ఆ ‘నో లుక్ సిక్స్’ ఏంటీ బ్రో.! పిచ్చోళ్లయిపోయారంతా.. SRHకి మరో ఆణిముత్యం దొరికేశాడోచ్..
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించిన సలీల్ అరోరా ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కేవలం 10 బంతుల్లోనే 30 పరుగులు చేసి, బుమ్రా బౌలింగ్‌లో సిక్సర్ కొట్టిన ఈ యువ కెరటం గురించి ఇక్కడ తెలుసుకోండి.

క్రికెట్ అంటేనే అద్భుతాలకు వేదిక. ముఖ్యంగా ఐపీఎల్ లాంటి స్టార్ లీగ్‌లలో ఎక్కడో మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన కుర్రాళ్లు రాత్రికి రాత్రే స్టార్లుగా మారిపోతుంటారు. ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్న సలీల్ అరోరా విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సలీల్ ఆడిన తీరు చూసి క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యపోయింది.
ముంబై విసిరిన 244 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, నితీష్ కుమార్ రెడ్డి అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన సలీల్ అరోరా తుపాకీ గుండులా దూసుకుపోయాడు. కేవలం 10 బంతుల్లోనే 2 ఫోర్లు, 3 భారీ సిక్సర్ల సాయంతో 30 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ముఖ్యంగా ప్రపంచ నంబర్ వన్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో అతను కొట్టిన ఆ సిక్సర్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన సలీల్, తన తండ్రి రాకేష్ అరోరా కలను నెరవేర్చుతున్నాడు.
తండ్రి కూడా జిల్లా స్థాయి క్రికెటర్ అయినప్పటికీ, ఆర్థిక కారణాల వల్ల ఆటను వదులుకుని వ్యాపారంలో స్థిరపడ్డారు. కానీ తన కొడుకును గొప్ప క్రికెటర్‌గా చూడాలనే తండ్రి ఆశను సలీల్ నిలబెట్టుకున్నాడు. గత ఏడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కేవలం 39 బంతుల్లోనే సెంచరీ బాది సంచలనం సృష్టించిన ఈ యువకుడిని, ఐపీఎల్ వేలంలో సన్‌రైజర్స్ భారీ పోటీ మధ్య రూ. 1.50 కోటికి దక్కించుకుంది. అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ లాంటి హిట్టర్లు ఉన్న జట్టులో సలీల్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం నిజంగా అభినందనీయం.
𝙉𝙊 𝙇𝙊𝙊𝙆. 𝙉𝙊 𝙁𝙀𝘼𝙍 🔥
Shot of extreme confidence from Salil Arora 🫡
Updates ▶️ https://t.co/ypWTkEr2Rc#TATAIPL | #KhelBindaas | #MIvSRH pic.twitter.com/hC8aoPTvCm
— IndianPremierLeague (@IPL) April 29, 2026
Also Read: కడుపు ఉబ్బిపోయి కనిపించిన భారీ కొండచిలువ.. పట్టుకుని పొట్ట కోసి చూడగా.. ఆశ్చర్యం.!
