“డిస్నీ, సోనీ”ల మధ్య క్లాష్.. “స్పైడర్” అభిమానులకు చేదువార్త

డిస్నీ, సోనీల మధ్య క్లాష్.. స్పైడర్ అభిమానులకు చేదువార్త

స్పైడర్ మేన్ సిరీస్ అంటే తెలియని వారుండరు. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ డాలర్ వసూళ్లతో ఈ సిరీస్ లో ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్లు తెరకెక్కాయి. మార్వల్ సినిమాటిక్స్ లోని డిస్నీ సంస్థతో సోని పిక్చర్స్ భాగస్వామ్యంలో ఇటీవల వరుసగా 6 సినిమాలు వచ్చాయి. ఇవన్నీ బిలియన్ డాలర్ వసూళ్లతో సంచలనం రేపాయి. స్పైడర్ మేన్ ఫ్రాంఛైజీలో ఇప్పటివరకూ వచ్చిన సినిమాలన్నీ సుమారు 20 బిలియన్ డాలర్ వసూళ్లను సాధించాయి. ఇందులో డిస్నీ-సోని కాంబినేషన్ సినిమాలు 8 బిలియన్ […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 22, 2019 | 9:49 PM

స్పైడర్ మేన్ సిరీస్ అంటే తెలియని వారుండరు. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ డాలర్ వసూళ్లతో ఈ సిరీస్ లో ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్లు తెరకెక్కాయి. మార్వల్ సినిమాటిక్స్ లోని డిస్నీ సంస్థతో సోని పిక్చర్స్ భాగస్వామ్యంలో ఇటీవల వరుసగా 6 సినిమాలు వచ్చాయి. ఇవన్నీ బిలియన్ డాలర్ వసూళ్లతో సంచలనం రేపాయి. స్పైడర్ మేన్ ఫ్రాంఛైజీలో ఇప్పటివరకూ వచ్చిన సినిమాలన్నీ సుమారు 20 బిలియన్ డాలర్ వసూళ్లను సాధించాయి. ఇందులో డిస్నీ-సోని కాంబినేషన్ సినిమాలు 8 బిలియన్ డాలర్లను తెచ్చిపెట్టాయి. అయితే ఇంతటి సంచలనాలకు కారణమైన వీరి భాగస్వామ్యం విడిపోనున్నట్లు తెలుస్తోంది. ఆ రెండు సంస్థల మధ్యా విభేధాలు వచ్చాయి. అందుకే ఇకపై స్పైడర్ మేన్ సినిమాల్ని కలిసి నిర్మించడం కుదరదని తెలుస్తోంది. మునుముందు ఈ సిరీస్ లో తెరకెక్కించే సినిమాల విషయంలో డిస్నీ తమ భాగస్వామ్య విలువను పెంచాల్సిందిగా సోనీని కోరింది. అయితే సోని సంస్థ అందుకు నిరాకరించడంతో ఆ ఇద్దరి మధ్యా భాగస్వామ్యంలో కుదుపు తప్పలేదని తెలుస్తోంది. దీని వల్ల సోని కంటే డిస్నీ సంస్థకే ఎక్కువ నష్టం అన్న విశ్లేషణ సాగుతోంది. స్పైడర్ మేన్ క్యారెక్టర్-కామిక్ బుక్స్ రైట్స్ సోనికి మాత్రమే సొంతం. ఈ ఫ్రాంఛైజీలో సినిమాలు తీసే హక్కు తనకు మాత్రమే ఉంది. అయితే డిస్నీ తన వాటాను పెంచుకోవడం ద్వారా ఎక్కువ లాభాల్ని ఆశిస్తోంది. అందుకే ఈ భాగస్వామ్యం విడిపోయిందని తెలుస్తోంది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu