AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Story: ఉద్యోగం వదిలేసి కోట్లు సంపాదిస్తున్నాడు.. 4 నెలల్లోనే రూ.1 కోటి విలువైన కంపెనీని నిర్మించిన 24 ఏళ్ల యువకుడు!

Success Story: తన లక్ష్యానికి చేరుకోవడానికి ఉజ్వల్ రాత్రింబవళ్లు శ్రమించాడు. క్రియేటర్ల అవసరాలను తీరుస్తూ తన ప్లాట్‌ఫామ్‌ను డెవలప్ చేశాడు. ఫలితంగా కేవలం 4 నెలల వ్యవధిలోనే అతని కంపెనీ టర్నోవర్ రూ.1 కోటి రూపాయలకు చేరుకుంది. ఇప్పుడు ఇది భారతదేశపు బెస్ట్ ఇన్‌స్టాగ్రామ్ ఆటోమేషన్ ప్లాట్‌ఫామ్స్‌లో ఒకటిగా గుర్తింపు పొందింది..

Success Story: ఉద్యోగం వదిలేసి కోట్లు సంపాదిస్తున్నాడు.. 4 నెలల్లోనే రూ.1 కోటి విలువైన కంపెనీని నిర్మించిన 24 ఏళ్ల యువకుడు!
Success Story
Subhash Goud
|

Updated on: Apr 21, 2026 | 12:47 PM

Share

Success Story: కంటెంట్ క్రియేటర్ల కష్టాలను గుర్తించి, వారికి పరిష్కారాన్ని చూపడం ద్వారా ఒక యువకుడు ఎలా సక్సెస్ అయ్యాడో తెలిపే స్పూర్తిదాయక కథనం ఇది. నేటి డిజిటల్ యుగంలో ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్స్ ద్వారా లక్షలాది మంది కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. అయితే క్రియేటర్లు మంచి కంటెంట్ అందిస్తున్నప్పటికీ, వారికి వచ్చే వేలాది డైరెక్ట్ మెసేజ్‌లు (DMs), కామెంట్లు, ఆడియన్స్ ఎంగేజ్‌మెంట్‌ను మేనేజ్ చేయడం పెద్ద తలనొప్పిగా మారింది. ఈ సమస్యను గమనించిన ఉజ్వల్, అతని కో-ఫౌండర్, దీనికి పరిష్కారంగా ‘ఇన్‌స్టాగ్రామ్ ఆటోమేషన్ ప్లాట్‌ఫామ్’ అనే సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చారు.

ఇది కూడా చదవండి: DMart ఏప్రిల్ 4వ వారం మెగా ఆఫర్లు.. 80% వరకు డిస్కౌంట్.. బై వన్ గెట్ వన్ ఫ్రీ డీల్స్‌తో కస్టమర్లకు పండుగ!

తన్మయ్ భట్ రిజెక్ట్ చేసినా వెనకడుగు వేయలేదు

ఉజ్వల్ తన ప్రయాణంలో ఎన్నో ఆటంకాలను ఎదుర్కొన్నాడు. సరైన ఫండ్స్ లేకపోవడం, మార్కెటింగ్ స్ట్రాటజీలు తెలియకపోవడం వంటి సవాళ్లు ఎదురయ్యాయి. చివరికి ప్రముఖ యూట్యూబర్ తన్మయ్ భట్ కూడా ఉజ్వల్ ఐడియాను రిజెక్ట్ చేశాడట. కానీ, తన ఐడియాపై నమ్మకంతో పట్టుదలతో ముందుకు సాగాడు.

ఇన్‌స్టాగ్రామ్ ఆటోమేషన్ అంటే ఏంటి?

క్రియేటర్లు పోస్ట్ చేసినప్పుడు వచ్చే వేలాది మెసేజ్‌లకు ఆటోమేటిక్‌గా రిప్లై ఇవ్వడం, లింక్స్ పంపడం వంటి పనులను ఈ సాఫ్ట్‌వేర్ చేస్తుంది. దీనివల్ల క్రియేటర్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా, వారి ఫాలోవర్లతో కమ్యూనికేషన్ మెరుగుపడుతుంది.

కేవలం 4 నెలల్లోనే అద్భుతం

తన లక్ష్యానికి చేరుకోవడానికి ఉజ్వల్ రాత్రింబవళ్లు శ్రమించాడు. క్రియేటర్ల అవసరాలను తీరుస్తూ తన ప్లాట్‌ఫామ్‌ను డెవలప్ చేశాడు. ఫలితంగా కేవలం 4 నెలల వ్యవధిలోనే అతని కంపెనీ టర్నోవర్ రూ.1 కోటి రూపాయలకు చేరుకుంది. ఇప్పుడు ఇది భారతదేశపు బెస్ట్ ఇన్‌స్టాగ్రామ్ ఆటోమేషన్ ప్లాట్‌ఫామ్స్‌లో ఒకటిగా గుర్తింపు పొందింది.

“ఉద్యోగం అంటే ఒకరి కింద పనిచేయడం.. వ్యాపారం అంటే పదిమందికి పని ఇవ్వడం” అనే సూత్రాన్ని నమ్మిన ఉజ్వల్.. నేటి యువతకు ఒక గొప్ప రోల్ మోడల్. రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపించాడు.

ఇది కూడా చదవండి: Silver Price: వెండి ప్రియులకు అదిరిపోయే శుభవార్త.. భారీగా తగ్గిన సిల్వర్‌

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us