మరిదితో అక్రమసంబంధం.. భర్తను చంపిన భార్య

ప్రియుడి మోజులో పడి కట్టకున్న భర్తను కాటికి పంపింది ఓ కసాయి. వరుసకు మరిది అయిన వ్యక్తితో ఆరేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగించిన మహిళ భర్త అడ్డు తొలగించుకుంది. వికారాబాద్‌ పట్టణ శివారులోని అనంతగిరి అటవీ ప్రాంతంలో మంగళవారం వెలుగుచూసింది.

మరిదితో అక్రమసంబంధం.. భర్తను చంపిన భార్య
Follow us

|

Updated on: Jul 15, 2020 | 7:36 PM

ప్రియుడి మోజులో పడి కట్టకున్న భర్తను కాటికి పంపింది ఓ కసాయి. వరుసకు మరిది అయిన వ్యక్తితో ఆరేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగించిన మహిళ భర్త అడ్డు తొలగించుకుంది. వికారాబాద్‌ పట్టణ శివారులోని అనంతగిరి అటవీ ప్రాంతంలో మంగళవారం వెలుగుచూసింది.

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరు గ్రామానికి చెందిన బైండ్ల చెన్నయ్య(38), శశికళ దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. వీరికి ప్రవీణ్‌, పావనిలు ఇద్దరు సంతానం. వరుసకు మరిది అయిన రమేష్‌తో ఆరేళ్లుగా శశికళ వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. మద్యానికి బానిసైన భర్త చెన్నయ్య తరచూ భార్యతో గొడవపడేవాడు. భార్య శశికళ అసలు భాగోతం బయటపడడంతో ఇద్దరి మధ్య గొడవలు మరింత తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో విసుగు చెందిన శశికళ భర్త అడ్డు తొలగించుకోవాలని ప్రియునితో కలిసి హత్యకు పథకం వేసింది. ఈ నెల 6వ తేదీన ముగ్గురు కలిసి బస్సులో పరిగికి చేరుకున్నారు. అక్కడే మద్యం కొనుగోలు చేశారు. అనంతగిరి అటవీ ప్రాంతానికి వచ్చి ముగ్గురు కలిసి మద్యం సేవించారు. అనంతరం మద్యం మత్తులో ఉన్న చెన్నయ్యపై భార్య శశికళ, రమేష్ రాళ్లతో దాడి చేసి హత్య చేశారు. మృతదేహంపై చెత్త, చెట్ల ఆకులు కప్పి పారిపోయారు. ఏం ఎరుగనట్లు తిరిగి ఇంటికి చేరుకుంది శశికళ.

ఇదిలావుంటే, ఈ నెల 11న చెన్నయ్య తల్లి బాలమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె అంత్యక్రియలకు గ్రామస్తులు, బంధువులు ఏర్పాట్లు చేశారు. అయితే, కుమారుడు చెన్నయ్య హాజరు కాకపోవడం, భార్య ఏమీ ఎరగనట్టు వ్యవహరించడంతో గ్రామస్థులకు అనుమానం వచ్చి ఈనెల 13వ తేదీన నిలదీశారు. ఈ విషయమై 14న పంచాయతీ పెట్టాలని నిర్ణయించారు. పంచాయతీ పెడితే అసలు విషయం బయటపడుతుందన్న భయంతో భార్య శశికళ 13వ తేదీ రాత్రి ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు యత్నించింది. దీంతో కాలిన గాయాలతో ఉన్న ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

అయితే, ఈ పరిణామంతో శశికళతో చనువుగా ఉన్న రమేష్‌ను గ్రామస్తులు అనుమానించారు. రమేష్‌ను గ్రామస్తులు నిలదీయడంతో హత్యోదంతం బయటపడింది. అనంతగిరి అటవీ ప్రాంతంలో హత్య చేశామని మృతదేహాన్ని అక్కడే వదిలేశామని వివరించాడు. దీంతో గ్రామస్థులు వికారాబాద్ పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసిన పోలీసులు రమేష్ ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.

Latest Articles