AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol Pump Tips: పెట్రోల్ బంక్ సీక్రెట్ కోడ్.. 110, 210 రూపాయలకే ఎందుకు పెట్రోల్ పోయిస్తారో తెలుసా? అసలు కారణాలు ఇవే!

Petrol Pump Tips: గతంలో కొన్ని పెట్రోల్ బంకుల్లో చిప్స్ వాడి మోసాలకు పాల్పడిన ఘటనలు వార్తల్లో నిలిచాయి. నేడు డిజిటల్ మెషీన్లు వచ్చినప్పటికీ, పాత భయాల వల్ల చాలామంది ఇప్పటికీ ఈ 'అనీవెన్ అమౌంట్' పద్ధతినే అనుసరిస్తున్నారు. అలాగే పెట్రోల్..

Petrol Pump Tips: పెట్రోల్ బంక్ సీక్రెట్ కోడ్.. 110, 210 రూపాయలకే ఎందుకు పెట్రోల్ పోయిస్తారో తెలుసా? అసలు కారణాలు ఇవే!
Petrol Pump Tips
Subhash Goud
|

Updated on: Apr 21, 2026 | 1:19 PM

Share

Petrol Pump Tips: సాధారణంగా మనం పెట్రోల్ బంకుకు వెళ్ళినప్పుడు రౌండ్ ఫిగర్ (100, 500 వంటివి) చెప్పడం అలవాటు. కానీ కొంతమంది మాత్రం కావాలనే చిల్లర కలిపి మరీ చెబుతుంటారు. ఇది కేవలం అలవాటు మాత్రమే కాదు, దీని వెనుక కొన్ని ఆసక్తికరమైన కారణాలు, వినియోగదారుల అవగాహన దాగి ఉన్నాయి.

1. మెషీన్ల ‘ప్రీసెట్’ భయం (Preset Logic):

చాలామంది మనసులో ఒక బలమైన నమ్మకం ఉంది. పెట్రోల్ బంకుల్లోని మెషీన్లలో 100, 200, 500 వంటి అంకెలకు ముందుగానే సాఫ్ట్‌వేర్ సెట్టింగ్స్ (Preset) చేసి ఉంటారని, అలా రౌండ్ ఫిగర్ చెప్పినప్పుడు పెట్రోల్ తక్కువ పడే అవకాశం ఉందని వారు భావిస్తారు. అందుకే ఆ అంకెలకు బదులుగా 110 లేదా 210 వంటి ‘ఆడ్ నంబర్స్’ చెబితే మెషీన్ సెట్టింగ్‌ను బైపాస్ చేయవచ్చని నమ్ముతారు.

2. మానసిక సంతృప్తి కోసం:

ఇలా అదనంగా 10 రూపాయలు కలిపి పోయించడం వల్ల మనకు సరైన పరిమాణంలో పెట్రోల్ పడిందని ఒక రకమైన మానసిక తృప్తి కలుగుతుంది. తాము ఎక్కడా మోసపోలేదనే ధైర్యం కస్టమర్లలో పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

3. పంప్ సిబ్బందిని అప్రమత్తం చేయడం:

కస్టమర్ 110 లేదా 510 రూపాయలని అడిగినప్పుడు, పెట్రోల్ పోసే సిబ్బందికి ఒక సంకేతం అందుతుంది. ఈ కస్టమర్ చాలా అవగాహన ఉన్న వ్యక్తి అని, ఏదైనా మోసం చేస్తే కనిపెట్టేస్తారని వారు అప్రమత్తం అవుతారు. తద్వారా సిబ్బంది ఏవైనా ‘చేతివాటం’ ప్రదర్శించకుండా జాగ్రత్త పడతారు.

4. పాత కాలపు అనుభవాలు:

గతంలో కొన్ని పెట్రోల్ బంకుల్లో చిప్స్ వాడి మోసాలకు పాల్పడిన ఘటనలు వార్తల్లో నిలిచాయి. నేడు డిజిటల్ మెషీన్లు వచ్చినప్పటికీ, పాత భయాల వల్ల చాలామంది ఇప్పటికీ ఈ ‘అనీవెన్ అమౌంట్’ పద్ధతినే అనుసరిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Rythu Bharosa: రైతుల అకౌంట్లో రైతు భరోసా డబ్బులు.. ఎలా చెక్‌ చేసుకోవాలి? వీరికి మాత్రం రావు..!

పెట్రోల్ పోయించేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • కేవలం డబ్బులు మార్చి చెప్పడమే కాదు, పెట్రోల్ పోయించేటప్పుడు ఈ కింది విషయాలను కూడా తప్పక గమనించాలి:
  • జీరో (Zero) చెక్ చేయండి: పెట్రోల్ పోయడం ప్రారంభించే ముందు మీటర్ ‘0’ వద్ద ఉందో లేదో ఖచ్చితంగా చూడండి.
  • రీడింగ్ వేగం: మీటర్ రీడింగ్ అసాధారణ వేగంతో పరిగెడుతుంటే అనుమానించాల్సిందే.
  • రసీదు అడగండి: పెట్రోల్ పోయించుకున్నాక తప్పనిసరిగా బిల్లు లేదా రసీదు తీసుకోండి. ఏదైనా ఫిర్యాదు చేయాలన్నా ఇది ఆధారంగా పనిచేస్తుంది.
  • డెన్సిటీ (Density): పెట్రోల్ బంక్ మీటర్ వద్ద డెన్సిటీ రీడింగ్ కూడా ఉంటుంది. అది ప్రభుత్వం నిర్ణయించిన ప్రమాణాల మేరకు ఉందో లేదో అప్పుడప్పుడు గమనించాలి.

ఇది కూడా చదవండి: DMart ఏప్రిల్ 4వ వారం మెగా ఆఫర్లు.. 80% వరకు డిస్కౌంట్.. బై వన్ గెట్ వన్ ఫ్రీ డీల్స్‌తో కస్టమర్లకు పండుగ!

ఇది కూడా చదవండి: Silver Price Crash: వెండి ధరల్లో పెను పతనం? కిలో వెండి లక్షకు చేరుతుందా? మార్కెట్‌లో ప్రకంపనలు.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Gold Price Today: దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us