AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాశ్మీర్.. కాశ్మీర్.. ఐరాసలో మళ్ళీ పాక్-చైనాలకు షాక్ !

ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో జమ్మూ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తబోయి పాకిస్తాన్-చైనా మళ్ళీ బొక్క బోర్లాపడ్డాయి. తన తొత్తు చైనా అండతో పాకిస్తాన్ సదా ఐరాసలో ఈ అంశాన్ని ప్రస్తావించి భారత్ ను చిక్కుల్లో పడవేయడానికి ప్రయత్నిస్తూనే ఉంది. కానీ.. ఎన్నోసార్లు ఆ దేశానికి చుక్కెదురైంది. ఇప్పుడు కూడా తాజాగా-బుధవారం అదే పరిస్థితి ఏర్పడింది. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ కన్సల్టేషన్ రూమ్ లో పాక్-చైనా దేశాలు ఈ సమస్యను ప్రస్తావించబోగా మెజారిటీ సభ్యదేశాలు దీనిపై చర్చించడానికి ఇది తగిన చోటు […]

కాశ్మీర్.. కాశ్మీర్.. ఐరాసలో మళ్ళీ పాక్-చైనాలకు షాక్ !
Umakanth Rao
| Edited By: |

Updated on: Jan 16, 2020 | 12:35 PM

Share

ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో జమ్మూ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తబోయి పాకిస్తాన్-చైనా మళ్ళీ బొక్క బోర్లాపడ్డాయి. తన తొత్తు చైనా అండతో పాకిస్తాన్ సదా ఐరాసలో ఈ అంశాన్ని ప్రస్తావించి భారత్ ను చిక్కుల్లో పడవేయడానికి ప్రయత్నిస్తూనే ఉంది. కానీ.. ఎన్నోసార్లు ఆ దేశానికి చుక్కెదురైంది. ఇప్పుడు కూడా తాజాగా-బుధవారం అదే పరిస్థితి ఏర్పడింది. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ కన్సల్టేషన్ రూమ్ లో పాక్-చైనా దేశాలు ఈ సమస్యను ప్రస్తావించబోగా మెజారిటీ సభ్యదేశాలు దీనిపై చర్చించడానికి ఇది తగిన చోటు కాదని తోసిపుచ్చాయి. ఈ రూంలో జరిగిన క్లోజ్డ్ కన్సల్టేషన్స్ సందర్భంగా  పాక్ సూచనపై చైనా కాస్త ముందుకు వచ్చినా….   సభ్యదేశాలు ఇందుకు అవకాశం ఇవ్వలేదు. ఈ రెండు దేశాలను తప్పు బట్టిన ఇండియా.. అసలు మీ దేశంతో సంబంధాలు మెరుగుపడాలంటే మొదట మీరు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న మాట ఏమిటని ప్రశ్నించింది. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ఈ మేరకు ట్వీట్ చేశారు. పాక్ గానీ చైనా గానీ చేసే నిరాధారమైన ఆరోపణలను ఐరాసలో ఎవరూ పట్టించుకోలేదని ఆయన అన్నారు.

కాశ్మీర్ అంశాన్ని భారత-పాకిస్తాన్ దేశాలు ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలని, అది వారి ఆంతరంగిక సమస్య అని యూరప్, ఫ్రెంచ్ దేశాల ప్రతినిధులు స్పష్టం చేశారు. అటు-పాక్ ‘ వెన్నుదన్ను’ తో చైనా ఈ అంశాన్ని లేవనెత్తడం ఇది మూడోసారి. గత నెలలో ఆ దేశ యత్నాన్ని, ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్, రష్యా వమ్ము చేశాయి. ఇప్పుడు తాజాగా.. పాక్,  చైనా దేశాలకు మళ్ళీ షాక్ తగిలింది.

Follow Us
ఆన్‌లైన్‌లో చికెన్ కొంటున్నారా..? మంచి మాంసాన్ని ఇలా ఈజీగా..
ఆన్‌లైన్‌లో చికెన్ కొంటున్నారా..? మంచి మాంసాన్ని ఇలా ఈజీగా..
మిండియాకు పట్టిన దరిద్రం అదే.. అశ్విన్ షాకింగ్ కామెంట్స్..!
మిండియాకు పట్టిన దరిద్రం అదే.. అశ్విన్ షాకింగ్ కామెంట్స్..!
నేరుగా వెళ్లి బ్యాగ్ పక్కన నిల్చుకున్న డాగ్.. ఓపెన్ చేసి చూడగా
నేరుగా వెళ్లి బ్యాగ్ పక్కన నిల్చుకున్న డాగ్.. ఓపెన్ చేసి చూడగా
కేవలం రూ.50 వేల పెట్టుబడి.. నెలకు రూ.7.50 లక్షల లాభం..
కేవలం రూ.50 వేల పెట్టుబడి.. నెలకు రూ.7.50 లక్షల లాభం..
వరంగల్ జిల్లాను టార్గెట్ చేసి వణికిస్తున్న ఆకతాయిలు..!
వరంగల్ జిల్లాను టార్గెట్ చేసి వణికిస్తున్న ఆకతాయిలు..!
పక్కకెళ్లి సిగరెట్ తాగుతుంటే పొగ చూసి ఎన్టీఆర్ ఏమన్నారంటే..?
పక్కకెళ్లి సిగరెట్ తాగుతుంటే పొగ చూసి ఎన్టీఆర్ ఏమన్నారంటే..?
ఎన్డీఏతో పొత్తుపై విజయ్ స్టాండ్ ఇదే..
ఎన్డీఏతో పొత్తుపై విజయ్ స్టాండ్ ఇదే..
ఓ వైపు తల్లి హత్య.. మరోవైపు జైల్లో నాన్న.. కన్నీళ్ల మధ్యే ..
ఓ వైపు తల్లి హత్య.. మరోవైపు జైల్లో నాన్న.. కన్నీళ్ల మధ్యే ..
బీసీసీఐ బ్లండర్ మిస్టేక్.. కట్ చేస్తే.. రిషబ్ పంత్ కెరీర్‌ క్లోజ్
బీసీసీఐ బ్లండర్ మిస్టేక్.. కట్ చేస్తే.. రిషబ్ పంత్ కెరీర్‌ క్లోజ్
ఇంట్లోనే వంట గ్యాస్‌ తయారీ..బయో గ్యాస్‌ తయారీ గురించి మీకు తెలుసా
ఇంట్లోనే వంట గ్యాస్‌ తయారీ..బయో గ్యాస్‌ తయారీ గురించి మీకు తెలుసా