 12 ఎంచుకొని నెలకు కేవలం 2,500 రూపాయలు కడితే కస్టమర్లకు పొలంలో విత్తనాలు, పనిచేసేందుకు రైతుల సహాయం, ఎన్నో మంచి సలహాలు, అలాగే ప్రతి వారాంతంలో ఇంటికి ఆరు నుంచి ఎనిమిది కిలోల కూరగాయలు ఉచితంగా ఇవ్వబడతాయి. అద్దెకు తీసుకున్న స్థలంలో వంకాయ, టమోటాలు, ఓక్రా, బీన్స్, దోసకాయ, ఐవీ పొట్లకాయ, రిడ్జ్ గోరింటా, బాటిల్ గోరింటాకు, చేదు గుమ్మడికాయ, డ్రమ్ స్టిక్, క్యారెట్, క్యాబేజీ, కాలీఫ్లవర్, మిరపకాయలు, కొత్తిమీర మరియు కరివేపాకు వంటివి పండించుకోవడానికి సహాయం చేస్తారు.
Also Read: Childhood Photo: సహజనటి పక్కన ఉన్న ఈ బాలుడు.. నేడు యువతకు కలల రాకుమారుడు ఎవరో గుర్తు పట్టారా..