విఫలం కాదు.. 95 శాతం విజయమే.. ఇంకా ఏడాది సమయం ఉంది !

చంద్రయాన్-2 మిషన్ లో విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు రావడం నిలిచిపోయినంత మాత్రాన.. అది విఫలమైనట్టు కాదని నిపుణులు అంటున్నారు. అసలు ఈ మిషన్ లైఫ్ స్పాన్ (జీవితకాలం) ఇంకా ఏడాది ఉందని, ఆర్బిటర్ ఇంకా పని చేస్తూ.. అతి దూరం నుంచే జాబిల్లి గురించి అధ్యయనం చేస్తూనే ఉంటుందని వారు పేర్కొంటున్నారు. మిషన్ లో కేవలం 5 శాతం మాత్రమే విఫలమయింది. విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ రెండూ మిగతా 95 శాతం చంద్రుని కక్ష్యలో పరిభ్రమిస్తుంటాయని […]

విఫలం కాదు.. 95 శాతం విజయమే.. ఇంకా ఏడాది సమయం ఉంది !
Follow us

| Edited By:

Updated on: Sep 07, 2019 | 11:40 AM

చంద్రయాన్-2 మిషన్ లో విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు రావడం నిలిచిపోయినంత మాత్రాన.. అది విఫలమైనట్టు కాదని నిపుణులు అంటున్నారు. అసలు ఈ మిషన్ లైఫ్ స్పాన్ (జీవితకాలం) ఇంకా ఏడాది ఉందని, ఆర్బిటర్ ఇంకా పని చేస్తూ.. అతి దూరం నుంచే జాబిల్లి గురించి అధ్యయనం చేస్తూనే ఉంటుందని వారు పేర్కొంటున్నారు. మిషన్ లో కేవలం 5 శాతం మాత్రమే విఫలమయింది. విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ రెండూ మిగతా 95 శాతం చంద్రుని కక్ష్యలో పరిభ్రమిస్తుంటాయని సాక్షాత్తూ ఇస్రోకు చెందిన ఓ అధికారి తెలిపారు. ఆర్బిటర్ చంద్రునికి సంబంధించిన పలు ఫోటోలను తీసి తమ సంస్థకు ఏడాదిగా పంపుతూనే ఉంటుందని ఆయన చెప్పారు. అలాగే లాండర్ స్టేటస్ ఎలా ఉందో, దాని పరిస్థితి ఏమిటో ఆర్బిటర్ ఛాయాచిత్రాలు తీస్తుందని వెల్లడించారు. లాండర్ లోని రోవర్ జీవితకాలం పరిమితమే అయినా దాని పనితీరు అద్భుతమన్నారు. .

ఈ మిషన్ లో జీ ఎస్ ఎల్ వీ మార్క్-3 రాకెట్ చంద్రుని కక్ష్యలో విజయవంతంగా ప్రవేశించడం భారత భవిష్యత్ అంతరిక్ష కార్యక్రమానికి ఓ పెద్ద ముందడుగు అని చెప్పవచ్చునని నిపుణులు అంటున్నారు. వేగంగా ప్రయాణిస్తున్న ఒక రైలు నుంచి వేలాది కిలోమీటర్ల దూరంలో వెళ్తున్న మరో రైలుపైకి బుల్లెట్ ని ప్రయోగించడమే వంటిదే ఇదని వారు అభివర్ణించారు. ఈ మిషన్ దాదాపు 140 మిలియన్ డాలర్ల వ్యయంతో చేపట్టారు. కానీ అమెరికా తన అపోలో కార్యక్రమాలకు అత్యధికంగా… దాదాపు 100 బిలియన్ డాలర్లను వ్యయం చేసింది. విక్రమ్ లాండర్ నుంచి చివరి క్షణంలో సంకేతాలు నిలిచిపోయాయని, ఇది సక్సెస్ అయి ఉంటే అమెరికా, రష్యా, చైనా తరువాత ఇండియాకూడా నాలుగో దేశంగా అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించి ఉండేదని అంటున్నారు.

ఈ మిషన్ లో చివరి 15 నిముషాల టెన్షన్ భరించలేనిదని ఇస్రో అంగీకరించింది. ఎవరైనా ఒక వ్యక్తి హడావుడిగా వచ్చి.. ఒక పసిబిడ్డను మీ చేతుల్లో పెడితే మీరు సపోర్టుగా ఆ బిడ్డకు నిలబడతారా ? ఆ బిడ్డ అటూ, ఇటూ కదులుతూ మీ చేతి నుంచి జారిపోవడానికి ప్రయత్నిస్తుంటే ఆ పసికందును భద్రంగా, మన చేతి పట్టు నుంచి జారిపోకుండా చూసేందుకు పట్టుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తామో.. అలాంటిదే ఈ మిషన్ ప్రయోగం కూడా అని ఇస్త్రో చైర్మన్ శివన్ వ్యాఖ్యానించారు. ఇలాఉండగా..ఈ మిషన్ విఫలమైందని చెప్పడం సరికాదని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా అన్నారు. కమ్యూనికేషన్ తెగిపోలేదని, ఇండియాలోని ప్రతి భారతీయుడూ ఈ మిషన్ హార్ట్ బీట్ ని ఫీలవుతున్నాడని ఆయన పేర్కొన్నారు. మొదటిసారి విఫలమైతే.. మళ్ళీ, మళ్ళీ ప్రయత్నాలు చేస్తూనే ఉండాల్సిందే అని ఆనంద్ మహేంద్రా అంటున్నారు. మన ఇస్రో శాస్త్రవేత్తలకు మనం సెల్యూట్ చేయాలి.. గత జులై నెలలో ఈ ప్రయోగం విజయవంతం కాలేదా అని ప్రశ్నించారు.