AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కనుమ రోజున ప్రయాణం చేస్తే ఏమవుతుందో తెలుసా.?

తెలుగు లోగిళ్ళలో జరుపుకునే పెద్ద పండగ సంక్రాంతి. ఈ పండక్కి పచ్చని తోరణాలు, కొత్త అల్లుళ్ళు, బంధుమిత్రులతో ఇళ్లన్నీ కళకళలాడుతుంటాయి. భోగి.. భోగభాగ్యాలను అందిస్తే.. సంక్రాంతి.. సకల ఆనందాలను తెచ్చిపెడుతుంది. ఇక కనుమను అందరూ కూడా పశువుల పండగ అని పిలుస్తుంటారు. తమ పశువులను ఉదయాన్నే లేచి శుభ్రపరిచి వాటికి ఆహారాన్ని పెడతారు. ఒక్క పశువులకే కాకుండా పక్షులకు కూడా ఇలాగే పెడితే ఎంతో పుణ్యం వస్తుందని అంటారు. ఇదిలా ఉండగా కనుమ రోజున ఇంటి దగ్గర నుంచి […]

కనుమ రోజున ప్రయాణం చేస్తే ఏమవుతుందో తెలుసా.?
Ravi Kiran
| Edited By: |

Updated on: Jan 16, 2020 | 10:06 PM

Share

తెలుగు లోగిళ్ళలో జరుపుకునే పెద్ద పండగ సంక్రాంతి. ఈ పండక్కి పచ్చని తోరణాలు, కొత్త అల్లుళ్ళు, బంధుమిత్రులతో ఇళ్లన్నీ కళకళలాడుతుంటాయి. భోగి.. భోగభాగ్యాలను అందిస్తే.. సంక్రాంతి.. సకల ఆనందాలను తెచ్చిపెడుతుంది. ఇక కనుమను అందరూ కూడా పశువుల పండగ అని పిలుస్తుంటారు. తమ పశువులను ఉదయాన్నే లేచి శుభ్రపరిచి వాటికి ఆహారాన్ని పెడతారు. ఒక్క పశువులకే కాకుండా పక్షులకు కూడా ఇలాగే పెడితే ఎంతో పుణ్యం వస్తుందని అంటారు. ఇదిలా ఉండగా కనుమ రోజున ఇంటి దగ్గర నుంచి తిరుగు ప్రయాణం చేయకూడదని మన పెద్దవాళ్ల మాట. అసలు ఎందుకిలా అంటారో ఇప్పుడు చూద్దాం.

పూర్వకాలంలో చాలామంది ప్రయాణాలకు ఎడ్ల బండినే వాడతారు. కనుమ రోజున వాటికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు కాబట్టి ఈ ఒక్కరోజైనా ఎద్దులను కష్టపెట్టకూడదనే భావనతో ప్రయాణాలను విరమించుకుంటారని చెప్పుకొస్తారు. మరోవైపు సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది. ఇక ఇది దేవతలకు ఎంతో ప్రీతిపాత్రమైన సమయమని మన పూర్వీకులు అంటుంటారు.

ఇదే రోజున అందరూ తమ ఇళ్లల్లో మాంసాహారాన్ని వండుకుని సంబరాలు చేసుకుంటారు. అంతేకాకుండా వారి పెద్దవాళ్ళను స్మరించుకుని ప్రసాదాలు పెట్టడం ఆనవాయితీ. అందుచేత ఈ రోజు ప్రయాణాలు చేస్తే అరిష్టాలు సంభవిస్తాయని అంటారు. మరికొంతమంది అయితే ఈ రోజు అంతా ఇంట్లోనే ఉండాలని అప్పుడే మంచి జరుగుతుందని చెబుతుంటారు. కాగా, ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. ఇప్పుడు కొందరు దీన్ని పాటిస్తుంటే.. మరికొందరు లైట్ తీసుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ మూడు రోజులూ మాత్రం పిల్లలు, పెద్దలు అందరూ కలిసి సంతోషంగా పండగను జరుపుకుంటారు.