AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డెలివరీ బాయ్స్, డ్రైవర్లకు తెలంగాణ సర్కార్ ‘మే డే’ కానుక.. గిగ్ వర్కర్ల బిల్లుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్

తెలంగాణలోని లక్షలాది మంది గిగ్ వర్కర్ల జీవితాల్లో మే డే (మే 1) కొత్త వెలుగులు నింపింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 'తెలంగాణ ప్లాట్‌ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ బిల్లు'కు రాష్ట్ర గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో, నేడు గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబర్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో పనిచేసే డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లకు చట్టబద్ధమైన రక్షణ లభించనుంది.

డెలివరీ బాయ్స్, డ్రైవర్లకు తెలంగాణ సర్కార్ ‘మే డే’ కానుక.. గిగ్ వర్కర్ల బిల్లుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్
Telangana Platform Based Gig Workers Bill
Prabhakar M
| Edited By: |

Updated on: May 01, 2026 | 9:45 AM

Share

తెలంగాణలోని లక్షలాది మంది గిగ్ వర్కర్ల జీవితాల్లో మే డే (మే 1) కొత్త వెలుగులు నింపింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘తెలంగాణ ప్లాట్‌ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ బిల్లు’కు రాష్ట్ర గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో, నేడు గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబర్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో పనిచేసే డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లకు చట్టబద్ధమైన రక్షణ లభించనుంది.

తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ బిల్లు గిగా వర్కర్లకు సామాజిక భద్రత కల్పిస్తోంది. పని భద్రత, ఆరోగ్య బీమా, ఇతర సామాజిక భద్రతా పథకాలను అందించడమే ఈ చట్టం ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా కంపెనీల నియంత్రిస్తూ.. అగ్రిగేటర్ల ఇష్టారాజ్యానికి చెక్ పెడుతూ, గిగ్ వర్కర్ల హక్కులకు చట్టబద్ధత కల్పించారు. అంతేకాదు సర్వీస్ టాక్స్‌లో కొంత భాగాన్ని ప్రత్యేకంగా గిగ్ వర్కర్ల సంక్షేమ నిధికి మళ్లించేలా నిబంధనలు రూపొందించారు. నిర్ణీత పనివేళలు మరియు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నారు.

కార్మిక శాఖ ఆధ్వర్యంలో అగ్రిగేటర్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, మరో 10 నుండి 15 రోజుల్లో పూర్తిస్థాయి మార్గదర్శకాలను విడుదల చేయనున్నారు. అసంఘటిత రంగంలో ఉన్న గిగ్ ఎకానమీలో ఈ చట్టం ఒక విప్లవాత్మక మార్పుగా నిలవనుంది. దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల హక్కుల కోసం జరుగుతున్న పోరాటంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఒక మైలురాయిగా నిలుస్తుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర